సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌కు కోపం తెప్పించాయి. రాహుల్‌కు దమ్ముంటే.. హైదరాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు అసదుద్దీన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు.
అసదుద్దీన్ ఓవైసీపై మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘‘అసదుద్దీన్.. నువ్వు ఎప్పుడైనా ప్రజా పోరాటాలు చేశావా? రైతుల కోసం గానీ, 12 శాతం రిజర్వేషన్ కోసం గానీ కేసీఆర్‌తో ఎప్పుడైనా కొట్లాడావా? హైదరాబాద్‌లో నీ మీద పోటీకి రాహుల్ అవసరం లేదు.. నేను వస్తా. కాంగ్రెస్ పార్టీ గనుక అవకాశం ఇస్తే.. నేను హైదరాబాద్ నుంచి పోటీ చేసి నిన్ను ఓడిస్తా. మరి మెదక్ నుంచి పోటీ చేసే దమ్ము నీకు ఉందా?’’ అని అసదుద్దీన్‌ను ప్రశ్నించారు జగ్గారెడ్డి.
చదవండి: కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment