సాక్షి, హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మాటల తుటాలు పేల్చారు. రాహుల్‌కి మసీదులు, ముస్లింలు కంటపడారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో దేవాలయాలకు క్యూ కట్టిన రాహుల్ తాజాగా మళ్లీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘‘ రాహుల్ జీ.. మీకు గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా? వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు?’’ అని ఒవైసీ రాహుల్‌ను ప్రశ్నించారు. కేవలం మత రాజకీయాలతోనే పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా ముస్లిం ప్రజల హామీల గురించి ప్రస్తావించలేదని.. ఇలా ఎన్నికల్లో గెలవటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటమేనని ఒవైసీ చెప్పారు.
ఇక నిన్న రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. ‘‘పార్టీకో రంగును పులుముని మత రాజకీయాలు చేస్తున్నాయ్. అవి తల్చుకుంటే ఏం చేయలేవ్. అదే మేం తల్చుకుంటే ఎంతకైనా తెగిస్తాం. ఆ దెబ్బకి మోదీ, కాంగ్రెస్.. ఇలా ఏవీ పనికి రాకుండా పోతాయ్’’ అని ఒవైసీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment