సాక్షి, విజయవాడ: విశాఖ ఘటన అమానుషమని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేమ పేరుతో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. బాధితులకు మహిళా కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. (చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక)
మహిళా మార్చ్‌లో భాగంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆమె చెప్పారు. రానున్న వంద రోజుల్లో ఇరవై అంశాలపైన మహిళా కమిషన్ సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వంద రోజుల్లో జిల్లా, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ‘దిశ’ సెక్షన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 8న విజయవాడలో రెండు వేల మంది మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. దిశ బిల్లును అమలులోకి తీసుకువచ్చి.. పది రోజుల్లోనే శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ')
Comments
Please login to add a commentAdd a comment