
‘క్వాంటికో’తో ప్రియాంకా చోప్రా, ఇప్పుడు ‘సూపర్ గాళ్’తో అమీ జాక్సన్... ఈ లిస్టులో చేరబోయే నెక్ట్స్ ఇండియన్ హీరోయిన్ ఎవరో మరి! అమీది బ్రిటన్ అయినా.. ఇండియన్ సినిమాలతోనే హీరోయిన్‌గా పేరొచ్చింది. ఇండియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చూసే అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్ గాళ్’లో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారట! అందులో అమీ ‘సాటర్న్ గాళ్’ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
వచ్చే నెల 9వ తేదీ నుంచి సీడబ్ల్యూ ఛానల్‌లో ‘సూపర్ గాళ్’ టెలికాస్ట్ కానుంది. సినిమాల సంగతికొస్తే... హిందీ హిట్ ‘క్వీన్’ సౌతిండియన్ రీమేక్స్‌తో పాటు కన్నడ ‘విలన్’లో అమీ నటిస్తున్నారు. రజనీకాంత్ పక్కన ఆమె హీరోయిన్‌గా నటించిన ‘2.0’ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.