పెళ్లి కూతురు అలంకరణలో రకరకాల మోడల్స్‌లో ఉన్న బ్రేస్‌లెట్ రింగ్స్ మెహెందీ చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇక గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ వేడుకల్లో స్టైలిష్ డ్రెస్‌లకు మరింత స్టైలిష్ లుక్‌నిస్తున్నాయి ఈ బ్రేస్‌లెట్ రింగ్స్.
అమ్మాయిల అలంకరణలో ప్రతిదీ ప్రత్యేకతను నింపుతుంది. అందమైన దుస్తులే కాదు ఆభరణాలూ అంతే ఘనంగా ఉండాలనుకుంటారు. ఏ వేడుక అయినా మెడలో హారాలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు మ్యాచింగ్‌గా ఎంపిక చేసుకుంటుంటారు. బంగారు, వెండి లేదా ఫ్యాన్సీ ఆభరణాలను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు.
వీటిలో బ్రేస్‌లెట్ రింగ్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ముంజేతిని చుట్టేసే బ్రేస్‌లెట్... దాని నుంచి వేలి ఉంగరానికి జత చేస్తూ ఉన్నట్టుగా ఉండే ఈ మోడల్స్ చేతులను మరింతగా హైలైట్ చేస్తున్నాయి.
పూసలు వరసలు... ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతున్నాయి. అంటే, సంప్రదాయ వేడుకల సమయాల్లో వీటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్‌బీడ్స్ వరసతో ఈ అల్లికను గమనించవచ్చు.
రత్నాల రాశులు... నవరత్నాలు, డైమండ్స్ పొదిగిన బ్రేస్‌లెట్ రింగ్స్ పెద్ద పెద్ద వేడుకల్లో మరింత గ్రాండ్‌గా వెలిగిపోతున్నాయి.
బంగారు హంగు... బంగారు తీగెలతో రూపుకట్టిన ఈ ఆభరణం. ఇటు సంప్రదాయ, అటు స్టైలిష్ వేర్‌లా కూడా పార్టీకి తగిన హంగును తీసుకువస్తుంది.
వెండి జిలుగులు... వెండి జిలుగుకు పెద్ద పెద్ద స్టోన్స్ జత కలిసిన బ్రేస్‌లెట్ రింగ్స్ మోడర్న్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌ని ఇస్తున్నాయి. ఇవి ఏ కాలమైనా యూత్‌ని మెప్పిస్తూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment