సాక్షి, అమరావతి: వాలంటీర్ల పట్ల పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని తెలిపింది.
కాగా మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు.
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు.
చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్
Comments
Please login to add a commentAdd a comment