చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు | Vasireddy Padma slams TDP Over Crimes on Women in AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు

Published Thu, May 3 2018 2:06 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గత నెల రోజుల్లో గుంటూరు జిల్లాలో 20 అత్యాచారాలు జరిగాయని, రాజధాని ప్రాంతంలో అత్యాచార ఘటనలు జరగడం సిగ్గు చేటన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement