బ్రాస్లెట్‌లలో జీపీఎస్!
బీజింగ్: మతిమరుపు లాంటి సమస్యలతో బాధ పడుతున్న వృద్ధుల కోసం చైనా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధులు మళ్లీ ఇళ్లు చేరడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించి.. వారికి ప్రత్యేక బ్రాస్లెట్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.
జీపీఎస్‌తో కూడిన బ్రాస్లెట్‌ను వృద్ధులు ధరించడం ద్వారా తప్పిపోయినప్పుడు వారిని గుర్తించడం సులభమౌతుందని.. అందుచేత మతిమరుపు సమస్యలున్న 12,000 మంది వృద్ధులకు త్వరలోనే బ్రాస్లెట్‌లను పంపిణీ చేయనున్నట్లు బీజింగ్ డిప్యూటీ మేయర్ వాంగ్ నింగ్ తెలిపారు. దీంతో వృద్ధులకు సంబంధించిన వారు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వారి ఆచూకీని తెలుసుకోగలరని తెలిపారు. అంతే కాదు ఆ బ్రాస్లెట్‌తో వృద్ధులు ఎమర్జెన్సీ కాల్స్ సైతం చేసుకోవడానికి అవకాశం ఉంది. 2015లోని సమాచారం ప్రకారం చైనా జనాభాలో 22 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడినవారే.