
సాక్షి, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల లైంగిక వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకురావడమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ వినోద్ జైన్ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిందన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదన్నారు. కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment