హలో..నా పేరు ప్రియాంక! | Hello My Name is Priyanka Chopra | Sakshi
Sakshi News home page

హలో..నా పేరు ప్రియాంక!

Published Sun, Apr 30 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

హలో..నా పేరు ప్రియాంక!

హలో..నా పేరు ప్రియాంక!

సొంత గడ్డ మీద ప్రియాంకా చోప్రా స్టార్‌. పరాయి దేశంలో నాన్‌–స్టార్‌. ఇది నిన్నటి మాట. ఎప్పుడైతే అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’లో నటించడం మొదలుపెట్టారో అప్పుడు ప్రియాంకా చోప్రా విదేశాల్లోనూ చాలా పాపులర్‌ అయిపోయారు. హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’ అంగీకరించాక మరింత పాపులార్టీ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ప్రియాంక ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపడుతున్నారు.

 అయితే, ‘క్వాంటికో’ ఒప్పుకున్నప్పుడు విదేశాల్లో ప్రియాంకా చోప్రాను గుర్తుపట్టేవాళ్ల సంఖ్య తక్కువగానే ఉండి ఉంటుంది. ఆమెను నాన్‌–స్టార్‌గా చూసినవాళ్లూ ఉండే ఉంటారు. ఆ సమయంలో మీ ఫీలింగ్స్‌ ఏంటి? అనే ప్రశ్న ప్రియాంకా చోప్రా ముందుంచితే – ‘‘ నేను ఇండియాలో స్టార్‌ అయినంత మాత్రాన ప్రపంచమంతా గుర్తిస్తుందని అనుకోను.

ప్రతి దేశంలోనూ ఎంతమంది గొప్ప స్టార్లు ఉంటారు. ఒకవేళ నా తోటి యాక్టర్లకు నేను తెలియకపోతే వారి దగ్గరికి వెళ్లి ‘హలో నా పేరు ప్రియాంక.. నేను ఇండియన్‌ యాక్టర్‌’ను అని పరిచయం చేసుకుంటాను. ఇందులో చిన్నతనంగా ఫీలవ్వడానికి ఏం లేదు. ఈ విషయంలో నాకు ఎటువంటి ఈగో లేదు’’ అన్నారామె. నిజంగా ప్రియాంక గ్రేట్‌ కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement