సాక్షి, గుంటూరు: ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. ఈ కేసుల్లో కేవలం 20 శాతం మాత్రమే పోలీసు స్టేషన్‌ల వరకు వెళుతున్నాయి. మిగతా వారంతా పరువు పోతుందనో... కేసులకు భయపడో తమలో తామే కుంగిపోతున్నారు. ఇలాంటి వారి అండగా నిలిచేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు సరికొత్త అస్త్రాన్ని తయారు చేశారు. సబల పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 126 మంది మహిళా కానిస్టేబుళ్లతో 61 సబల బృందాలను ఏర్పాటు చేశారు.
♦ బాబాయే పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బయటకు చెప్పుకోలేక ఓ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. సొంత బాబాయి కావడంతో విషయం బయటకు పొక్కితే కుటుంబం పరువుపోతుందని కొండంత బాధను గుండెల్లో పెట్టుకుని భరాయించింది.
♦ హాస్టల్‌లో ఉండే ఎనిమిదో తరగతి బాలిక తోటి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడింది.
♦ ఫేస్‌బుక్‌లో పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఓ యువకుడు మెడిసిన్ చదివే యువతిని వేధించాడు. గంటకు రూ.5 వేలు చెల్లిస్తే చాలంటూ అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టాడు.
♦ వృద్ధుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా రూ. 500 ఇచ్చి బాలికతో తాను సుఖం పొందానంటూ పుకార్లు పుట్టించాడు.
♦ ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల తోటి ఉద్యోగి వెకిలి చేష్టలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
♦ ఏడేళ్ల క్రితం తల్లిదండ్రులు విడిపోయారని, తల్లి కూలి పనులు చేస్తూ తనను చదివించడం కష్టంగా మారిందని ఓ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మానాన్న కలపాలని కోరింది.
♦ ఇవన్నీ సబల దృష్టికి వచ్చిన ఫిర్యాదులు.. పోలీసుస్టేషన్ గడపతొక్కే ధైర్యం లేక, మనోవేదన భరించలేక ఆదుకోవాలంటూ సబలకు చేరిన అబలల కన్నీటి గాథలు.. నయానో, భయానో అన్నింటికీ ఇక్కడ పరిష్కారం దొరుకుతోంది. అబలకు కొండంత భరోసా కలుగుతోంది.
మేమున్నామని..
జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, బాలికల హాస్టళ్లు, కళాశాలలు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రతి ఇనిస్టిట్యూట్‌కు సబల బృందాలను పంపి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. గత నెల 29వ తేదీన అధికారికంగా ప్రారంభించి మూడు రోజుల వ్యవధిలో 39 ఫిర్యాదులను స్వీకరించారు. గతంలో వచ్చిన వంద ఫిర్యాదులతోపాటు, వీటన్నింటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అకృత్యాలను అరికట్టడంతోపాటు తమ పేరు గోప్యంగా ఉంచుతుండటంతో సబలకు ఫిర్యాదు చేసేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.
అంతటా అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో తిరిగే సబల బృందాలకు సైకిల్‌తోపాటు వారి రక్షణకు పెప్పర్ స్ప్రే, లాఠీలను అందించేందుకు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు నిర్ణయించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయం పక్కనే ప్రత్యేకంగా సబల కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలందిస్తున్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలతోపాటు, వివిధ రకాలైన వేధింపుల నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై వీడియోలు చిత్రీకరించి అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ సబల కథ
♦ సబల కార్యక్రమం జూన్ 29న గుంటూరు రేంజ్ ఐజీ కేవీవీ గోపాలరావు చేతుల మీదుగా ప్రారంభించారు.
♦ సబల బృందంలో 126 మంది మహిళా కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు
♦ జిల్లా వ్యాప్తంగా వీరిని 61 బృందాలుగా విభజించి 10 నుంచి 15 కిలోమీటర్ల మేరలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు, బాలికల హాస్టళ్లు, మహిళలు ఎక్కువగా ఉండే ఆఫీసులు వంటి వాటికి పంపిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో సమస్యలు తెలుసుకుని, వేధింపుల నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
♦ సబలకు ఇప్పటి వరకు 133 ఫిర్యాదులు అందాయి.
♦ వీటిలో భార్యభర్త మధ్య జరిగే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు మినహా పరిష్కారమయ్యాయి.
ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగాం
ముగ్గురు యువతులు ఆత్మహత్యకు పాల్పడే సమయంలో సబలకు ఫోన్ చేసి చెప్పారు. మా బృందం ద్వారా వెంటనే వారి ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఒకరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అనంతరం కౌన్సెలింగ్ ద్వారా సమస్య పరిష్కరించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశాం. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు.– స్నేహిత, డీఎస్పీ, సబల నోడల్ ఆఫీసర్
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
సబల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సొంత కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులను సబలతో పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. మహిళలు సబల సహాయాన్ని పొందాలి. ఫిర్యాది వివరాలను గోప్యంగా ఉంచుతాం. వారికి ఇష్టం లేకుంటే కేసులు నమోదు చేయం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. సబల దగ్గరకు వచ్చిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపాలనేదే మా ధ్యేయం.– సుభాషిణి, సీఐ, సబల నోడల్ ఆఫీసర్
ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫిర్యాదులు
చిన్న పిల్లలు, మహిళలు నేరుగా సబలకుగానీ, డయల్ 100కుగానీ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్, వాట్సాప్‌లకుగానీ ఫిర్యాదులు చేయొచ్చు. ఫేస్‌బుక్‌లో అయితే https:// www. facebook.com/ sabalagunturrural.9కు, వాట్సాప్ ద్వారా అయితే∙9440900866కు, ఈయిల్ ద్వారా అయితే sabalagrr@ gmail.comకు వచేచ ఫిర్యాదులన ఎప్పటికప్పుడు స్వీకరిం– Ðð ంటనే∙వారితోట్లాyì పరిష్కరించేదుకు అన్ని ర్యలు చే పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment