'పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ఎత్తివేయాలి' | vasi reddy padma demands, ap and telangana to remove vat on petrol, diesel | Sakshi
Sakshi News home page

'పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ఎత్తివేయాలి'

Published Sat, May 16 2015 3:35 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

'పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ఎత్తివేయాలి' - Sakshi

'పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ఎత్తివేయాలి'

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. 15 రోజుల్లో రెండుసార్లు ధరలు పెంచడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విడ్డూరమని పద్మ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యాట్ను ఉపసంహరించుకోవాలని, ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పద్మ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement