చిక్‌మగుళూర్‌లోని శృంగేరి శారదాంబ ఆలయాన్ని సందర్శించిన రాహుల్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం చిక్‌మగలూర్‌లోని శృంగేరి శారదాంబ దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ పంచెను ధరించి పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు జరిపారు. శృంగేరీ మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను రాహుల్ కలవనున్నారు. అక్కడి వేదపాఠశాలలోని విద్యార్ధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటిస్తారు.
అనంతరం చిక్‌మగలూర్ ప్రాంతంలో రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొంటారు. చిక్‌మగలూర్ దివంగత ప్రధాని, రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీ రాజకీయ పునరామగమనానికి కేంద్ర బిందువు కావడం గమనార్హం. కాగా రాహుల్ మంగళవారం దక్షిణ కర్ణాటకలో జనాశీర్వాదయాత్రలో పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా దేవాలయం, చర్చి, దర్గాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment