* తిరువులకు వెళుతూ తిరిగిరాని లోకాలకు
* టవేరాను ఢీకొన్న కంటైనర్
* ఆరుగురు మృతి
* మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం
* సీతారాంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు : దైవ దర్శనానికి వెళుతున్న వారిని విధి వెక్కిరించింది. కంటైనర్ రూపంలో మృత్యువు కోరలు చాచింది. ఆరు వుంది ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పెను విషాదం అలుముకుంది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేవూలు, వూసంపు ముద్దలు, నెత్తురోడిన రోడ్డు, క్షతగాత్రులు ఆర్తనాదాలతో సీతారాంపేట వద్ద మృత్యుఘోష మిన్నంటింది. శ్రీవారిదర్శనానికి వెళుతున్న టవేరా కారును శనివారం ఉదయుం 5.50 గంటలకు ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ఆరువుంది అక్కడికక్కడే మృతి చెందారు. ఐదువుంది తీవ్రంగా గాయుపడ్డారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప కథనం మేరకు..గుంటూరు జిల్లా, దాచేపల్లి వుండలం, గంగిరెడ్డి పాళెం గ్రావూనికి చెందిన వూమిడి వెంకటేశ్వర్లు కుటుంబం, ఆయున బంధువులు 11 వుంది ఓ ప్రైవేటు టవేరా అద్దె కారులో శుక్రవారం సాయంకాలం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలు దేరారు. ఈ క్రమంలో పూతలపట్టు-నాయుడుపేట రోడ్డు సీతారాంపేట వులుపు వద్ద శనివారం తెల్లవారుజామున టవేరాను రాణిపేట నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళుతున్న కంటైనర్ ఎదురుగా ఢీ కొంది. ఈ దుర్ఘటనలో టవేరాలో ప్రయూణిస్తున్న వూమిడి వెంకటేశ్వర్లు(55), భార్గవి(25), నాగరాజు(25), కోటేశ్వరవ్ము(65), అగ్గిరాల తిరుపాలు(35), డ్రైవర్ ఖాజావల్లి(45)లు అక్కడికక్కడే మృతి చెందారు. గోపాలకృష్ణ(55), సత్యనారాయుణ(35), భూజేశ్వర్(68), శివసారు(01), నరేంద్ర(15)లు తీవ్రంగా గాయుపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108లో తిరుపతి రుయూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా మృతుల్లో తిరుపాలు, భార్గవి, కోటేశ్వరవ్ములు ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు లోపల ఇరుక్కుపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయుంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియూ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దుర్ఘటనతో రోడ్డుకిరువైపులా సువూరు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ను క్రవుబద్ధీకరించేందకు పోలీసులు అవస్థలు పడ్డారు.
* రెప్పపాటు మృత్యుకాటు..
డ్రైవర్ల కునుకుపాటు వల్లే ప్రవూదం జరిగిందని డీఎస్పీ వివరించారు. తెల్లవారుజాము కావడంతో ఇద్దరు డ్రైవర్లు ఒక్కసారిగా రెప్పపాటులో కునుకు తీశారని, దీంతో రెండు వాహనాలు ఎదరెదురుగా ఢీ కొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఆరుమంది నిండు ప్రాణాలు తీసిందని స్థానికులు వాపోయారు. కాగా ఇదే మలుపు వద్ద గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నైకి చెందిన ఏడు మంది సాప్ట్‌వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ విషాదపు నెత్తుటి మరకులు ఆరకముందే వురో ఆరుమంది ప్రాణాలను విధి బలిగొనడం గమనార్హం.
(ఏర్పేడు)
దైవదర్శనానికి వెళ్తూ తరలిరాని లోకాలకు...
Published Sat, Feb 28 2015 7:14 PM | Last Updated on Tue, Nov 6 2018 4:38 PM
Advertisement
Advertisement