
అందానికి సంకెళ్లు
ఈ ఫొటోలో ప్రియాంకా చోప్రాను చూశారా! ఎఫ్‌బీఐ యూనిఫాంలో ఉన్న ఆమె చేతికి సంకెళ్లేంటా అనుకుంటున్నారా...ఈ స్టిల్ ఆమె నటిస్తున్న
ఈ ఫొటోలో ప్రియాంకా చోప్రాను చూశారా! ఎఫ్‌బీఐ యూనిఫాంలో ఉన్న ఆమె చేతికి సంకెళ్లేంటా అనుకుంటున్నారా...ఈ స్టిల్ ఆమె నటిస్తున్న ‘క్వాంటికో’ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లోనిది. ప్రియాంకా పాత్ర పేరు అలెక్స్ పర్రిస్. అసలు విషయంలోకి వెళితే అలెక్స్ పర్రిస్ అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే కోరిక. ఇక పెద్దయ్యాక అదే లక్ష్యంతో అమెరికా నేర పరిశోధక సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ)లో చేరుతుంది.
ట్రైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుంది. కానీ, అనుకోకుండా పరిస్థితులు తలకిందులవుతాయి. న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌ను తీవ్రవాదులు నేలమట్టం చేస్తారు. అనూహ్యంగా అలెక్స్‌పై తీవ్రవాది అనే ముద్ర వేస్తారు. ఆమె పరిస్థితి ఏంటి... తన నిజాయితీని ఎలా నిరూపించు కుందనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ టీవీ సీరీస్ సెప్టెంబర్ 27 నుంచి ఏబీసీ చానల్లో ప్రసారం కానుంది. షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ టీవీ సిరీస్‌లోని తన గెటప్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు ప్రియాంక. ఈ స్టిల్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయి, సోషల్ మీడియాలో ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.