ఒబామాతో ప్రియాంక డిన్నర్ | Priyanka Chopra has been invited to the White House | Sakshi
Sakshi News home page

ఒబామాతో ప్రియాంక డిన్నర్

Published Mon, Apr 4 2016 8:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

ఒబామాతో ప్రియాంక డిన్నర్

ఒబామాతో ప్రియాంక డిన్నర్

న్యూయార్క్: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు వైట్ హౌస్ నుంచి డిన్నర్కు ఆహ్వానం అందింది. ప్రతి ఏటా ఒక సాధారణ డిన్నర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అమెరికా శ్వేతభవనం పాటిస్తున్న ఆనవాయితీ. ది నాన్ ఫ్రాఫిట్ వైట్ హౌజ్ కరస్పాండెంట్ అసోసియేషన్ ప్రతి ఏటా ఒక డిన్నర్ నిర్వహిస్తుంటుంది. ఈ అసోసియేషన్ లో రిపోర్టర్లు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు, జర్నలిస్టులు ఉంటారు.

జర్నలిజంలో స్కాలర్ షిప్పులు అందజేసేందుకు కావాల్సిన డబ్బుకోసం వైట్ హౌజ్ తరపున ఈ డిన్నర్కు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పటికే క్వాంటికో అనే టీవీ కార్యక్రమంతోపాటు బే వాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంకను వారు డిన్నర్కు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు, మిషెల్లీ ఒబామా కూడా పాల్గొంటారు. ప్రియాంకతోపాటు ఇతర హాలీవుడ్ నటులు బ్రాడ్లీ కూపర్, ల్యూసీ లియూ, జేన్ ఫాండా, గ్లేడీస్ నైట్ కూడా ఈ విందుకు హాజరవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement