ఐక్యరాజ్య సమితి ‘గర్ల్ అప్’ మూవ్‌మెంట్‌కు ఇండియా కంట్రీ మేనేజర్ అయిన అదితి అరోరా ఆ సంస్థ ద్వారా మహిళల మానసిక ఆరోగ్యం నుంచి ఉపాధి అవకాశాల వరకు ఎన్నో అంశాలపై పని చేస్తోంది. ‘స్టోరీ టెల్లింగ్’లో శిక్షణ ఇస్తోంది. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ΄పోరాడుతోంది. ‘పీరియడ్ ΄పావర్టీ’ని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యమ్రాలు నిర్వహిస్తోంది. మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అమెరికాకు చెందిన ‘జస్ట్ ఏ గర్ల్ ఇంక్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది....
ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో ఎంతోమంది మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పొషించింది ‘గర్ల్ అప్’.
‘ప్రపంచాన్ని మార్చే అద్భుత శక్తి అమ్మాయిలకు ఉంది’ అంటున్న అదితి అరోరా వారి హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపోందిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా కొత్త అవకాశాల ప్రపంచంలోకి తీసుకు వెళుతోంది.
‘గర్ల్ అప్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా లింగ సమానత్వం, సామాజిక మార్పుపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది అదితి.యువతలో ఎంతోమందిని చేంజ్‌మేకర్స్‌గా తీర్చిదిద్దింది.పాలిటికల్ సైన్స్ చదువుకున్న అదితి కాలేజీ రోజుల నుంచి మహిళా హక్కులు, స్త్రీ సాధికారతకు సంబంధించిన అంశాలపై పని చేస్తోంది. జెనీవాలో చదువుతున్నప్పుడు ‘జెండర్ అండ్ మైన్ యాక్షన్’ పోగ్రాంలో భాగంగా మందు పాతర బాధిత దేశాలలో మహిళల భద్రత కోసం పనిచేసింది.
‘గర్ల్ అప్’ పనితీరు విషయానికి వస్తే సంస్థలో సిబ్బంది, కన్సల్టెంట్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడానికి అదేమీ అడ్డంకి కాలేదు. ‘ఓపెన్ టు ఎవ్రీ వన్’ అంటున్న ‘గర్ల్ అప్’ దేశంలోని వివిధ పాంతాలలోని వాలంటీర్‌లతో కలిసి పనిచేస్తోంది.తమలోని శక్తిని అమ్మాయిలు గుర్తించేలా కార్యక్రమాలు రూపోందిస్తోంది.విధాన నిర్ణయాలలో వారి అభిప్రాయాలకు అధికరపాధాన్యత ఇస్తోంది.‘లింగ సమానత్వం’ విషయంలో క్రియాశీలంగా పనిచేస్తోంది గర్ల్ అప్.
‘అబ్బాయిలను ఒకరకంగా, అమ్మాయిలను ఒకరకంగా చూసే విధానంలో మార్పు రావాలి. లింగ సమానత్వానికి ఇదే తొలిమెట్టు. అమ్మాయిలు చదువులో తమ ప్రతిభను నిరూపించుకొని శక్తిమంతులు కావాలి. ఎవరికీ తీసిపోము అని నిరూపించాలి. లింగ సమానత్వం విషయంలో ΄పార సమాజం, విధాన నిర్ణేతలు, విద్యావేత్తల పాత్ర కీలకం’ అంటుంది అదితి.
మనకు తెలియకుండానే పురుషాధిపత్య భావజాలం మనలో లీనమై ఉంటుంది. రకరకాల సందర్భాలలో అది వ్యక్తం అవుతుంటుంది. ‘ఇలాంటివి నివారించాలంటే ఏం చేయాలి?’ అనేదానిపై కూడా తన అభిప్రాయాలను ప్రకటించింది అదితి.
‘శరీరం నుంచి దుస్తుల ఎంపిక వరకు మహిళలు ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు’ అంటున్న అదితి తాను కూడా అలాంటి హింస బాధితురాలే. ‘కామెంట్స్ విని బాధపడడం కాకుండా అలాంటి కామెంట్స్ మళ్లీ వినిపించకుండా చేయాలి’ అంటుంది అదితి.
‘మార్పు సాధ్యపడదు’ అనేది నిరాశావాదం.‘తప్పకుండా సాధ్యపడుతుంది’ అనేది శాస్త్రీయ ప్రాతిపదికపై ఏర్పడిన ఆశావాదం.
మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం త్వరగా రావడానికి ‘గర్ల్ అప్’లాంటి సంస్థలు, అదితిలాంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు కీలకం అవుతాయి.‘నిన్న నువ్వు ఏమిటో తెలుసుకొనే జ్ఞాపకం నీలో ఉన్నట్లే రేపు నువ్వు ఏమిటో నిరూపించుకునే జ్ఞానం, శక్తి నీలో ఉన్నాయి’ అంటుంది అదితి అరోరా.
దిశానిర్దేశం
లింగ సమానత్వం, స్త్రీవాదం గురించి మాట్లాడడానికి స్కూల్స్, కాలేజీలకు వెళుతుంటుంది అదితి అరోరా. విద్యార్థుల మనసుల్లో దాగున్న ఎన్నో సందేహాలు ఆ సమయంలో బయటికి వస్తాయి. వాటికి సమాధానం ఇవ్వడమే కాదు దిశానిర్దేశం కూడా చేస్తుంది అదితి అరోరా. ఎన్నో బడులు, కాలేజీలలో గర్ల్ అప్ క్లబ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లబ్‌లో అయిదుగురు సభ్యులతో పాటు ప్రెసిడెంట్, వైస్–ప్రెసిడెంట్, సెక్రెటరీలు ఉంటారు. నిర్దిష్టమైన అంశాలపై ఈ క్లబ్‌ల కోసం వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించింది. అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం ‘ఇలాంటి విషయాలు అమ్మాయిలకు ఎందుకు’ అన్నట్లుగానే వ్యవహరించాయి. వారి ధోరణితో ఎప్పుడూ నిరాశపడలేదు అదితి.
Comments
Please login to add a commentAdd a comment