ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరియల్ క్వాంటికోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 వ తేదీన ప్రసారం అయిన ఏపిసోడ్‌లోని దృశ్యాలపై పలువురు ఇండియన్ నెటిజన్లు మండిపడుతున్నారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ పేలుళ్లకు యత్నించింది భారతీయులే అనే విధంగా ఆ సీరియల్‌లో చూపెట్టడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రతిష్టకు చెడ్డ పేరు తీసుకొచ్చే సీరియల్‌లో నటిస్తావా అంటూ ప్రియాంకపై సోషల్ మీడియాలో విమర్శలు కురిస్తున్నారు.
అసలు ఏం చూపెట్టారు :
‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్‌బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్‌ను చిత్రీకరించారని’ ట్విటర్‌లో నెటిజన్లు పోస్ట్ చేశారు. ఇలాంటి సీరియల్‌లో ప్రియాంక ఎలా నటిస్తుందని పలువురు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ప్రియాంకపై, క్వాంటికో యూనిట్‌పై ట్విటర్ వేదికగా దాడికి దిగారు. క్వాంటికో మొదటి సీజన్ విజయవంతమైనప్పటికి, రెండో సీజన్‌లో ఈ సీరియల్‌కు రేటింగ్‌లు దారుణంగా పడిపోవడంతో మూడో సీజనే చివరిదని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment