'ఆయనిచ్చిన బ్రాస్‌లెట్‌ వేలం వేస్తున్నా' | v hanumanthrao gifted bracelet to the jagga reddy | Sakshi
Sakshi News home page

'ఆయనిచ్చిన బ్రాస్‌లెట్‌ వేలం వేస్తున్నా'

Published Wed, Jun 7 2017 4:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

v hanumanthrao gifted bracelet to the jagga reddy

హైదరాబాద్‌: ఇటీవల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వీహెచ్‌ తనకు బహుకరించిన బంగారు బ్రాస్‌లెట్‌ను వేలం వేయనున్నట్లు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శనివారం(10 వ తేది) గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో ఈ వేలం కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్రాస్‌లెట్‌ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఖమ్మంలో బేడీలు వేసిన రైతులకు ఆర్థిక సాయంగా అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement