
హైదరాబాద్, సాక్షి: ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల గురించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్.. త్వరలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు.. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత హీనంగా మాట్లాడారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్‌కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా? అని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్‌కు గౌరవం లేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని చెప్పారు. అదే సమయంలో.. రవాణా మంత్రి పొన్నం సైతం కేటీఆర్‌పై రాష్ట, జాతీయ మహిళా కమిషన్‌లు కేసు నమోదు చేయాలంటూ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment