
ప్రియాంకా చోప్రా, నిక్ జానస్
ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టినప్పుడు, వాహనం కొన్నప్పుడు లైసెన్స్ తీసుకోవాలి అని వింటుంటాం. మరి పెళ్లికి లైసెన్స్ ఏంటి? అనేగా మీ అనుమానం. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ లైసెన్స్ తీసుకుంటారు. ఆ లైసెన్స్ తీసుకున్న కొన్ని రోజుల (సుమారు మూడు నెలలు) వ్యవధిలో వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు. తాజాగా నిక్ జానస్, ప్రియాంకా చోప్రా కూడా అమెరికాలో పెళ్లి లైసెన్స్ తీసుకోనున్నారని టాక్. ఇటీవలే ఓ కోర్టుకి వెళ్లి లైసెన్స్ ఫామ్ కూడా నింపారట. వీరిద్దరూ ఇండియాలో వివాహం చేసుకోనున్నారు. దాన్ని మళ్లీ విదేశాల్లో అప్లై చేస్తే రెండు దేశాల్లో వీరి వివాహం లీగల్ అవుతుంది. ప్రస్తుతం నిక్, ప్రియాంక పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. వీరి వివాహం ఈనెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో జో«ద్ పూర్‌లో జరగనుంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఈ పెళ్లి జరగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment