ఈ ఫొటోలోని బ్రేస్‌లెట్ చాలా అందంగా ఉంది కదా.. ముత్యాలతో తయారు చేసిన ఈ బ్రేస్‌లెట్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పలువురు విద్యార్థులు రూపొందించారు. ఇలాంటివి చాలా చూశాం.. ఇందులో కొత్తేముందనే కదా మీ ప్రశ్న.. ఈ బ్రేస్‌లెట్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదంలో ఉన్న మహిళలను ఇది రక్షిస్తుందట.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా దుండగులు అటకాయిస్తే.. వెంటనే చేతికి తొడుక్కునే ఈ బ్రేస్‌లెట్ బిగ్గరగా శబ్దం చేస్తుందట. దీంతో చుట్టుపక్కల ఉన్న వారిని అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఎర్రని లైట్లు వెలుగుతూ దుండగుడు భయపడి పారిపోయేలా చేస్తుంది. పైగా ప్రమాద సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలన్నా కూడా కొన్నిసార్లు కుదరదు.
ఆ సమయంలో కృత్రిమ మేధస్సుతో ప్రమాదంలో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా పోలీసులకు మెసేజ్ పంపుతుంది. వ్యక్తి రక్త ప్రసరణ వేగాన్ని అంచనా వేయడం ద్వారా ఈ బ్రేస్‌లెట్ ప్రమాద పరిస్థితులను గుర్తిస్తుందట. దీన్ని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రాగిబ్ హసన్, విద్యార్థులు జయున్ పటేల్ కలసి తయారు చేశారు. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని కొన్ని పరీక్షలు నిర్వహించి అందుబాటులోకి తీసుకొస్తామని హసన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment