vasi reddy padma
-
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
-
పవన్ కళ్యాణ్ నోటి దూల వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాల్సిందే...కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
-
వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: వాలంటీర్ల పట్ల పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని తెలిపింది. కాగా మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్ -
టీడీపీ నేత లైంగిక వేధింపులు.. మహిళా కమిషన్ సీరియస్
సాక్షి, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల లైంగిక వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకురావడమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ వినోద్ జైన్ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిందన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదన్నారు. కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. -
ఆర్జీవీపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఆర్జీవీపై ఏపీ మహిళా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌపది ముర్ముపై వర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ తరపున వర్మకు నోటీసులు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. వర్మ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. చదవండి: అద్భుతమైన షూటింగ్ స్పాట్లు.. అవి ఎక్కడ ఉన్నాయంటే? మహిళా భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. న్యూఢిల్లీలో శనివారం జాతీయ మహిళా కమిషన్ సెమినార్‌కు హాజరైన వాసిరెడ్డి పద్మ ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా కమిషన్ చొరవతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేయడం సంతోషకరమన్నారు. మహిళా కమిషన్ ఏడాది కార్యచరణ 'సబల'లో భాగంగా మహిళలపై లైంగిక వేధింపులు-పరిష్కారాల అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా వేదిల నుంచి తయారు చేసి సమర్పించిన నివేదిక నేపథ్యంలో ఏపీ సర్కారు తక్షణమే స్పందించడంపై వాసిరెడ్డి పద్మ ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ రాష్ట్రంలో మహిళల భద్రతకు చేపట్టిన కార్యచరణ ప్రణాళికను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మకు నివేదించామన్నారు. పదిమందికి మించి మహిళలు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు తప్పనిసరని.. మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందన్నారు. అదే విధంగా స్థానిక ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుపై కూడా జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. అక్రమరవాణా నిరోధానికి పోలీసు శాఖ సమన్వయంతో మహిళా కమిషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. -
‘మహిళలకు సంబంధించిన విషయాల్లో రాజకీయం సరికాదు’
సాక్షి, విజయవాడ: అత్యాచార బాధితుల వద్ద రాజకీయడం చేయడం టీడీపీకి అలవాటైపోయిందని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హాస్పిటళ్ల వద్ద రాజకీయం చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఏ ఘటన జరిగినా టీడీపీ నేతలు మృతదేహాలను కదలనివ్వకుండా అంత్యక్రియలు జరగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ మహిళలకు సంబంధించిన విషయాల్లో రాజకీయం సరికాదని హితవు పలికారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. దుగ్గిరాల ఘటనలో పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారని తెలిపారు. సమాచారం తెలియగానే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. తెనాలి మార్చురీ వద్ద లోకేష్ వస్తున్నారని మృతదేహాన్ని అంత్యక్రియలకు పంపకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్చ అని విమర్శించారు. తిమ్మపూడిలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి, అంత్యక్రియలు సజావుగా జరగకుండా చేస్తున్నారని అన్నారు. ‘బాధితుల వద్ద రాజకీయ ఆందోళనలు చేయడం బాధాకరం. మహిళలకు సంబంధించిన సంఘటనలు జరిగినప్పుడు మహిళా కమిషన్ సమర్ధవంతంగా పని చేస్తోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. మృతురాలి పిల్లల చదువుకు అన్ని చర్యలు తీసుకున్నారు. మృతురాలి భర్త పేర్లు చెప్పినవారినే అరెస్ట్ చేశారు. అనేక రాజకీయ అంశాలు ఉండగా మహిళా కమిషన్‌ను సైతం టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు అన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. కానీ ఏపీలో మాత్రమే అత్యాచారాలపై రాజకీయాలు చేస్తున్నారు.’ అంటూ వాసిరెడ్డి పద్మ ప్రతిపక్ష టీడీపీపై నిప్పులు చెరిగారు. -
ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్
‘సబల’... మహిళకు భరోసానిచ్చే పదం ఇది. తన మీద తనకు అనిర్వచనీయమైన నమ్మకాన్ని కలిగించే పదం. తరతరాలుగా నువ్వు ‘అబలవి, బలహీనురాలివి’ అన్నది సమాజం. ‘నువ్వు సబలవి’ అని చెప్పడమే ఓ ముందడుగు. ‘ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ మహిళ మనసును తాకే నినాదం. తరతరాలుగా మన సమాజం ‘అబలవి, బలహీనురాలివి’ అనే భావాన్ని మహిళల నరనరాన ఇంకింప చేసింది. ‘నువ్వు అబలవి కాదు, సబలవి’ అని ఎంతగా నినదించినప్పటికీ ‘అబల’ అనే భావం మెదడు నుంచి తొలగిపోయేది కాదు. ఏ మాత్రం అవాంఛనీయం కానీ ఆ భావాన్ని ‘సబల’ అనే మూడక్షరాల పదం క్షణం సేపట్లోనే తుడిచేస్తోంది. తాను సబలననే భావనే మహిళను శక్తిమంతం చేస్తుంది. నామకరణంలోనే విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ రూపొందించింది. మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగే కార్యాచరణ. కమిషనే మహిళ దగ్గరకు మహిళాకమిషన్ బాధ్యతలు రాజధానిలో ఆఫీస్‌లో కూర్చుంటే పూర్తయ్యేవి కావు. కమిషన్ దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తే సరిపోదు. బాధిత మహిళలందరూ రాజధానిలో ఉండే కమిషన్ కార్యాలయానికి వెళ్లలేకపోవచ్చు. అందుకే ‘తామే బాధిత మహిళల దగ్గరకు వెళ్లాలి. కష్టంలో నీకు మేము తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. నీ కష్టం నుంచి బయటపడడానికి దారి ఉంది అని చెప్పాలి, ఆ దారిని చూపించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మహిళాకమిషన్. నిస్సహాయ మహిళ ‘ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ నాకు తోడుగా ఉంది. నాకేం భయం అక్కరలేదు’ అనుకున్నప్పుడే కమిషన్ తన బాధ్యతలను విజయవంతం గా నిర్వహించినట్లు... అంటున్నారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. చైతన్య సమావేశాలు ‘సబల’ గురించి అవగాహన కల్పించడానికి రీజియన్ల వారీగా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రీజియన్‌కు గుంటూరులో, కృష్ణ, గోదావరి జిల్లాలకు ఏలూరులో సమావేశాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలకు కడపలో ఈ నెల 30వ తేదీన, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నంలో ఏప్రిల్ ఆరవ తేదీన జరగనున్నాయి. ‘‘మహిళాచైతన్యం విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుందని భావించాం. కానీ ప్రభుత్వ ఉద్యోగినులకు చాలామందికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలో రిపోర్ట్ చేయవచ్చనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ప్రభుత్వాలు ఆ మేరకు ఉద్యోగినులను డార్క్‌లో ఉంచేశాయని తెలిసినప్పుడు ఆవేదన కూడా కలిగింది. దాంతో ఈ సమావేశాలకు ఉద్యోగినుల తరఫున ప్రతినిధులుగా జిల్లా, మండల స్థాయి ఉమెన్ అసోసియేషన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఉమెన్ లీడర్లు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ‘పోష్ యాక్ట్ (పీఓఎస్‌హెచ్) 2013, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ 2013’ గురించి ఉద్యోగినులను చైతన్యవంతం చేస్తారు’’ అని చెప్పారామె. క్యాంపస్ కాప్స్ కాలేజీలు, యూనివర్సిటీల్లో క్యాంపస్ కాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది సబల. ఈ కాప్స్ తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. వాళ్ల స్థాయిని మించిన అంశం అయితే ఉమెన్ కమిషన్‌కు నేరుగా తెలియచేయడానికి వీలుగా ఇందుకోసమే ఒక మెయిల్ఐడీ ఉంటుంది. అలాగే ప్రతి విద్యాసంస్థలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ జాబితాను తప్పకుండా నోటిస్ బోర్డులో ఉంచాలి. గృహ హింస– గడపదాటని శక్తి రక్షణ కల్పించాల్సిన నాలుగ్గోడలే కత్తులబోనుగా మారితే ఇక ఆ మహిళ ఏం చేయాలి? సమాజంలోని హింసలో 30 శాతం గృహహింస కేసులేనంటే నమ్ముతారా? వరకట్న నిరోధక చట్టం ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. మహిళల భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించిన కనీస అవగాహన కూడా ఆ మహిళలకు లేకుండా జాగ్రత్త పడడం ఎంత అనైతికం? మహిళను చైతన్యవంతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు నైతిక విధి కూడా. ‘నువ్వు అబలవి కాబట్టి మేము ఆసరా ఇస్తాం’ అని చెప్పడం లేదు. ‘నువ్వు సబలవి, నీ శక్తి తెలుసుకో’ అని చెబుతోంది. గృహహింసకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఆ యోధ చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది మహిళాకమిషన్. చర్యలు కఠినంగా ఉండక తప్పదు! పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి, భవిష్యత్తులో దాడులను నియంత్రించడానికి ఏకైక మార్గం... చర్యలు కఠినంగా తీసుకోవడమే. అలాగే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడమూ అవసరమే. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం గురించి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేస్తోంది సబల. అలాగే మహిళకు ఎదురయ్యే వేధింపుల్లో తరాలుగా ఎదురవుతున్న సమస్యలిలా ఉంటే... ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వంచనలు తోడయ్యాయి. ఈ సైబర్ నేరాలు, ప్రలోభాల బారిన పడకుండా మహిళలను రక్షించాలంటే ఆ నేరాల పట్ల అవగాహన కల్పించడమే అసలైన మార్గం. ఈ చట్టాల మీద, భద్రత మీద చైతన్యం కలిగించే పోస్టర్లను పంచాయితీ ఆఫీస్‌లో అతికించడంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్ల సహాయంతో గ్రామీణ మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తోంది ‘సబల’. మహిళలు చేతిలో ఉన్న ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి, సమస్యను తెలియాల్సిన చోటకు చేర్చడానికి సులువుగా వాట్సాప్ నంబర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అండగా నిలుద్దాం! సబల ద్వారా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే మహిళాకమిషన్ ఉద్దేశం. అత్యాచారం, లైంగికవేధింపులు, హింసను ఎదుర్కోవడానికి మహిళకు ఆసరాగా ఉన్న చట్టాలేమిటో తెలియచేస్తోంది. బాధితుల్లో, బాధిత కుటుంబాల్లో ౖధైర్యం నింపే బాధ్యతను తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ వంటి ప్రత్యేక చట్టం గురించి కూడా అవగాహన కల్పిస్తోంది సబల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆమె’కు అండగా నిలబడుతోంది. ‘ఆమె’ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో సమాజంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ‘ఆమె’కు అండగా నిలబడాలి. – వాకా మంజులారెడ్డి బాధితుల పక్షాన... పనిప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బాధను దిగ మింగుకునే వారెందరో!. పైగా ఫిర్యాదిచ్చిన వారినే దోషిగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వైనాలు అనేకం. ’సబల– ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ అభాగినులకు అండగా నిలుస్తుంది. ఐసీసీ కమిటీల ఏర్పాటుతో పాటు సబల వాట్సప్ నెంబర్ ను ఉద్యోగినులకు అందుబాటులోకి తేవడం సముచితం. – జి.నిరీష, జూనియర్ అసిస్టెంట్, గుంటూరు మహిళకు మనోధైర్యం లైంగిక వేధింపులు, అవమానాలతో కుంగిపోతున్న మహిళలకు ’సబల’ కొండంత అండ. మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది. – బి. సుశీల, చైర్ పర్సన్, ఏపీజేఏసీ అమరావతి చైతన్యవారధి ‘సబల – అఅఅ’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ (ట్రిపుల్ ఏ) నినాదాన్ని బలంగా వినిపిస్తున్న సబల ప్రభుత్వానికి మహిళలకు మధ్య చైతన్యవారధి. సంక్షేమంతో పాటు రక్షణ, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోన్న తరుణంలో.. ఇంటర్నల్, లోకల్ కమిటీల ఏర్పాటు ఉద్యమంగా సాగుతోంది. – జి. నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్. (రాష్ట్ర జీఎస్టీ) విజయవాడ మహిళల బలం సబల సదస్సులు అర్ధవంతమైన చర్చలకు అవకాశమిచ్చాయి. లైంగిక వేధింపులు, హింసనే కాకుండా అనేక సమస్యల సత్వర పరిష్కారానికి సబల సదస్సులు దోహదపడతాయి. చట్టాల పై అవగాహన కల్పించడం మంచిదైంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని పోష్ చట్టం సబల వేదికల ద్వారా అందరికీ తెలిసి వస్తోంది. – రాజ్యలక్ష్మి, మెంబర్, ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుంటూరు ‘సబల’ పోటీలు! ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ, దిశ చట్టం గురించి స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పిల్లలకు ఒక విషయాన్ని పదిసార్లు పాఠం చెప్పినట్లు చెప్పడం కంటే ఒక పోటీ ద్వారా వాళ్ల మెదడులో ఆ అంశం ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పోటీలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలకు కూడా. రాబోయే తరాలు కూడా ఇదే విషయం మీద శక్తియుక్తులను ధారపోయకుండా ఈ సమస్య ఈ తరంతో ఆగిపోవాలంటే... అమ్మాయిలను చైతన్యవంతం చేయడంతోపాటు అబ్బాయిలను సెన్సిటైజ్ చేయడం కూడా అవసరం. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళాకమిషన్, ఆంధ్రప్రదేశ్ -
అన్నీ రంగాల్లో మహిళకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు
-
‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’
సాక్షి,అమరావతి: మహిళా సాధికారత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫాలితాలు ఇస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. దిశ చట్టం అమలుకై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు. దిశ పేపర్లను లోకేష్ కాల్చేసిన సమయంలో చాలా బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మహిళా అధికారి పై బహిరంగంగా దాడి చేసినా చర్యలు లేవని, అయితే మహిళా సంరక్షణ కోసం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్మార్ట్ ఫోన్ల వినియోగ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీటిపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలలో అవగాహన కూడా కల్పిస్తామన్నారు. ఆపద సమయంలో దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ.. రాష్ట్రాలు దాటి ఢిల్లీలో దిశ యాప్ ద్వారా జిల్లాకి చెందిన మహిళను సురక్షితంగా కాపాడిన ఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. చదవండి: ఆ.. పిల్లలను ఆదుకుంటాం -
ఇళ్ల పట్టాలపై ప్రశంసలు.. సీడీ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి : రేపు (శుక్రవారం) జరగబోయే ఇళ్ల పట్టాల పంపణీ యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అంటూ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సీడీని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి తయారు చేయగా.. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదగా గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష, సుధామూర్తి, అపోలో సంగీతరెడ్డి పద్మావతి వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ జమున, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఫ్రీడ్ హాగ్ యూనిసెఫ్ యస్మిన్ ఆలీ, కర్ణాటక ఉమెన్స్ కమిషనర్ చైర్పర్సన్ ఒడిశా చైర్పర్సన్, మణిపూర్ చైర్పర్సన్, ఎంపీ నవనీత్ కౌర్ హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ సీడీలో వారి అభిప్రాయాలను చెప్పారు. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది) నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు : బొత్స ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మాట్లాడారు. రేపు పేదల సొంతింటి కల నెరవేర్చే రోజుఅని అన్నారు. తొలుత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. తొలివిడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేపడతామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ‘ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. 300 ఎస్ఎఫ్టి ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నాం. స్థలం ఉండి పాకలో ఉండే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తాం. 15.60 లక్షల ఇళ్లకు రూ.1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు ఇస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 17 వేల కొత్త టౌన్‌షిప్‌లు వస్తాయి. రూ.23,538 కోట్ల విలువైన భూమిని పేదలకు అందిస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు’ అని అన్నారు. (పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు) -
విశాఖ ఘటన అమానుషం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: విశాఖ ఘటన అమానుషమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేమ పేరుతో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. బాధితులకు మహిళా కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. (చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక) మహిళా మార్చ్‌లో భాగంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆమె చెప్పారు. రానున్న వంద రోజుల్లో ఇరవై అంశాలపైన మహిళా కమిషన్ సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వంద రోజుల్లో జిల్లా, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ‘దిశ’ సెక్షన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 8న విజయవాడలో రెండు వేల మంది మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. దిశ బిల్లును అమలులోకి తీసుకువచ్చి.. పది రోజుల్లోనే శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ') -
‘వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించం’
సాక్షి, విజయవాడ : బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన దారుణాలను ఖండిస్తున్నామని ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించమని హెచ్చరించారు. డిపార్ట్మెంట్లో వివక్షత ప్రస్తావన లేవనెత్తడం హేయమైన చర్య అన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు మహిళ కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లోని మహిళ ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో వార్డెన్లు సైతం కొంత మంది వేధిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు వాసిరెడ్డి పద్మ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రక్షణ కల్పించాలని సంకల్పించారని, మహిళ భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల్లోని మహిళ ఉద్యోగులతో చర్చించామని తెలిపారు. ఈ రోజు ముప్పై మంది మహిళా అధికారులు విచారించారని, మహిళ కమిషన్‌కు ప్రతి రోజు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మహిళ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. నేరస్థులకు ఇరవై ఒక రోజులో శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో మహిళ ఉద్యోగుల భద్రతకు జగన్ ప్రభుత్వం ఏళ్ల వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. -
లాక్డౌన్లో గృహహింస పెరిగింది
-
లాక్డౌన్లో గృహహింస.. ఫిర్యాదులకు వాట్సప్
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో మహిళలపై గృహహింస పెరుగుతోందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లాక్డౌన్ విధించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా మహిళలపై గృహహింస కేసులు పెరుగాయని జాతీయ మహిళా కమిషన్ కూడా తన నివేదికలో పేర్కొంది. దీనితో పాటు లాక్డౌన్ సమయంలో సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో గృహహింసపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దృష్టిపెట్టారు. లాక్డౌన్ సమయంలో మహిళల ఇబ్బందులకు గురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీని కోసం వాట్సప్ నెంబర్లను సైతం ఆమె ప్రజలకు అందుబాటులో ఉంచారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. లాక్డౌన్, కరోనా పరిస్థితులను మహిళలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా ఎదుర్కోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు. మహిళలు మానసికంగా కుంగిపోకుండా కుటుంబసభ్యులు అండగా ఉండాలన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా హెల్ప్ డెస్క్‌కి సమాచారం ఇవ్వండని తెలిపారు. వాట్సాప్‌కు మెసెజ్ వచ్చిన వెంటనే స్పందిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అందుబాటులో హెల్ప్ డెస్క్ నెంబర్లు.. 9701056808 ,9603914511 ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ : 6301411137 -
ఆ నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం
సాక్షి, గుంటూరు: యూకేజీ చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నింది తుడిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారిని శనివారం ఆమె పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.బాబులాల్‌కు సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వపరంగా రావాల్సిన సహాయ సహకారాలు అందేలా చూస్తామని చిన్నారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. కేసులో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించేలా రాష్ట్ర మహిళా కమిషన్ సూచనలు జారీ చేస్తుందన్నారు. క్రైమ్ రికార్డుల డిజిటలైజేషన్లో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారి వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. -
చంద్రబాబు కేబినెట్ పెడతాననడం హాస్యాస్పదం
-
చెక్కులతో చేతులు దులుపుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘పసుపు కుంకుమ’ పథకం పేరుతో మహిళలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మహిళలను మభ్యపెట్టేందుకు ఈ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు దళితులకు దక్కాల్సిన 2137.66 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. తీరా లబ్ధిదారులు వెళ్లే సరికి ఖాళీ చెక్కులను ఇచ్చి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. ఈ పథకంపై సొంత పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మా, బుట్టా రేణుకా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
అవి నీవు పెట్టించిన కుట్ర కేసులే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం చంద్రబాబులేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక సోనియాగాంధీతో కుమ్మక్కై ఆనాడు పెట్టిన కుట్ర కేసులనే జగన్ అఫిడవిట్లో చూపించారన్నారు. వైఎస్సార్ బతికున్నంత వరకూ జగన్మోహన్ రెడ్డిపై కేసులు లేవన్నారు. ఎప్పడయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్సీపీ స్థాపించారో అప్పుటి నుంచి కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా మాట్లాడారు. 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు నేడు జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. 17 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారో ఎన్నికల అఫిడవిట్లో పేర్కొని ప్రజల ముందుకు రావాగలరా అని ప్రశ్నించారు. ప్రజల మనసులు గెలుచుకున్న జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ఈ ఐదేళ్లు చేతగాని దద్దమ్మ పాలన చేసి..నేడు ప్రతిపక్షనేతపై బురదచల్లడం దారుణమని చెప్పారు. ఐదేళ్లల్లో 100 రెట్ల ఆస్తులు ఎలా పెరిగాయి? చంద్రబాబు ఈ ఐదేళ్లలో తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే 100 రెట్ల ఆస్తులను పెంచుకున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. చేతికి వాచీ,వేలికి ఉంగరం లేదని చెప్పుకునే నిరుపేద చంద్రబాబు ఆస్తులు ఈ ఐదేళ్లలో భారీగా ఎందుకు, ఎలా పెరిగాయో వివరంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు కట్టకుండానే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు, కమీషన్లు దండుకుని బాబు కుటుంబం ఆస్తులు అమాంతం పెంచుకుందని మండిపడ్డారు. సీఎం ఆస్తి సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని ఎనిమిదేళ్ల క్రితమే తెహల్కా పత్రిక పేర్కొందని గుర్తు చేశారు. శాంతియుతంగా సాగుతున్న జగన్ 9 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుట్రలపై వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని, ఏ రోజైనా ఒక చిన్న ఘటన కూడా ఈ రాష్ట్రంలో జరిగిందా అని ప్రశ్నించారు. ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా శాంతియుతంగానే పార్టీని నడిపిస్తున్నారన్నారు. చివరికి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేశారని, ఆయన చినాన్న వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితులను కాపాడుతున్నారన్నారు. ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, అరాచకం సృష్టిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను బేఖాతర్ చేస్తున్నారని, ఓటమి భయంతో బాబు, ఆయన తాబేదారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారు చరిత్రలో పతనమవడం ఖాయమని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. -
రాజకీయం కోసం ఇంత కిరాతకమా
హత్య వెనక టీడీపీ పెద్దల హస్తం వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దల హస్తం ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఆమె శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి మరణంతో పార్టీ మొత్తం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మంత్రి ఆదినారాయణరెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. ఆయన, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని తాము కోరితే, ‘సిట్’ వేశామని ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల్లో వేసిన ‘సిట్’ దర్యాప్తులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్‌లా వ్యవహరించే దర్యాప్తు సంస్థలతో వాస్తవాలు బయటకువస్తాయనే నమ్మకం తమకు లేదని వాసిరెడ్డి పద్మ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి ‘‘కడప పార్లమెంట్ స్థానంలో గెలిచి తీరుతాం, పులివెందులలో ఎలా నెగ్గుతామో చేసి చూపిస్తాం అంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. గత ఐదేళ్లుగా కడప జిల్లాను, వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కడపను గెలుస్తాం, ఏం చేస్తామో చూడండంటూ మొత్తం టీడీపీ శక్తులు ఆ జిల్లాపైనే దృష్టి పెట్టాయి. చంద్రబాబు డైరెక్షన్లో ఎలాంటి రాజకీయాలు జరిగాయో రాష్ట్ర ప్రజలంతా చూశారు. కడప ఎంపీ అభ్యర్థిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేసినప్పుడే ఒక మహాకుట్రకు బీజం పడినట్లుగా అర్థమవుతోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి ఎలాంటి ఆకృత్యాలు చేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. కీలకమైన ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఉన్న వివేకానందరెడ్డి హత్యపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి. వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తును జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి. తద్వారా రాష్ట్ర సర్కారు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, ఆది ప్రమేయం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యోదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రమేయం ఉందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైఎస్ కుటుంబాన్ని లేకుండా అంతంచేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. 1998 నుంచీ ఈ రోజు వరకూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వేసే ప్రతి అడుగూ వైఎస్సార్ కుటుంబాన్ని అంతమొందించేలానే ఉందన్నారు. ఇప్పుడు వివేకాని హత్య చేశారన్నారు. 1998లో వైఎస్ రాజారెడ్డి హత్యలో టీడీపీ ప్రమేయం ఉందన్నారు. అందులోని నేరస్తులను సత్ప్రవర్తన పేరుతో నిర్దోషులుగా విడుదల చేశారన్నారు. 2009, ఆగస్టు 30న అసెంబ్లీలో ‘ఎవరు ఫినిష్ అయిపోతారో చూడండి’ అని వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారని, ఆ తరువాత రెండ్రోజులకే వైఎస్ హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయారన్నారు. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ఆదినారాయణరెడ్డి నీతి, విలువలకు కట్టుబడని దుర్మార్గమైన వ్యక్తి అని అన్నారు. హత్యలో సూత్రధారులు చంద్రబాబు, లోకేష్ అయితే కుట్రను అమలుచేసింది ఆది అని స్పష్టం చేశారు. కుటుంబ కలహాల్లేవు వివేకాతో ఎటువంటి కుటుంబ కలహాలు లేవని, జమ్మలమడుగు ఎన్నికల ఇంఛార్జిగా ఉండి గురువారం రాత్రి 9.30 గంటల వరకూ పనిచేశారని వివరించారు. లోక్‌సభకు పోటీచేస్తానని వివేకానందరెడ్డి ఏనాడూ అనలేదని.. జగన్‌ను సీఎంని చేయాలనే ఎప్పుడూ కోరుకున్నారన్నారు. కుటుంబ సమస్యలు ఉన్నట్లుగా టీడీపీ దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. హత్యలో చంద్రబాబే సూత్రధారి ప్రొద్దుటూరు: రాష్ట్ర మాజీమంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంఘటనలో సీఎం చంద్రబాబునాయుడు సూత్రధారి, మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రధారి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఇది ముమ్మాటికీ టీడీపీ ప్రభుత్వం చేయించిన హత్యేనన్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటూ జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో టీడీపీ మళ్లీ పాత రోజులను తీసుకొస్తుందేమోనని అనుమానం కలుగుతోందన్నారు. ఇది నూటికి నూటొక్క శాతం టీడీపీ కుట్రేనని శివప్రసాద్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇటీవల వివేకాను జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ నియమించిందని ఆయన గుర్తుచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ ఓట్లకు గండికొడతారనే దురుద్దేశంతోనే ఈ హత్య చేయించారని చెప్పారు. వైఎస్ కుటుంబంపై వరుస దాడులు: వైఎస్ కుటుంబంపై ఇలా వరుస దాడులు జరగడం విచారకరమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ సంఘటనలో మరణిస్తే ఆ ఘటనపై నేటికీ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. రెండేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డే ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వివేకా హత్యపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్వల్ల న్యాయం జరగదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి మృతి తీరని లోటు పుంగనూరు (చిత్తూరు జిల్లా): మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వివేకానందరెడ్డి మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పెద్దిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయ నేతగా ఖ్యాతి గడించిన వివేకానందరెడ్డి మరణం పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరనిలోటన్నారు. బాబువి హత్య రాజకీయాలు వైఎస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్ మీడియాతో మాట్లాడారు. అత్యంత సౌమ్యుడుగా పేరుగాంచిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల్లో గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారో అప్పుడే వివేకానందరెడ్డి హత్యకు బీజం పడిందన్నారు. గతంలో వైఎస్ జగన్‌ను కూడా హతమార్చడానికి యత్నించారని వారు గుర్తుచేశారు. హత్య దర్యాప్తునకు చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్‌పై తమకు నమ్మకంలేదని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, టీడీపీ సర్కార్ ఓట్లనే తొలగిస్తోందనుకున్నామని.. కానీ మనుషులనే తొలగిస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వివేకా మృతి తీరనిలోటు : ఉమ్మారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి లేనిలోటు తీర్చలేనిదని వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన లేకపోవటం కుటుంబానికి ఎంత లోటో వైఎస్సార్సీపీకీ అంతే లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు వేసిన రికార్డు వివేకాదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఉమ్మారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాలి: కన్నా వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలి. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసినా సీఎం చంద్రబాబు ఆధీనంలో ఉండే సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకంలేదు. హత్య అత్యంత బాధాకరం: రఘువీరా వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య అత్యంత బాధాకరమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. వివాదాలకు అతీతంగా వ్యవహరించే వివేకాను హత్య చేయడం దారుణమన్నారు. అలాగే, తెలంగాణ ఎంపీ డి. శ్రీనివాస్ కూడా వైఎస్ వివేకా మృతిపట్ల సంతాపం తెలిపారు. ‘వివేకా హత్య వార్త నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఆపద సమయంలో వారి కుటుంబం ధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నా..’ అని పేర్కొన్నారు. హత్యపై లెఫ్ట్ దిగ్భ్రాంతి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపట్ల సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు కూడా శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. ఉమ్మడి ఏపీలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎంఎల్సీగా పనిచేసినా అతి సాదాసీదాగా ఉండే వ్యక్తని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యు డు డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కొనియాడారు. సమగ్ర విచారణ జరపాలి: ఆర్పీఐ వైఎస్ వివేకా దారుణ హత్యపై సమగ్ర విచారణ జరపాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి వైఎస్ వివేకా హత్యోదంతంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కోరారు. గుండెపోటుతో వివేకా అభిమాని మృతి సింహాద్రిపురం: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని హిమకుంట్ల గ్రామానికి చెందిన చవ్వా వెంకటరెడ్డి (50) శుక్రవారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి వార్తలను మీడియాలో చూస్తూ.. తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. -
ఉప ఎన్నికలోస్తే.. బంపర్ మెజారిటీ!
తణుకు (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం 14 నెలల ముందే ఎంపీ పదవులను తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే బంపర్ మెజారిటీతో తమ ఎంపీలు గెలుపొందుతారని తెలియజేశారు. దమ్మంటే ఉప ఎన్నికలను ప్రత్యేక హోదా రిఫెరెండమ్‌గా భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. ఆ పార్టీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఆమోదించిన సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె తెలుగుదేశం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పద్మ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ అస్త్రంగా ఎంపీలు రాజీనామా చేస్తారని రెండేళ్ల కిందనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉండబట్టే లోక్‌సభ స్పీకర్‌ను పదే పదే కలిసి తమ నాయకులు రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులు వదులుకునేందుకు తమ పార్టీ నాయకులు చేసిన రాజీనామాలను చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఆయనకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్న చంద్రబాబు హోదాను నీరుగార్చింది నిజంకాదా అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీల రాజీనామా ఆమోదం తర్వాతనైన చంద్రబాబు సిగ్గుపడి వారి పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని కోరారు. పైకి ఎన్డీయే కూటమి నుంచి బయటికోచ్చానని చెప్పుకుంటున్న బాబు ఇంకా బీజేపీతో చీకటి ఒప్పందాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాటం చేసేది ఎవరో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. -
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
-
టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు
-
చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీ ప్రజలు నష్టపోతున్నారు
-
సీఎం సిగ్గుతో తలదించుకోవాలి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే మహిళలకు రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లి గ్రామంలో ఒక మహిళను అమానుషంగా వివస్త్రను చేసి టీడీపీ నేతల అండతో దాడి చేసిన ఘటనపై చంద్రబాబు, ఆయన కుటుంబీకులు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఘటనను టీడీపీ నేతలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి పైశాచికానందాన్ని పొందుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రితో పాటు అందరూ సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఇద్దరు దంపతులను పక్కన ఉన్న మహిళ దుర్భాషలాడడం, తర్వాత వారిపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రోద్బలం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి, నోటితో కొరికి దారుణంగా దాడి చేశారని మండిపడ్డారు. -
దొరికిన దొంగను కాపాడటమా?
బాబు అనుకూల మీడియాపై మండిపడ్డ వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చే విషయమై దర్యాప్తు చేయాలని తీర్పు వస్తే కొన్ని పత్రికల్లో వార్తలు సరిగా వేయకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. బాబు దొరికిన దొంగ అని తెలిసినా కూడా ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించాయన్నారు. జాతీయ పత్రికలు కూడా బ్యానర్ స్టోరీగా ఇచ్చిన వార్తను.. బాబు అనుకూల పత్రికలు కనిపించకుండా లోపల ఎక్కడో ఇచ్చాయన్నారు. ముఖ్యమంత్రిని అవినీతి నిరోధక శాఖ మందలించినంత పని చేస్తే దాన్ని దాచేసే ప్రయత్నం చేసిన మీడియాకు ఇక మాట్లాడే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. స్విస్ చాలెంజ్ విధానంలో కూడా అలాగే చేశారన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు తప్పుడు పని కూడా దొరతనం అవుతుందంటూ కప్పిపుచ్చడం మంచి పద్ధతి కాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. దోచింది కాపాడుకోవడానికే.. దోచింది కాపాడుకోవడానికి చంద్రబాబు కేంద్రాన్ని, అటార్నీ జనరల్‌ని వాడుకుంటున్నారని విమర్శించారు. కోర్టులు, కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ చాలెంజ్‌లో పారదర్శకత లేదని చెప్పినా వినకుండా చంద్రబాబు దాన్ని కొనసాగించాలనుకోవడం దారుణమన్నారు. -
బాబే క్షమాపణ చెప్పాలి: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచినందుకుగాను రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలపుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్కదానినీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. ప్రజల్ని నమ్మించి గొంతు కోసిన చంద్రబాబు వైఖరిపైనే జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆయన ఎవరినీ వ్యక్తిగతంగా మాట్లాడ్డం లేదని స్పష్టం చేశారు. జగన్ అన్న ఒక్కమాటను సాకుగా చూపి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా మంత్రులు, టీడీపీ నేతలు దూషిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి వాటికి బెదిరేది లేదన్నారు. చంద్రబాబు పాలనపై జగన్ ప్రజల తరఫున ఇంకా గట్టిగా మాట్లాడతారని, ప్రతిపక్ష నేతగా తన విద్యుక్తధర్మాన్ని నెరవేరుస్తారని తెలిపారు. అప్పుడు గుర్తుకురాలేదా?: జగన్ అన్న మాటల్లో సం స్కారం లేదంటున్న టీడీపీ నేతలు, మంత్రులకు.. తాము ఆయన్నుద్దేశించి అసెం బ్లీలో సైకో అని, నేరస్తుడని నిందించినపుడు సభ్యతా సంస్కారాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. -
ఒక్క ఆధారమైనా ఉందా?
జగన్‌పై ఆరోపణలకు దిగడంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘‘తుని సంఘటన జరిగి ఎన్ని రోజులైంది. ఒక్క ఆధారం కూడా చూపకుండానే ఆ ఘటనకు కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఒకే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని కనీసం ఒక్క ఆధారమైనా చూపలేదు. జగన్మోహన్రెడ్డిని ప్రతి సందర్భంలోనూ ప్రజలకు శత్రువును చేయాలన్న ఉద్దేశమే ముఖ్యమంత్రిది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతపై అవసరం ఉన్నా లేకపోయినా.. ఆధారం లేకపోయినా అదే పనిగా ఆరోపణలు చేయడం చూస్తుంటే చంద్రబాబుది ఎంత క్రిమినల్ మనస్తత్వమో బయటపడుతోంది’’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా.. ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి ఏది ఎదురైనా వెంటనే ఆ బురదను వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటించడమన్నది చంద్రబాబు రెండేళ్లగా అమలు చేస్తున్న విధానమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నేతపై పదేపదే ఆరోపణలు చేయడం విజ్ఞత అనిపించుకోదన్నారు. తుని ఘటనలపై ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రికి దమ్ముంటే వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. -
పెరిగిన ధరలు, ఎండిన పంటలపై చర్చేది?
♦ భూములు దోచిపెట్టడంపైనే కేబినెట్లో చర్చించారు ♦ భూముల లీజును 99 ఏళ్లకు పెంచడం అత్యంత దుర్మార్గం ♦ వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి సాక్షి, హైదరాబాద్: సాగునీరందక ఒకపక్క ఎండుతున్న పంటలు.. మరోవైపు సామాన్యుడు ఊహించనంత స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల.. రాష్ట్రమంతటా కరువుతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపై కనీసం చర్చ చేపట్టకపోవడాన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ పాలనా విధానమేంటో తెలిసిపోతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేబినెట్లో ఎలాంటి చర్చ జరగకుండానే చాపచుట్టేశారు. ధరలపై సమగ్ర చర్చే లేదు. రైతుల సమస్యలపైనా చర్చలేదు. అరుణ్‌జైట్లీ ప్రత్యేకహోదా శకం ముగిసిందంటూ వ్యాఖ్యలు చేసిన తరువాత రాష్ట్రానికి జరగబోయే అన్యాయంపై కనీసం చర్చ జరపలేదు. నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురుచూస్తుంటే.. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై చర్చలేదు. రైతులనుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి సంబంధించిన భూముల లీజులపై మాత్రం నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆమె తూర్పారబట్టారు. ప్రభుత్వ భూముల లీజు విషయంలో 33 ఏళ్లే సుదీర్ఘ గడువుగా భావిస్తుంటే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ గడువును 99 ఏళ్లకు పెంచడం అత్యంత దుర్మార్గమని పద్మ దుయ్యబట్టారు. భూమిలేని నిరుపేద రైతులు ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకుంటామంటే పారిశ్రామికవేత్తల మాదిరి గా వారికీ 99 ఏళ్లపాటు లీజుకిస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో అందరికీ తెలిసిన విషయమేనని, సీఎం, మంత్రులకూ ఇది తెలిసినా.. ఏమీ తెలి యనట్టు అక్రమ రవాణా నివారణకు రూ.18 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాననడం మరో అవినీతికి పాల్పడడానికేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత రూ.100 కోట్లు ఇస్తామనడం అందరినీ మోసం చేసినట్టుగానే.. వారినీ మోసం చేయడమేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఇంతకాలం తరువాత కాపుల రిజర్వేషన్ల అంశం సర్కారుకు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. -
ఏపీ కరువుతో అల్లాడుతోంది
196 మండలాలే కరువు ప్రాంతాలా?: వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలూ కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే.. కేవలం 196 మండలాల్నే కరువు ప్రాంతాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించడం నయవంచన, మోసం తప్ప మరొకటి కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ధ్వజమెత్తింది. తక్షణమే యావత్ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సాయంకోసం కేంద్రం వద్దకు వెళ్లాలని, అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరువుపై ఏం కార్యాచరణ చేపట్టబోతున్నారో వారంరోజుల్లో వెల్లడించాలన్నారు. ఆగస్టు 18న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా చేసిన ప్రకటనలో రాష్ట్రంలో 325 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారని, అలాంటిది తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటనలో సగానికిసగం తగ్గించి 196 మండలాల్లోనే కరువుందని వెల్లడించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఎంత దారుణం.. శ్రీకాకుళం మొత్తం కరువు విలయతాండవం చేస్తూంటే కేవలం 10 మండలాల్లోనే కరువు ఉందంటారా? ఎంత దారుణమని పద్మ ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ 8 లక్షల ఎకరాల్లో మరొక్క తడి నీరందకపోతే వరికంకులు మాడిపోతాయని, ప్రభుత్వం మాత్రం చుక్క నీరందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక జలసిరితో కళకళలాడుతుంటే.. దిగువ రాష్ట్రమైన ఏపీ, కృష్ణాడెల్టా, రాయలసీమ ఎండిపోతోందన్నారు. సీఎం చంద్రబాబు పొరుగురాష్ట్రమైన కర్ణాటకకు ఇక్కడి పరిస్థితి వివరించి కృష్ణా నీటిని విడుదల చేయాలని ఎందుకు కోరట్లేదని, ఈ విషయంలో కేంద్రంద్వారా ఎందుకు ప్రయత్నించట్లేదని ఆమె ప్రశ్నించారు. ఇది మరో వంచన... ఇప్పటికే రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించి రైతుల్ని వంచించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కరువు మండలాల ప్రకటనలోనూ మరోసారి వంచించిందని పద్మ విమర్శించారు. ప్రతికూల వ్యవసాయ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాల వద్దకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళుతుంటే అధికారపార్టీ ఎగతాళి చేయడం దారుణమన్నారు. అసలు పంటలు తగులబడే పరిస్థితులు ప్రభుత్వమే కల్పిస్తున్నపుడు జగన్ తప్పక రైతులకు అండగా ఉంటారన్నారు. -
నితీశ్‌ను చూసైనా నేర్చుకోండి
సీఎంకు వాసిరెడ్డి పద్మ సూచన సాక్షి, హైదరాబాద్: బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏమీ ప్రయోజనం లేదంటూ తమకు ప్రత్యేక హోదానే కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ఇచ్చినా చాలంటూ ప్రాధేయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నితీష్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సాధారణంగా రాష్ట్రాల్లో అమలు చేసే పథకాల ఖర్చు చేసే మొత్తాలు కాకుండా బీహార్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో అదనంగా చూపించింది కేవలం రూ.5000 కోట్లకు మించి లేదని గణాంకాలతో నితీష్‌కుమార్ వివరించారని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు మాత్రం విభజన తరువాత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కాదని, కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తుంటే సరేనంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు, ఈయనేదో మోసుకొస్తున్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్పటి ప్రధాని ఇచ్చిన హామీతో రాష్ట్రం రెండు ముక్కలయినా ఏపీకి హోదావల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకున్న ప్రజలు గుండెలు ఇప్పుడు ఆగిపోతున్నాయన్నారు. హోదా లేని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీల పేరుతో ప్యాకేజీ ఇచ్చిన దాఖలాలు లేవని పద్మ తెలిపారు. ఇప్పటివరకు హోదా దక్కిన 11 రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం రాయితీలు కల్పించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో శనివారం నిర్వహించిన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు తన వంతుగా బంద్‌ను విజయవంతం చేసి, ప్రజల ఆలోచనలను కేంద్రానికి వివరించడం ద్వారా మన రాష్ట్ర హక్కును సాధించాలని పద్మ సూచించారు. -
ఆ అర్హత రాహుల్‌కు లేదు: వాసిరెడ్డి పద్మ
ఏం ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు? మీకు అవసరమైతే పూలదండ వేస్తారు.. లేదంటే బురద చల్లేస్తారా? టీడీపీతో కలసి కేసులు వేసి వైఎస్ కుటుంబాన్ని వేధించింది మరిచారా? విభజనకు కారణమైన రాహుల్ ఏపీలో ఎలా అడుగుపెడతారు? జగన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి, వైఎస్ పేరును చార్జిషీట్లో చేర్చటం గుర్తులేదా? హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని, కుమారుడు జగన్మోహన్రెడ్డిని కక్ష గట్టి వేధించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వైఎస్ విగ్రహానికి పూలదండ వేసే నైతిక అర్హతేలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలపాటు కాంగ్రెస్ అభ్యున్నతికి అహరహం కృషిచేసిన వైఎస్ మరణానంతరం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. జీవించి ఉన్నంతకాలం వైఎస్ రాష్ట్రంలో టీడీపీతో పోరాటం చేస్తే.. అదేపార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా కుట్రపన్ని కేసులు పెట్టించిందని విమర్శించారు. జగన్‌ను సీబీఐ కేసుల్లో ఇరికించడంతోపాటుగా వైఎస్ పేరును చార్జిషీట్లో ఏఐసీసీ నేతలు పెట్టించారని ఆవేదన వెలిబుచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్షీణించిపోయాక ఇపుడు మళ్లీ వైఎస్ పేరు చెప్పి రాజకీయలబ్ధి పొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌వారు ముందుకొస్తున్నారన్నారు. ‘‘కాంగ్రెస్‌కు నచ్చితే పూలదండ వేస్తారు, లేకుంటే బురద జల్లుతారా.. అసలు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు? అసలాయనకు ఆ నైతిక హక్కుందా?’’ అని పద్మ ప్రశ్నించారు. వైఎస్‌పై చల్లాల్సినంత బురదజల్లి, ఆయన కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేసింది చాలక ఇపుడు ఆయన తమ నాయకుడంటూ నివాళులర్పించడానికి రాహుల్ ఏముఖం పెట్టుకుని వస్తున్నారు? మరణించేవరకూ వైఎస్ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషిచేస్తే ఆ తర్వాత ఆయన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడమేగాక టీడీపీతో కలసి కేసులు వేసింది మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్ మృతిని తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాల్ని ఓదారుస్తానంటే కాంగ్రెస్ జగన్‌కు అనుమతినివ్వకుండా అందర్నీ ఒకచోట చేర్చి ఓదార్చాలనే దౌర్భాగ్యపు సలహాను ఆనాడు సోనియాగాంధీ ఇచ్చారని మండిపడ్డారు. మరణించినవారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని ఏఐసీసీ ప్రకటించి ఇన్నేళ్లయినా వారికి అర్ధరూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరు పెట్టించింది మీరే కదా! టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై జగన్‌పై కేసులు పెట్టించింది.. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరును పెట్టించిందీ కాంగ్రెస్ నేతలే కదా అని వాసిరెడ్డి పద్మ అన్నారు. అసెంబ్లీలో వైఎస్‌ను ఇష్టానుసారం తూలనాడుతూ ఆయనపై అవాకులు, చవాకులూ పేలుతూ ఉంటే కిమ్మనకుండా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇపుడు వైఎస్ గుర్తుకొచ్చారా? అసలు వైఎస్ విగ్రహంవైపు సూటిగా చూసే ధైర్యం, అర్హత రాహుల్‌కున్నాయా? అని నిలదీశారు. ఇవాళ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తాముచేసిన పాపాల్ని రాహుల్ కడిగేసుకుంటామనుకుంటే భ్రమే అవుతుందని, రాష్ట్రప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. నిండుగా ఉండిన రాష్ట్రాన్ని అడ్డంగా విభజించడానికి కారకులైన రాహుల్ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ అడుగంటిపోవడంతో కాంగ్రెస్‌వారు ఇపుడు మళ్లీ వైఎస్‌ను తమ నేతగా చెప్పుకుని ఆయన పేరుతో లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ ఇకపై ‘పిల్ల టీడీపీ’గా ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్‌వారికి వైఎస్‌ను జ్ఞాపకం చేసుకునే నైతిక అర్హత కూడా లేదన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదని తమకున్న ఓట్లను చంద్రబాబుకు వేయించి ఆయన సీఎం కావడానికి కాంగ్రెస్ నేతలు తోడ్పడ్డారని, అలాంటిదిపుడు టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూడటానికి రాహుల్ ఇక్కడికొస్తున్నారా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. -
'తెలుగు ప్రజలకు దుర్ధినం'
-
పక్షం రోజుల్లో రెండు సార్లు పెంపా?
వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఒకపక్క సతమతమవుతున్న ప్రజలపై పక్షం రోజుల్లో రెండోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి మోయలేని భారం పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. చమురు కంపెనీలు పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు కనువిప్పు కలిగిందా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలన్న కనువిప్పు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఇపుడు కలిగిందా అని పద్మ ప్రశ్నించారు. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించిన వందలాది కుటుంబాలను తమ అధినేత జగన్ పరామర్శిస్తానంటే వద్దంటూ.. అందరినీ ఒక చోట చేర్చి పరిహారం ఇవ్వాలని సూచించిన రాహుల్.. ఇపుడు ఇంటింటికీ ఎందుకు తిరుగుతున్నారని విమర్శించారు. చేసిన తప్పును రాహుల్ దిద్దుకుంటున్నారనుకోవాలా? లేక జగన్ యాత్రను ఆదర్శంగా తీసుకున్నారా అని పద్మ ప్రశ్నించారు. -
'పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎత్తివేయాలి'
-
'పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎత్తివేయాలి'
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. 15 రోజుల్లో రెండుసార్లు ధరలు పెంచడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విడ్డూరమని పద్మ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని, ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పద్మ డిమాండ్ చేశారు. -
బాబువి బజారు రాజకీయాలు..
ఏపీ ముఖ్యమంత్రిపై వాసిరెడ్డి పద్మ ఫైర్ అనుమతులు ఇవ్వకుండా పరిశ్రమ పెట్టలేదంటే ఎలా? ఆ కారణంతో లీజు రద్దు చేయటం దుర్మార్గం కాక మరేంటి? సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం చేతకాని సీఎం చంద్రబాబునాయుడు ప్రధాన ప్రతిపక్షం ఎక్కడికక్కడ తమను ప్రశ్నిస్తోందన్న భయంతో చివరకు బజారు రాజకీయాలు మొదలుపెట్టారని వైఎస్సార్ సీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట రైతుల పేరిట దిగజారుడు రాజకీయాలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ... ‘‘ఇక్కడికెందుకు వచ్చారని వారిని అడిగితే గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీసుకొచ్చారని వారు చెప్పారు. యరపతినేని వాహనం కూడా అక్కడే ఉంది. సర్వసతి భూములు కొనుగోలు చేసినవే తప్ప బాబు మందీ మార్బలంలా విజయవాడ చుట్టుపక్కల దందాలు చేసి రైతులను బెదిరిస్తూ తీసుకున్నవి కావు. భూములు ఇవ్వకుంటే బలవంతంగానైనా తీసుకుని పరిహారంతోనే సరిపెడతామంటూ ఆయన రైతులను బెదిరించే విధానాన్ని చూసి ఏపీ ప్రజలంతా నివ్వెరపోతున్నారు’’ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడి రాజగురువుకు హైదరాబాద్‌లో ఉన్న 2,500 ఎకరాల్లో ఆ భూములను పది వేలకో, పాతిక వేలకో అమ్మకున్న రైతులు నాగళ్లతో దున్నించాలన్నారు. వాసిరెడ్డి పద్మ పేర్కొన్న మరికొన్ని అంశాలు.. చంద్రబాబు సతీమణీ భవనేశ్వరి కూడా రూ.వందల కోట్ల సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఆయన కొడుకు పేరు మీద ఫాంహౌస్‌లనో. మరొకటనో.. వందల ఎకరా ల భూములు పోగుపడి ఉన్నాయి. హెరిటేజ్ సంస్థకే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో వం దలాది ప్రదేశాల్లో గ్రామాలు, మహా నగరాల వరకు భూములున్నాయి. అమ్మిన వ్యక్తులు వాటిలో సేద్యం చేసుకోవచ్చా? ఏపీ ప్రభుత్వం నుంచి కనీసంగా సర్వసతి పవర్ సిమెంట్ ప్లాంట్‌కు అవసరమైన నీటి సరఫరా అనుమతులు కూడా మంజూరు చేయలేదంటే, ఇంతకు మించిన రాజకీయ కక్ష సాధింపు ఉంటుందా?రాష్ట్ర ప్రభుత్వం కనీసం పొల్యూషన్ కంట్రోలు బోర్డు అనుమతులు కూడా ఇవ్వలేదంటే అంతకుమించి కక్ష సాధింపు ఉంటుందా? అనుమతులు ఇవ్వకుండా ఆపి పరిశ్రమ పెట్టలేదని లీజు రద్దు చేశారంటే ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా?ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలన్న చరిత్ర బాబుకు ఏ నాడు లేదు. ఏదో కొద్ది మందిని రెచ్చగొట్టి ఇళ్లమీదకు పంపే కల్చర్ ప్రారంభించిన ఆయనకు అదే పద్ధతిలో సమాధానమివ్వాలని మేం భావించడం లేదు. ఎన్టీఆర్ మీదే చెప్పులు వేయించిన మనిషి మా అధినేత జగన్మోహన్రెడ్డి మీద ఈ మాత్రం పైత్యం ప్రదర్శించకుండా ఉంటాడని ఎవరు అనుకోగలరు? సీఎంగా ఉండి పిరికిపందలా పది మంది జనాన్ని ప్రతిపక్ష నాయకుడి ఇంటిమీద, కార్యాలయం మీద ఎగదొస్తున్న బాబుకు ప్రజలే బుద్ధిచెప్తారు. -
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
వైఎస్సార్ సీపీ జాబితాపై వాసిరెడ్డి పద్మ వెల్లడి హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రకటించిన సీమాంధ్ర లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా చాలా స్పష్టంగా ఉందని, పార్టీకి, ప్రజలకు సేవలందించే అభ్యర్థులకే చోటు లభించిందని చెప్పారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా తమ నాయకుడు అందరికీ ప్రాధాన్యం లభించేలా చూశారన్నారు. తొలినుంచి ఊహించినట్టుగానే జాబితాలో అభ్యర్థుల పేర్లున్నాయన్నారు. ఈ జాబితాలో ఇటీవల పార్టీలో చేరిన కరణం ధర్మశ్రీ, బూరగడ్డ వేదవ్యాస్, తాజా మాజీ మంత్రి పార్థసారథిలకు ప్రాధాన్యత లభించిందన్న విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ప్రజలకు సేవలందించే క్రమంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లనే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఒకరిద్దరు తప్పితే అంతా పాతవాళ్లకే టికెట్లు లభించాయన్నారు. ఇంకా మిగిలివున్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు కూడా త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించటం జరుగుతుందన్నారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పోటీ చేయటం గురించి ప్రస్తావించగా.. విశాఖ ప్రజలు విజయమ్మ పోటీ చేయాలని పట్టుబట్టారని, అందువల్లే ఆమె అక్కడినుంచి పోటీ చేస్తున్నారని పద్మ వివరించారు. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు ఈ జాబితాలో చోటు దక్కలేదన్న విలేకరుల ప్రశ్నకు పద్మ సమాధాన మిస్తూ ఈ విషయం ఇదివరకే షర్మిల స్పష్టం చేశారని, తన కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువు నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని చెప్పారని తెలిపారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు రామకృష్ణ తమ్ముడు కొణతాల రఘును బరిలోకి దింపామన్నారు. ఒకేసారి దాదాపు అన్ని స్థానాలకూ జాబితా విడుదల చేయటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనన్నారు. -
పిచ్చి ప్రేలాపనలు ఆపండి!
టీడీపీపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ ‘టైటానియం’పై డొంక తిరుగుడు కథనాలెందుకు? ‘సాక్షి’ విసిరిన సవాలును స్వీకరించండి దమ్ముంటే విజయమ్మ పిటిషన్‌పై విచారణకు రండి చంద్రబాబుపై సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదు హైదరాబాద్: టైటానియం ఖనిజం కేసులో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఈ కేసుకు సంబంధించి తోక పత్రికల్లో డొంక తిరుగుడు కథనాలు రావడం, వెంటనే టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఈ కేసుతో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సాక్షి పత్రిక బహిరంగ సవాలు విసిరింది. ఈనాడుకు తమ పత్రికను ధారాదత్తం చేస్తామని, నిరూపించకపోతే ఈనాడును వదిలేస్తారా? అని సవాల్ విసిరినా మౌనంగా ఉండిపోయారు. సవాల్‌కు స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరించారు. నిస్సిగ్గుగా మళ్లీ అనేక కథనాలు రాస్తున్నారు. ఆ కథనాలు పట్టుకుని జగన్మోహన్రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఆఫీస్‌కు కళ్లులేవా అని చెబుతున్న టీడీపీ నేత సోమిరెడ్డికి కళ్లు మూసుకుపోయాయని ధ్వజమెత్తారు. ‘‘జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నోరకాలుగా కుట్రపన్నుతున్నారు. 16 నెలలు జైల్లో పెట్టించినా.. మేం ఓపికతో ఉన్నాం.. చట్టాన్ని గౌరవించాం. కాబట్టే గత ఉప ఎన్నికల్లో ప్రజలు మావైపే నిలిచారు. ఇప్పుడు మీరు, మీ తోక పత్రికలు పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ఊరుకునేది లేదు. ప్రజలు అంతా గమనిస్తున్నారు’’ అని పద్మ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో బాబుకు డీల్ కుదరబట్టే.. చంద్రబాబునాయుడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదని పద్మ ప్రశ్నించారు. ఐఎంజీ భూముల వ్యవహారంతోపాటు పలు అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిటిషన్ వేస్తే ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకోబట్టే విచారణ విషయం పక్కకుపోయిందన్నారు. దమ్ముంటే విజయమ్మ వేసిన పిటిషన్‌పై నిలబడాలని, సీబీఐ విచారణను ఆహ్వానించాలని సవాలు విసిరారు. కోర్టుల్ని అడ్డం పెట్టుకుని కారుకూతలు కూస్తున్నారన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన, పదేళ్ల ప్రధాన ప్రతిపక్ష నేతగా పోషించిన సమయంలో ఆయన ఎక్కడెక్కడకు వెళ్లారో విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాస్‌పోర్ట్‌లు పరిశీలిస్తే బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు తన అవినీతి చరిత్ర బయటపడకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ప్రజల్లో జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనలేమని తెలిసే ఇలాంటి చౌకబారు విద్యలు ప్రదర్శిస్తున్నారన్నారని ఆమె విమర్శించారు. -
ఈనాడు చంద్రబాబును భుజాలపై మోస్తోంది
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఈనాడు దినపత్రిక భుజాలకెత్తుకుని మోస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. 2009 ఎన్నికల్లో ఈనాడు టీడీపీకి అనుకూలంగా ఎన్ని రాతలు రాసినా పరాభవం తప్పలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా అసత్యపు రాతలు రాస్తూ విషం కక్కుతోందని విమర్శించారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి నీతిమాలినపనులకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ పై లేనిపోని కథనాలను అల్లుతున్నారని పద్మ మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణల్ని ఈనాడు అధిపతి రామోజీరావు నిరూపించాల్సిన అవసరముందని సవాల్ విసిరారు. చంద్రబాబు అధికారంలోకి రాడనే భయంతో వైఎస్ఆర్ సీపీ, జగన్ పై కుట్రపూరిత కథనాలను ప్రచురిస్తోందని పద్మ విమర్శించారు. రామోజీరావు జర్నలిజాన్ని ఉన్మాద స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా ఈనాడు కథనాలను ప్రచురించిందని పద్మ విమర్శించారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ నిజమైన వార్తలు రాసిందని చెప్పారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జలయజ్ఞం పనులు నిలిచిపోయాయని, ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం గురించి ఈనాడు ఎందుకు స్పందించలేదని పద్మ ప్రశ్నించారు. -
పగటి వేషగాడిలా చంద్రబాబు :వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ప్రజాగర్జన పేరుతో విజయనగరంలో నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన తీరు పగటి వేషగాడి మాదిరిగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీమాంధ్రను సింగపూర్‌లాగా అభివృద్ధి చేస్తానని, సీమాంధ్రకు రాజధానిని తానే నిర్మిస్తానని ప్రగల్భాలు చెబుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లపాటు ఉన్నపుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి నగరం వెలుపల స్థలమిచ్చినా, దానికి దారి చూపించలేకపోయారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాతనే విమానాశ్రయానికి దారులు వేస్తూ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగురోడ్డు వంటి వాటిని నిర్మించారని గుర్తుచేశారు. ఇంకా ఏమన్నారంటే... మీ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి పనికి వచ్చే ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా ఎందుకు కట్టలేకపోయారు? కృష్ణా డెల్టా ఆయకట్టుకు రెండో పంటకు కాదు కదా, ఒక్క పంటకు కూడా నీరు ఎందుకు ఇవ్వలేక పోయారు? పట్టుమని పది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేయగలరా? ఆరునెలల నుంచి నిద్రపోవడంలేదని చెబుతున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఆరేళ్ల కిందట ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోలేదెందుకు? రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబుకు అసలు ఇపుడు విభజన అన్యాయమని మాట్లాడే అర్హత ఉందా? విభజన బిల్లు చాలా బాగుందని మొదటి ఓటు తామే వేశామని, అందుకు తమకు గర్వంగా ఉందని టీడీపీ ఎంపీ చెప్పలేదా? బిల్లు పెట్టిన కాంగ్రెస్, బిల్లు బాగుందన్న టీఆర్ఎస్, టీడీపీకి ఉన్న తేడా ఏమిటి? -
జగన్ ఓకే అంటే కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ
వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ మాజీ మంత్రి ధర్మాన, ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్, జగన్నాయకులు నేడు పార్టీలో చేరుతున్నట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్, జగన్నాయకులుతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్దఎత్తున నాయకులు, శ్రేణులు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నలిస్తే.. పార్టీలో చేరడానికి టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి సీనియర్ నాయకులతోసహా చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. కానీ మూడేళ్లుగా పార్టీకోసం శ్రమిస్తున్న నాయకులను కాదని వేరేవారికి ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఆ రెండు పార్టీల్లో నాయకులు మిగిలారని అన్నారు. అయితే తమ అధ్యక్షుడు జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎల్లో మీడియా అదే పనిగా దుష్ర్పచారం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఆదివారం జరగనున్న చేరికల నేపథ్యంలో ఎల్లోగ్యాంగ్ చెంప చెల్లుమన్నట్లయిందని, ఇకనైనా బురదచల్లే కార్యక్రమాల్ని విరమించుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ అధినేత జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని వాసిరెడ్డి వివరించారు. పార్లమెంటులో టీ-బిల్లు ఆమోదం పొందకుండా ఉండటంకోసం జాతీయపార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల నాయకుల మద్దతు కూడగడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతే అన్ని ప్రాంతాలకూ నష్టం వాటిల్లుతుందని, అందుకే కలిసుండాల్సిన ఆవశ్యకతను ‘సమైక్య శంఖారావం’ ద్వారా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారని చెప్పారు. విభజన బిల్లుపై నివేదిక కోసం సుచరిత దరఖాస్తు రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చల సారాంశం, రాష్ట్రపతికి పంపిన నివేదికకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు మేకతోటి సుచరిత సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేశారు. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా 30 రోజులకు దాటకుండా ఈ సమాచారం ఇప్పించాలని ఆమె తన దరఖాస్తులో కోరారు. -
ఆదాలకు బుద్ధీ జ్ఞానం ఉందా? : వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజం
వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వనందువల్లే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని చెబుతున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అసలు బుద్ధీ, జ్ఞానం ఉన్నాయా అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునేంతటి బలం లేనందున ఎన్నికలకు దూరంగా ఉంటామని తమ పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి జనవరి 23నే స్పష్టం చేశారని, ఆదాల తన నామినేషన్‌ను దాఖలు చేసింది 28వ తేదీన అని గుర్తుచేశారు. తాము అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తమను నమ్ముకుని నామినేషన్ వేశానని ఆదాల చెప్పడం సిగ్గులేని, నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. తమ పార్టీపై బురద జల్లాలనే ప్రయత్నమే ఇందులో కనిపిస్తోందన్నారు. ఆదాల వైఎస్సార్సీపీపై ఎవరి స్క్రిప్టు ప్రకారం విమర్శలు చేస్తున్నారో కూడా తమకు తెలుసన్నారు. రాష్ట్రం కలిసుంటే జగన్ గెలవడని జేసీ దివాకర్‌రెడ్డి చెబుతున్నవి పిచ్చి మాటలన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నపుడే కడప నుంచి జగన్ 5 లక్షల పైచిలుకు భారీ ఆధిక్యతతో గెలుపొందిన వాస్తవం విస్మరించారా, 17 ఎమ్మెల్యే స్థానాలను గెల్చుకున్న విషయం మరిచారా అని ఆమె ప్రశ్నించారు. పోలింగ్‌కు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దూరం.. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరాదని విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి విప్ జారీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల అగ్రనేతలను కలసి గురువారం రాత్రి నగరానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానుసారం పోలింగ్ కు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. -
బాబుది నయవంచన
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాజేష్ అధికారం కోసం బాబుకు ఓట్లు, సీట్లపైనే యావ అని విమర్శ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు కోరరని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు ‘సమైక్యంగా’ ఉంచాలని గర్జిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఓట్లు, సీట్ల కోసం నయవంచనకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. తిరుపతి ‘ప్రజాగర్జన’ సభలో చంద్రబాబు గంటన్నరకుపైగా ఉపన్యసించినా.. ఎక్కడా ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం నాడిక్కడ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నారని వారు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ, ఇతరులను తిడుతున్న చంద్రబాబు.. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆయనిచ్చిన లేఖ సంగతేంటి? అని నిలదీశారు. తెలుగువారికి అన్యాయం జరుగుతోందంటున్న బాబు.. ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు విభజన రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రపతి వద్దకు ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలను పంపించారు. అదే రాష్ట్రపతిని చంద్రబాబు రహస్యంగా కలిసి వస్తారు. మరోమారు సీమాంధ్రకు చెందిన నేతలను కూడా రాష్ట్రపతి దగ్గరకు పంపుతున్నారు. ప్రాంతాల వారిగా ఎమ్మెల్యేలను, నాయకులను చీల్చి, రాజకీయాలను చంద్రబాబు ఎందుకింత నీచంగా దిగజార్చుతున్నారు?’’ అంటూ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతాలంటూ విచిత్ర వాదనలు చేసిన చంద్రబాబు.. తిరుపతి సభలో ప్రజలను కోతులుగా చిత్రీకరించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. బాబు తీరు చూస్తుంటే ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి మాదిరిగా.. ఈ నారా చక్రవర్తి చిడతలు వాయించారు’ అని ఎద్దేవా చేశారు. బాబు అవకాశవాదానికి ఇదే నిదర్శనం: గతంలో వినాయకచవితి ఉత్సవాలకు హైదరాబాద్‌కు నరేంద్రమోడి వస్తానంటే, మోడీ రావడానికి వీల్లేదంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబే ఈరోజు మోడీని పొగడం చూస్తుంటే బాబు అవకాశవాదం, రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉంటుందా?’ అని పద్మ, రాజేష్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్టీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆయన తొమ్మిదేళ్ల పాలన తిరిగి తీసుకొస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారని సూటిగా అడిగారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, ఆయన నుంచి అధికారం లాగేసుకున్న బాబు ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులు నెలకొల్పిన మాట వాస్తవంకాదా? అని అన్నారు. ‘‘తొమ్మిదేళ్లపాటు బాబు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారు? ఏ ఒక్కరోజైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ప్రాజెక్టులు ఒక్కటైనా నిర్మించారా? పంట రుణాల గురించి మాట్లాడుతున్న మీరు, మీ హయాంలో కనీసం వడ్డీ అయినా మాఫీ చేశారా?’’ అని ప్రశ్నిం చారు. ఆయన పాలనలో విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెరగలేదని చెప్పడం, 24 గంటలపాటు విద్యుత్ ఇచ్చానని చెప్పడం సిగ్గుచేటన్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే.. ‘ఒసామాబిన్‌లాడెన్ బతికుంటే శాంతివచనాలు వల్లించినట్లు’గా ఉంటుందని ఎద్దేవా చేశారు. -
సమైక్యం కోసం ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్, టీడీపీలు ఒక్క ప్రయత్నమైనా చేస్తున్నాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీల నేతలను కలవడంతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలసి మద్దతు కూడగడుతుంటే... ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి ఒకే మాటను వల్లెవేస్తూ తమపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆ పనిచేయకపోగా కొబ్బరికాయ సలహాలిస్తూ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాత నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అడగటం, అదే లైన్లో కేంద్రం ముందుకెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల మనోభావాలను గాలికొదిలేసి సిగ్గులేకుండా సొల్లుకబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందంటూ దొంగ ఏడుపు ఏడుస్తున్న లగడపాటి రాజగోపాల్ ఇంకా అదే పార్టీలో ఎందుకు కొనసాగుతున్నట్లని సూటిగా ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆపార్టీకి రాజీనామా చేయడంతో పాటు వెంటనే రాష్ట్రపతి వద్దకెళ్లి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బంద్‌కు బాబు మద్దతెందుకివ్వలేదు: వాసిరెడ్డి పద్మ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, దీనివల్ల నష్టపోయే ప్రాంతాల్లో జరుగుతున్న బంద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజనవల్ల సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగడంలేదని బాబు భావిస్తున్నారా? విభజనను సమర్థిస్తున్నారా? అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను అడ్డుపెట్టుకొని కృష్ణానదీ మిగులు జలాలు దక్కకుండా చేసిన సోనియాగాంధీ చర్యలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమ అధినేత జగన్ నిర్ణయించారని చెప్పారు. -
సమైక్య రాష్ట్రానికి సైంధవుడు సీఎం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు కేంద్రానికి మార్గాలను సుగమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలంతా కలసి రోజుకొక నాటకం, పూటకొక డ్రామా వేస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా స్పీకర్, ముఖ్యమంత్రిల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హైడ్రామాను చూస్తుంటే చాలా విస్మయం కలుగుతోందని పద్మ వ్యాఖ్యానించారు. కీలకమైన రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగా, నాటకీయంగా సాంకేతిక విషయాలను అడ్డుపెట్టి రోడ్డుమీద చర్చ జరిగేలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. సమైక్యవాదాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రచించిన గేమ్‌ప్లాన్‌లో భాగంగానే ముఖ్యమంత్రి, స్పీకర్ల మధ్య వివాదమున్నట్టుగా ఆ పార్టీ నేతలు చర్చకు పెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అనే వెయ్యి తలల విషసర్పంలో ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా మాట్లాడుతోందని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు ప్యాకేజీల గురించి మాట్లాడుతుంటే, విభజనకు అన్నిరకాలుగా సహకరిస్తున్న సీఎం కిరణ్ సమైక్యవాదం వినిపిస్తారు. మరికొందరు విభజన జరిగిపోయిందంటారు. సీఎం ఒక పక్క విభజనకు అవసరమైన యావత్ సమాచారాన్నీ తన శాఖల ద్వారా కేంద్రానికి, జీవోఎంకు పంపిస్తూనే, మరోవైపు సమైక్యం కోసం అసెంబ్లీని ఆయుధంలా వాడుకోబోతున్నట్టుగా ప్రచారం చేయడం హాస్యాస్పదం..’ అని పద్మ పేర్కొన్నారు. సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు? కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి ‘సమైక్య తీర్మానం’ చేసి కేంద్రానికి ఎందుకు పంపడం లేదని పద్మ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపరిచే అధికారం మీ చేతిలోనే ఉంది కనుక, కేబినెట్ నోట్ రాకముందే తీర్మానం చేయమంటే తనకు పట్టనట్టుగా వ్యవహరించారన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి, విభజనను అడ్డుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు తమకు వినపడనట్లు నటించారన్నారు. అసలు విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు. ఉద్యోగులు త్యాగాలు చేస్తూ సమైక్య ఉద్యమానికి దిగితే వారిని మభ్యపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేశారని మండిపడ్డారు. కిరణ్ వ్యవహారశైలి చూస్తుంటే హత్య చేసిన వ్యక్తే శ వం వద్ద ఏడ్చినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినట్టే ఆడుతోన్న కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలని సోనియాగాంధీ నిర్ణయిస్తే, కొబ్బరికాయలా పగలకొట్టాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సలహా ఇవ్వడం సిగ్గుచేటని పద్మ అన్నారు. వాస్తవానికి విభజన విషయంలో కేంద్రం మొదటినుంచీ చంద్రబాబు చెప్పినట్టే చేస్తోందని తెలిపారు. ఢిల్లీలో చంద్రబాబు నిరాహారదీక్ష చేసిన వెంటనే జీవోఎం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాలు.. ఇలా ఆయన చేసిన డిమాండ్లన్నింటికీ కాంగ్రెస్ హైకమాండ్ తలూపుతోందని చెప్పారు. ఇలా కాంగ్రెస్, టీడీపీల నేతలు కలిసిపోయి.. సమైక్యం కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న తమపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంయుక్తంగా బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. జగన్ మాదిరిగా సోనియాను విమర్శించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. సోనియాను తిడితే ఐఎంజీ కేసులో జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లుందని, అందుకే పిల్లిలా దాక్కుంటున్నారని విమర్శించారు. సీఎం కిరణ్, చంద్రబాబు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల పాలిట చీడపురుగుల్లా తయారయ్యారని మండిపడ్డారు. -
'సోనియాను విమర్శిస్తే జైలుకెళ్తానని బాబు భయం'
-
రాష్ట్రాన్ని కోయడానికి చాకులా మారిన బాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కేక్‌లా కోయడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి ఒక చాకులా ఉపయోగపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ... విభజనను ఒక్క వాక్యంతో స్వాగతించి కొత్త రాజధానిని కట్టుకుందామని చెప్పిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగలడానికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండే కారణమని విమర్శించారు. ఈ రెండు పార్టీలు సీమాంధ్ర ప్రాంతానికి ద్రోహులుగా మారిపోయాయని దుయ్యబట్టారు. నిర్బంధంలో ఉండి కూడా రాష్ట్ర ప్రజల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహారదీక్షకు దిగాల్సి రావడం నిజంగా తమకు బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించేటపుడు సీమాంధ్ర ప్రాంతానికి ఎలా న్యాయం చేయాలి? సాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలి? హైదరాబాద్ నగరం విషయాన్ని ఏం చేయాలి? వంటి అంశాలనేమీ చర్చించకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. విభజన విషయాన్ని సామరస్యంగా పరిష్కరించడం విస్మరించి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశారని విమర్శించారు. ఏకపక్షంగా విభజన జరుగుతోందని తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి షిండేకు తమ పార్టీ ముందుగానే లేఖలు రాసిందని గుర్తుచేశారు. విభజన ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కనుక, కాంగ్రెస్‌కు ఆ పని చేతకాదు కనుక రాష్ట్రాన్ని యథాతధంగా ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. -
బాబుది విజన్-2020 కాదు.. డివిజన్ 420
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రకటన వెలువడిన పది రోజుల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు సీమాంధ్ర ప్రజలు గుర్తుకొచ్చారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే చంద్రబాబు... మరోసారి సీమాంధ్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. చంద్రబాబుది విజన్ 2020 కాదని, ఆయనది డివిజన్ 420 అని నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజనపై ప్రకటన వెలువడిన పది రోజుల తర్వాత చంద్రబాబు తీరుబడిగా ప్రధానికి లేఖ రాయడం చూస్తే ఆయన ఎంతగా నటిస్తున్నారో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పారు. విభజనకు సంబంధించి నెల రోజులుగా లోకం కోడై కూస్తున్నా.. నిత్యం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్న మీకు, వాస్తవాలు అన్నీ తెలిసి కూడా ఎందుకు మిన్నకుండిపోయారని బాబును ప్రశ్నించారు. ఏ ఒక్కరోజూ సీమాంధ్ర ప్రజల మనోభావాలు గుర్తుకురాలేదా? అని నిలదీశారు. చంద్రబాబును, కాంగ్రెస్‌ను నమ్ముకొని దగాపడ్డామని ఆవేదనతో సీమాంధ్ర ప్రజానీకం మొత్తం స్వచ్ఛందంగా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టడాన్ని చూసి ఇరువురు నేతలు భయపడుతున్నారని చెప్పారు. అందుకే చంద్రబాబు రెండో కన్ను తెరిచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన లేఖలేంటి? సీట్లు, ఓట్ల కోసం చంద్రబాబు రోజుకొక మాట, పూటకొక వైఖరి అవలంబించడం పరిపాటిగా మారిందని పద్మ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలంటూ 2008, 2012లో కేంద్రానికి ఒక బ్లాంక్‌చెక్ ఇచ్చిన మాదిరిగా లేఖలు అందజేసి, విభజించే వరకు పదే పదే తరిమిన విషయం ప్రజలకు గుర్తుందన్నారు. తీరా నిర్ణయం వెలువడిన తర్వాత ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఆయనకే చెల్లుబాటవుతుందని విమర్శించారు. ‘‘2008లో కేంద్రానికి లేఖ రాసిన తర్వాత రాష్ట్ర విభజనకు పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి 2009లో టీఆర్ఎస్తో జతకట్టి మహాకూటమి ఏర్పాటు చేసి పోటీచేశారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో విభజనకు మద్దతు పలికారు. 2009 డిసెంబర్లో చిదంబరం ప్రకటన చేసిన వెంటనే ‘యూ’ టర్న్ తీసుకొని ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారు. తర్వాత మళ్లీ రాజకీయత లబ్ధి కోసం తెలంగాణలో ఓట్లు, సీట్ల కోసం 2012లో కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు నిర్ణయం వెలువడిన తర్వాత బాబు ఇంటికి ఏపీ ఎన్జీవో ఉద్యోగులు వెళ్లినప్పుడు ఏం మాట్లాడారు? ‘తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాను. వెనక్కి తగ్గేది లేదు. అయినా మీరెందుకు భయపడుతున్నారు? మన వాళ్లు బెంగళూరు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవడం లేదా? హైదరాబాద్ విషయంలో భయమెందుకు?’ అంటూ మందలించి పంపిన విషయం ప్రజలకు గుర్తుంది. అలాంటి మనిషికి తీరా పదిరోజుల తర్వాత సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు, జలవనరులు గుర్తుకొచ్చాయా? కాంగ్రెస్ పార్టీ సీట్లు, ఓట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తుందని, రాహుల్‌ను ప్రధాని చేయడం కోసమే అనే విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించారా?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు కలిసి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. ఆ రెండు పార్టీల ధోరణి చూస్తే ‘హత్యచేసిన హంతకుడే శవం మీదపడి ఏడ్చినట్లుంది’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవిభజన ద్రోహిగా, మోసగాడిలా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పద్మ దుయ్యబట్టారు.