సస్పెన్స్ కొనసాగిస్తున్న ప్రియాంక | Priyanka Chopra mum on Kalpana Chawla film | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ కొనసాగిస్తున్న ప్రియాంక

Published Fri, Jul 1 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

సస్పెన్స్ కొనసాగిస్తున్న ప్రియాంక

సస్పెన్స్ కొనసాగిస్తున్న ప్రియాంక

ముంబై: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి కల్పనా చావ్లా జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాపై బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా సస్పెన్స్ కొనసాగిస్తోంది. అమెరికా టీవీ సిరీస్ 'క్వాంటికో' రెండో సీజన్ పూర్తయ్యే వరకు హిందీ సినిమాలు చేయబోనని ప్రియాంక చెప్పింది. అయితే కల్పనా చావ్లా సినిమాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

'క్వాంటికో రెండో సీజన్ పూర్తయ్యే వరకు హిందీ సినిమాలు చేయలేను. ఒక ప్రాజెక్టు మాత్రమే చేతిలో ఉండడంతో నాకు చాలా ఖాళీ సమయం చిక్కింది. అందుకే ముంబైలో తీరిగ్గా గడుపుతున్నా. పలువురు దర్శకులు నాకు కథలు వినిపించారు. వచ్చే ఏడాదికి క్వాంటికో  పూర్తవుతుంది. ఇప్పుడు హిందీలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఏడాదికి నాలుగు సినిమాలు చేసే దాన్ని, ఇప్పుడు ఒకటి లేదా రెండు మాత్రమే చేస్తున్నాను. నాకున్న సమయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించు కోవాలనుకుంటున్నా. 2017, మార్చి వరకు వేరే సినిమాల్లో నటించడానికి అవకాశం లేద'ని ప్రియాంక చోప్రా చెప్పింది. 'జై గంగా జల్' హిందీ సినిమాలో చివరిసారిగా కనిపించింది. హాలీవుడ్ లో తన తొలి సినిమా 'బే వాచ్' షూటింగ్ ఇటీవలే  పూర్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement