
అక్కడివాళ్లతో గొడవ పెట్టుకున్నా!
పొరుగు దేశం వెళ్లినప్పుడు పుట్టిన దేశం గురించి నాలుగు మంచి మాటలు వింటే ఆనందం.
పొరుగు దేశం వెళ్లినప్పుడు పుట్టిన దేశం గురించి నాలుగు మంచి మాటలు వింటే ఆనందం. అదే వినకూడని మాటలు వింటే కలిగే బాధ వర్ణనాతీతం. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ షూటింగ్‌లో ప్రియాంకా చోప్రాకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ‘ఇండియా అంటే... రేప్‌లు చేస్తారే. ఆ దేశమే కదా’ అని ప్రియాంకను అక్కడివాళ్లు ప్రశ్నించారట.
ఆ ప్రశ్న విన్నప్పుడు ఒంటికి కారం రాసుకున్నట్లనిపించిందన్నారు ప్రియాంక. ‘‘మా దేశం అలాంటిది కాదని చెప్పడానికి ప్రయత్నించా. గొడవ పెట్టుకున్నంత పని చేశా! అత్యాచారాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ, మన దేశం ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. అదే వాదించా. దేశానికి చెడ్డ పేరు తెస్తున్నామని మనసులో పెట్టుకుంటే ఎవరూ అసలు అత్యాచారాలు చేయరు’’ అని ఆమె పేర్కొన్నారు.