అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్ ఫోటో)
పట్నా : ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో హిందూవుల ఓట్లకు గాలం వేసేందుకే బీజేపీ ప్రభుత్వం రామాయణ్ ఎక్స్‌ప్రెస్‌ను తెరపైకి తీసుకువచ్చింది ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బిహార్‌లో తన మద్దతుదారులతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒవైసీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్‌ను హైటెక్ డ్రామాగా వర్ణించారు. కేవలం ఓట్లను రాబట్టుకోవడానికి ఎన్నికలు ముందు బీజేపీ ఆడిన నాటకమని విమర్శించారు. బీజేపీ పాలనలో కశ్మీర్ అగ్నిగుండంలా మారిందని, కేంద్ర ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల అమాయక సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని దురంహకార పార్టీగా వర్ణించిన ఒవైసీ.. రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. గుజరాత్ ఎన్నికల సమయంతో 50కిపైగా హిందూ దేవాలయాలను రాహుల్ సందర్శించారిని, ఒక్క మసీదుకైనా వెళ్లారా అని ప్రశ్నించారు. గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా ఎంఐఎం పోటీ చేయలేదని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీల ఓట్లను రాబట్టుకోలేక పోయిందని అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు పెరగడం వల్లన ఇటీవల కాలంలో దేశంలో ముస్లింల జనాభా శాతం పెరుగుతోందని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం.. ముస్లింలు చాలా వివాహలు చేసుకుంటారని, వారి భార్యలకు అక్రమంగా విడాకులు ఇస్తున్నారని విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment