chikmagalur
-
మాణిక్యధార కొండకు పోటెత్తిన భక్తులు
-
Viral Video: ఎమ్మెల్యేపై గ్రామస్థుల దాడి.. తరిమి తరిమి కొట్టిన జనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో తమ ప్రాంతంలో తరుచూ ఏనుగు బారిన పడి ప్రజలు చనిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు. అయితే మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ మ్మెల్యేపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. The villagers were outraged & gave gherao to #BJP MLA #MPKumaraswamy. They have been driven on the main road of the village. Some of the villagers who were very indignant also abused with unspoken sounds. #BJPMLA's were grabbed & dragged.#Karnataka #Chikkamagaluru pic.twitter.com/NyY2oOegeT — Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022 ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి, తరలించారు. కాగా ఏనుగు దాడిలో చనిపోయిన బాధిత కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్తే గ్రామస్థులు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే కుమారస్వామి ఆరోపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. Chikkamagaluru, Karnataka | Mudigere MLA from BJP, MP Kumaraswamy's clothes were allegedly torn by locals of Hullemane village when he visited them following the death of a woman in an elephant attack. The villagers alleged that the MLA didn't respond properly to elephant attacks pic.twitter.com/xIeCiSlBDX — ANI (@ANI) November 21, 2022 ఏనుగు దాడిలో మహిళ మృతి.. భర్త కళ్ల ముందే ఘోరం ఏనుగు దాడిలో మహిళ మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి సతీశ్‌గౌడ, శోభ దంపతులు పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా పరుగులు తీశారు. శోభను ఏనుగు వెంబడించి ఆమెను తొక్కి చంపేసింది. కళ్ల ముందే భార్య చనిపోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు. గతంలోను కెంజి గ్రామానికి చెందిన ఆనంద దేవాడిగను ఏనుగు ఇలాగే బలిగొంది, ఈ ఘటనతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. -
Chikmagalur: చిక్‌మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం
మనం ఏదైనా చేస్తే అది ప్రత్యేకంగా ఉండాలి. అలాంటిది మరొకటి లేదనేటట్లు కూడా ఉండాలి. అంతేకాదు... నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి వస్తువూ పర్యావరణానికి హాని కలిగించనిదై ఉండాలి. ఆ మెటీరియల్ అంతా భవనాన్ని కూల్చినప్పుడు తిరిగి మట్టిలో ఇట్టే కలిసిపోయేదై ఉండాలి... ఇది కర్నాటక, చిక్‌మగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కి వచ్చిన ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే చిక్‌మగళూరు, ఎఐటి కాలేజ్ రోడ్లో ఉన్న సన్యాట ఎకో రిసార్ట్. చూసి వద్దాం! సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఎర్త్ టన్నెల్స్‌తో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఎకో రిసార్టు నిర్మాణంలో ఇటుకల నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా తయారు చేశారు. పిల్లర్లకు కూడా ఇనుము ఉపయోగించలేదు. వర్షపు నీటి నిల్వ కోసం భూగర్భంలో యాభై వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకు ఉంది. బాత్రూమ్లో వాడిన నీటిని శుద్ధి చేసి టాయిలెట్ ఫ్లష్‌కు, మొక్కలకు చేరే ఏర్పాటు... ఇలా ఒక ప్రయోగమే జరిగింది. నాచురల్ ఎయిర్ కండిషనర్‌గా రూపుదిద్దుకున్న ఈ రిసార్ట్‌లో పదకొండు గదులున్నాయి. చిక్‌మగళూరు వాతావరణం వేడిగానే ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణంలో ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల మధ్యనే ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలతో ఈ ఎకో రిసార్టు చిక్‌మగళూరు పర్యాటక ప్రదేశాల జాబితాలో ఒకటైంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ రిసార్టులో బస చేయగలిగింది కొందరే, ఎక్కువమంది పర్యాటకులు ఈ రిసార్టును చూడడానికే వస్తుంటారు. రిసార్టు ఆవరణలో చిక్‌మగళూరు చుట్టు పక్కల తయారయ్యే హస్తకళాకృతుల స్టాల్స్ కూడా ఉంటాయి. చిక్‌మగళూరు టూర్లో చూడగలిగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో! అవి ఎంతెంత దూరాన ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఉన్నాయి! ►బేలూరులో హొయసల రాజుల నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకలను చూడవచ్చు. ఇది చిక్మగళూరుకి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. బేలూరు చూసిన వాళ్లు హలేబీడును చూడకుండా ఉండలేరు. ఇది బేలూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ►శృంగేరి మఠం... తుంగ నది తీరాన చిక్‌మగళూరుకు ఎనభై కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడే శారదా పీఠం కూడా ఉంది. మహాత్మా గాంధీ పార్క్. ఇది చిక్‌మగళూరు బస్‌స్టాండ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరాన రత్నగిరి బోరెలో ఉంది. ►బల్లాలరాయన దుర్గ ఫోర్ట్... ఇది డెబ్బై కిలోమీటర్ల దూరాన కొండ మీద ఉంది. కర్నాటక– ద్రవిడ నిర్మాణశైలుల సమ్మేళనం ఈ కోట. కవికాల్ గండి వ్యూ పాయింట్... ఇది పద్దెమినిది కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి చిక్మగళూరులోని పర్యాటక ప్రదేశాలు కనువిందు చేస్తాయి. ►ఝరీ వాటర్ ఫాల్స్... దాదాపు తొంబై కిలోమీటర్ల దూరాన అత్తిగుండి గ్రామంలో ఉంది. తెల్లగా ఉండే నీటి ధారలను పాలతో పోలుస్తూ జలపాతానికి పాలధారను ఉపమానంగా చెప్పడం తెలిసిందే. అయితే ఇక్కడి వాళ్లు ఈ జలపాతం నీటిని మజ్జిగతో పోలుస్తారు. కాఫీ తోటల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ►జెడ్ పాయింట్... ఇది అరవై కిలోమీటర్ల దూరాన పదిహేను వందల మీటర్ల ఎత్తు కొండ మీద ఉంది. ట్రెకింగ్ లవర్స్‌కు ఇది మంచి లొకేషన్. ►కాఫీ మ్యూజియం... ఆరు కిలోమీటర్ల దూరాన దాసరహల్లిలో ఉంది. చిక్‌మగళూరు వెళ్లిన వాళ్లెవరూ ఈ కాఫీ మ్యూజియాన్ని చూడకుండా రారు. ఘుమఘుమలాడే కాఫీ గింజల పరిమళాన్ని ఆస్వాదిస్తూ... కాఫీ మొక్క నుంచి కాఫీ తయారయ్యే వరకు ప్రతి ప్రక్రియనూ చూడవచ్చు. ►ఖుద్రేముఖ్ నేషనల్ పార్క్... ఇది వంద కిలోమీటర్ల దూరాన ఉంది. ట్రిప్‌లో ఒక రోజును ఈ నేషనల్ పార్క్ కోసమే కేటాయించుకోవాలి. ఏమి తినాలి? ఎక్కడ తినాలి? ►చిక్మగళూరులోని మహారాజా రెస్టారెంట్లో మటన్ బిర్యానీ రుచి చూడాలి. ►బ్రేక్‌ఫాస్ట్‌కి టౌన్ క్యాంటీన్ ప్రసిద్ధి. ఇందులో వెన్న రాసిన క్రిస్పీ దోశె తిని మంచి కాఫీ తాగడం మర్చిపోవద్దు. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లో గులాబ్ జామూన్ ఇస్తారు. ►మెసూర్ ఫుడ్స్‌లో... మైసూర్ మసాలా దోశె, మైసూర్ బజ్జీలు కన్నడదేశంలో పర్యటిస్తున్నామని గుర్తు చేస్తాయి. ►చిక్మగళూరులో మాంసాహారులు, శాకాహారులతోపాటు వేగాన్లకు కూడా ప్రత్యేక రుచులు ఉంటాయి. -
యువ బాడీబిల్డర్ దారుణ హత్య
యశవంతపుర: చిక్కమగళూరు నగరంలో బాడీ బిల్డర్ హత్యకు గురయ్యాడు. మను (21)పై గుర్తు తెలియని దుండగులు బుధవారం దాడి చేశారు. గురువారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. హిందూ సంఘాల కార్యక్రమాల్లో ఇతడు చురుగ్గా పాల్గొనేవాడు. పోలీసులు ఒక అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలో జరిగే మిస్టర్ చిక్కమగళూరు బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను ఖండిస్తూ నగరంలోని ఎంజీ రోడ్డులో వ్యాపారులు షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. హంతకులను అరెస్టు చేయాలని హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేశారు. బాలిక ఆత్మహత్య మైసూరు: ఉగాది పండగకు కొత్త దుస్తులు కొనివ్వలేదని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. నాయుడితోట వద్ద బసవరాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయనకు హర్షిత(12)అనే కుమార్తె ఉంది. ఉగాది పండగకు కొత్త దుస్తులు కొనాలని తల్లిదండ్రులను అడిగింది. జీతం వచ్చిన తరువాత ఇంట్లోవారందరికీ దుస్తులు కొనిస్తానని తండ్రి చెప్పాడు. దీంతో మనోవేదనకు గురైన బాలిక ఇంటిలో ఉరివేసుకుంది. చదవండి: తీరని శోకం: నీటికుంటలో మృత్యుఘోష పురుగుల మందు తాగి ఉద్యోగిని ఆత్మహత్య -
మైనర్‌పై ఐదు నెలలుగా.. 17 మంది
బెంగళూరు: ఓ మైనర్ బాలికను అపహరించి.. అత్యాచారం చేయడమే కాక లైంగిక హింసకు పాల్పడ్డ ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఐదు నెలలుగా మృగాళ్లు బాలికపై అకృత్యానికి ఒడిగడుతున్నారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బాధితురాలి బంధువు ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక చిక్ మంగుళూరుకు చెందిన బాధితురాలి తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి ఆమె తన బంధువుతో కలిసి నివసిస్తూ.. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్ సంస్థలో పని చేసేది. ఈ క్రమంలో బాలికకు గిరీష్ అనే బస్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. బాధితురాలి గురించి పూర్తిగా తెలుసుకున్న గిరీష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక దీని గురించి తన ఆంటీకి చెప్పింది. తోడుగా నిలబడాల్సిన ఆమె.. బాలికని బెదిరించి మరి కొందరి వద్దకు పంపింది. ఇక బస్ డ్రైవర్ గిరీష్ బాలికతో ఉన్న సంబంధం గురించి బయట చెప్తానని బెదిరించి స్మాల్ అభి అనే వ్యక్తి వద్దకు బాధితురాలిని పంపాడు. (చదవండి: ఆ దారుణం వెనుక ముగ్గురు మహిళలు) అభి బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టడమే కాక వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి పలుమార్లు ఆమెపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి స్నేహితులు కూడా బాలికను అత్యాచారం చేశారు. ఇలా దాదాపు 17 మంది రాక్షసులు గత ఐదునెలలుగా బాధితురాలిపై రాక్షసకాండ కొనసాగిస్తున్నారు. దీని గురించి తెలియడంతో జిల్లా డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో స్మాల్ అభి, గిరీష్, వికాస్, మణికంట, సంపత్, అశ్వత్‌గౌడ, రాజేష్, అమిత్, సంతోష్, దీక్షిత్, సంతోష్, నిరంజన్, నారాయణ గౌడ, అభి గౌడ, యోగీష్, మైనర్ అత్త, ఎంజీఆర్ క్రషర్ యజమానిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. భారత శిక్షాస్మృతిలోని 201, 370 (అక్రమ రవాణా), 376 (3), 376 (ఎన్) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం, బాల కార్మిక సవరణ చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: బాలికకు గర్భం.. నిందితుడికి బెయిలు) ఇక ఈ దారుణంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య.. బీజేపీ ఎంపీ శోభా కరండ్లజే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఎఫ్ఐఆర్లో పేరున్న కొందరు నిందితులకు బీజేపీతో సంబంధం ఉంది.. అందుకే వీరు మౌనంగా ఉన్నారని ఆమె ఆరోపించారు. -
‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు. మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు. అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్ సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే
సాక్షి, ముంబై : కాఫీ తోటల్ని ప్రేమించి, మంచి కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ చివరి ప్రస్థానం కూడా ఆ కాఫీ తోటల మధ్యే ముగియనుంది. 12వేల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ అంత్యక్రియలను కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలోని చట్టనహళ్లి గ్రామంలోని కాఫీ ఎస్టేట్‌లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. మంగళూరు నుండి 150 కిలోమీటర్లు, బెంగళూరుకు వాయువ్యంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ కాఫీ ఎస్టేట్ ఉంది. సోమవారం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ మృతదేహాన్ని నేత్రావతి నది వెనుక నీటిలో తేలుతుండగా బుధవారం ఉదయం ఇద్దరు మత్స్యకారులు గుర్తించారు. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత సిద్ధార్థ మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకంగా మారింది. అయితే పోలీసులు ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు. మరోవైపు వ్యవస్థాపక చైర్మన్ అకాల మరణం నేపథ్యంలో కెఫే కాఫీ డే ఔట్లెట్లకు సెలవు ప్రకటించారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించే మార్గంలో చిక్మంగళూరు పట్టణంలోని కాఫీ డే గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయానికి తరలించారు. దీంతో తమ అభిమాన నేత, లెజెండ్, కాఫీ డే కింగ్ మృతికి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించగా ఆయన మృతదేహాన్ని సందర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు వేలాదిగా తరలివచ్చారు. తప్పులన్నింటికి నాదే బాధ్యత అంటూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన సిద్ధార్థ ..కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారని చెప్పక తప్పదు. ప్రధానంగా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలో ప్రస్తావించిన ఐటీ శాఖ అధికారుల వేధింపులు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. Today we remember the legend that inspired us all. Thank you Chairman VG Siddhartha for your vision, leadership and the great legacy. pic.twitter.com/tYMiglgofe — Cafe Coffee Day (@CafeCoffeeDay) July 31, 2019 -
జలపాతాలు, కొండలతో కమనీయ దృశ్యాలు
సాక్షి బెంగళూరు : వేసవి విడిదికి, పర్యాటకానికి చిక్కమగళూరు జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పవచ్చు. తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం.. నిత్యం వర్షాలు కురుస్తుండటం.. చల్లటి వాతావరణం ఉండటంతో వేసవి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి చిక్కమగళూరుకు పర్యాటకులు తరలివస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోనే పచ్చదనానికి నిలయంగా మారడంతో వేసవి కాలంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు.. బాబా బుడాన్‌గిరి ముస్లిం పేరుతో చిక్కమగళూరు జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతం కావడం విశేషం. కుల మతాలకు అతీతంగా బాబా బుడాన్‌గిరి ప్రాంతాన్ని ఆదరిస్తారు. హిందూ, ముస్లి, క్రైస్తవులు పర్యాటకానికి వస్తారు. దత్తాత్రేయ పీఠం, బాబా బుడాన్ గిరి దర్గా ఎక్కువ ప్రసిద్ధి. హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం భద్రనది తీరాన ఉండే హిందూ దేవాలయంగా హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం ప్రసిద్ధి గాంచింది. పశ్చిమ కనుమల భాగంలో ఉంటుంది. శాంతియుత వాతావరణం, అన్నదానం తదితర కార్యక్రమాలకు ప్రసిద్ధి. హీరేకొలాల్ సరస్సు మానవ నిర్మిత శాంతికి ప్రతీకగా హీరేకొలాల్ సరస్సును పిలుస్తారు. చుట్టూ కొండ ప్రాంతాలు ఉంటాయి. మేఘాలు, మంచుతో కప్పుకుని అందంగా కనిపిస్తాయి. శృంగేరి శారదా పీఠం ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్య శృంగేరి శారదా పీఠం ఆరంభించారని చెబుతారు. తుంగానది తీరంలో ఉంది. చిక్కమగళూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో టాప్10 జాబితాలో ఉందని చెప్పవచ్చు. ముల్లాయనగిరి చంద్రద్రోణి కనుమల్లో ఉంది. భూ ఉపరితలానికి 1,950 మీటర్ల ఎత్తులో ఉంది. కర్ణాటకలోనే ఎత్తైన పాంతం. పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి. వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తారు. సూర్యాస్తమయం, నంది విగ్రహం ఆకట్టుకుంటాయి. కుద్రేముఖ్ – చిక్కమగళూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కుద్రేముఖŒ ఒకటి అని చెప్పవచ్చు. పచ్చని కొండ ప్రాంతాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఆకుపచ్చని తివాచీగా పర్యాటకులు భావిస్తారు. కొండల మధ్యలో జలపాతాలు కనువిందు చేస్తాయి. కాదంబి వాటర్ ఫాల్స్ చూడదగ్గ ప్రాంతాలు. వీరనారాయణ దేవస్థానం ప్రాచీన పురాతన ఆలయాల్లో వీరనారాయణ దేవస్థానం ఒకటి. క్రీ.శ.12వ శతాబ్డంలో హొయసాల రాజులు నిర్మించారు. ప్రాచీన సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. జెడ్ పాయింట్ ప్రకృతి అందాల నిలయంగా జెడ్ పాయింట్‌ను పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో భాగమై ఉంది. జెడ్ పాయింట్ కొండను సులభంగా ఎక్కవచ్చు. బెంగళూరు నుంచి ప్రైవేటు రవాణా సంస్థల ద్వారా చేరుకోవచ్చు. -
హీరో సుదీప్‌కు అరెస్ట్ వారెంట్
బెంగళూరు : కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాఫీ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చిక్మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు చిక్మంగళూరు జెఎంఎఫ్‌సీ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ లోగా సుదీప్ ఆచూకి తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించిందిజ ప్రస్తుతం ఆ వార్త శాండల్‌వుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా నిలిచింది. కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు మేరకు నటుడు సుదీప్, కన్నడ టీవీ రియాలిటీ షో సుదీప్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్ కిచ్చా క్రియేషన్స్‌పైనా, డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్ కోసం తన ఎస్టేట్‌ను అద్దెకు తీసుకొన్నారు. ఇందుకు కోటి 80 లక్షల రూపాయలను చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ రూ. 50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును ఎగ్గొట్టారని, అలాగే తన కాఫీ తోటల్ని, మరికొంత వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారని దీపక్ ఆరోపించారు. ఒప్పందానికి భిన్నంగా లోపల ఒక సెట్‌ను కూడా నిర్మించారనీ, తనకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మోసం చేశారంటూ మొదట జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో ఎస్పీ సలహా మేరకు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడనేది ప్రధాన ఆరోపణ. -
చిక్మగళూరులో...
నందమూరి తారకరత్న, మేఘశ్రీ జంటగా శివప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అమృత వర్షిణి’. చాందిని క్రియేషన్స్ పతాకంపై నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. తారకరత్న మాట్లాడుతూ– ‘‘కథ నచ్చడంతో పాటు అభిరుచి ఉన్న దర్శక, నిర్మాతలు కావడంతో ఈ సినిమా చేస్తున్నాను. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ సిట్టింగ్‌లోనే తారకరత్నగారు స్టోరీ ఫైనలైజ్ చేశారు. యూత్‌కు, ఫ్యామిలీస్‌కు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. చిక్మగళూరులో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు శివప్రభు. ‘‘నిర్మాతగా నా తొలి సినిమా ఇది. శివప్రభు కన్నడంలో నాలుగు సినిమాలు చేశాడు. ఈ నెల 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని నాగరాజు నెక్కంటి అన్నారు. ‘‘ఈ సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు మేఘశ్రీ. ఈ చిత్రానికి కెమెరా: సభా కుమార్, సంగీతం: జెస్సీ గిప్ట్, మాటలు–సహ దర్శకత్వం: సతీష్ కుమార్, సహ నిర్మాత: మంజునాథ. -
స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి సన్నీ, దీపిక
బొమ్మనహళ్లి: ఓ సమస్యపై స్పందించడానికి యువత చేసిన వినూత్న ప్రయోగం అందరిని ఆకట్టుకునేలా చేసింది. కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని మూడిగెరె తాలుకాలో ఉన్న కళస పట్టణానికి స్విమ్మింగ్ పూల్ ప్రారంభించడానికి ప్రముఖ నటీనటులు సన్నీలియోన్, దీపికా పదుకోనె వస్తున్నట్లు అక్కడి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లలో ఫొటోల గ్రాఫిక్స్ వైరల్‌గా మారాయి. అయితే అది నిజం కాదు. ఇక్కడి ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం వేసిన రోడ్లు ఇటీవల వర్షాలకు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం కోసం ఇలాంటి ప్రయోగం చేపట్టారు. గుంతలు పడిన రోడ్డును ఫొటో తీసుకుని వాటి పక్కనే స్విమ్మింగ్‌పూల్ ప్రారంభానికి నటులు సన్నీలియోన్, దీపికా పడుకునె వస్తున్నారని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతేకాకుండా ప్రముఖ తమిళ నటుడు విజయ్ కళస పట్టణానికి వచ్చి వినూత్నంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ వద్ద సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఫొటోసైతం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజాధనం వృథా చేస్తూ నాణ్యతలేని పనులు చేస్తున్నారని, అటు అధికారులకు, కాంట్రాక్టర్లకు యువత చురకలు అంటించారు. -
చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత హత్య
జయనగర: కర్ణాటకలోని చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత మహ్మద్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కేంద్రం బసవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌరీకాలువ ప్రాంతం లో జరిగింది. బీజేపీ చిక్కమగళూరు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహ్మద్ అన్వర్ (46) శుక్రవారం రాత్రి 9.35 గంటల సమయంలో తన ఇంటి వద్ద కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన్ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ హత్యతో చిక్కమగళూరులో శనివారం దుకాణాలు మూసి వేయడంతో బంద్ వాతావరణం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు అడ్డుగోడగా నిలిచినందునే అన్వర్‌ను పొట్టనబెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి మండిపడ్డారు. -
పంచెకట్టులో అలయాన్ని సందర్శించిన రాహుల్
-
పంచెకట్టులో రాహుల్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం చిక్‌మగలూర్‌లోని శృంగేరి శారదాంబ దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ పంచెను ధరించి పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు జరిపారు. శృంగేరీ మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను రాహుల్ కలవనున్నారు. అక్కడి వేదపాఠశాలలోని విద్యార్ధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటిస్తారు. అనంతరం చిక్మగలూర్ ప్రాంతంలో రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొంటారు. చిక్మగలూర్ దివంగత ప్రధాని, రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీ రాజకీయ పునరామగమనానికి కేంద్ర బిందువు కావడం గమనార్హం. కాగా రాహుల్ మంగళవారం దక్షిణ కర్ణాటకలో జనాశీర్వాదయాత్రలో పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా దేవాలయం, చర్చి, దర్గాలను సందర్శించారు. -
కర్ణాటకలో అమానుష ఘటనలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో చోటు చేసుకున్న రెండు అమానుష ఘటనలకు సంబంధించి వీడియో పుటేజీలను రాష్ట్ర పోలీసు శాఖ విడుదల చేసింది. బెంగళూర్‌లో 2017 డిసెంబర్ 31వ తేదీ రాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు నార్త్ ఇండియన్స్ పై కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు, ఓ యువతి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ముగ్గురు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. #WATCH One person arrested today in connection with a CCTV footage of 31st December 2017 in which a couple was thrashed by a group of people #Bengaluru pic.twitter.com/mNZCdWySLU — ANI (@ANI) 16 January 2018 వృద్ధుడిని ఈడ్చేసిన అధికారి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడిని కానిస్టేబుల్ ఒకరు ఈడ్చేసిన ఘటన విమర్శలకు తావునిచ్చింది. మంగళవారం చిక్ మంగళూర్‌లోని శృంగేరీ శారదాంబ ఆలయానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ దేవె గౌడ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. ఆ సమయంలో గుడిలోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో ఓ వృద్ధుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఓ కానిస్టేబుల్ అతడిని గమనించి అడ్డుకుని బయటకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శల వెల్లువెత్తగా.. ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. #WATCH A policeman drags an old man from Shringeri Sharadamba Temple gate in #Karnataka's Chikmagalur allegedly because he was trying to enter temple when HD Deve Gowda's family was inside; the policeman has been suspended (15.01.18) pic.twitter.com/BTbUVBWYTD — ANI (@ANI) 16 January 2018 -
ఈయనో మంచి ఎస్పీ!
సాక్షి, బెంగళూరు (చిక్‌మగళూరు): ఆయనో జిల్లాకు పోలీస్ బాస్.. కానీ చిమ్మ చీకట్లో, దట్టమైన అడవి మధ్య పర్యాటక బృందం వాహనానికి పంక్చర్ అయితే స్వయంగా మరమ్మతుకు యత్నించారు. కుదరకపోవడంతో వారిని డ్రాప్ చేశారు.. ఆ వ్యక్తి మరెవరో కాదు కర్ణాటకలో చిక్‌మగళూరు జిల్లా ఎస్పీ అణ్ణామలై. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన కొందరు పర్యాటకులు వారాంతంలో చిక్కమగళూరు పర్యటన ముగించుకుని శృంగేరి రహదారిలో ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో వారి వాహనానికి మత్తావర గ్రామ సమీపంలో పంచర్ కావడంతో నిలిచిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతం.. చిమ్మచీకటిగా ఉండడంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అదే సమయంలో కొప్ప గ్రామంలో తన పర్యటనను ముగించుకుని చిక్కమగళూరు వెళ్తున్న ఎస్పీ అణ్ణామలై వారి పరిస్థితిని గమనించి తన వాహనాన్ని నిలిపారు. తానే స్వయంగా స్పానర్ చేతబట్టి టైర్ మార్చేందుకు ప్రయత్నించారు. అయితే, చాలాసేపు ప్రయత్నించినప్పటికీ టైర్ మార్చేందుకు వీలుకాకపోవడంతో ఒక మెకానిక్‌కి ఫోన్‌చేసి కారును రిపేర్ చేయాల్సిందిగా కోరారు. అనంతరం పర్యాటకుల బృందాన్ని చిక్మగళూరులో విడిచి వెళ్లారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు.. మహిళ మృతి
బెంగుళూరు: కర్ణాటక ఆర్టీసీ బస్సులో మంగళవారం వేకువజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒక మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. చిక్‌మగళూరు నుంచి బెంగుళూరుకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు బస్సులో నుంచి బయటపడే సమయంలో ఓ మహిళకు మంటలంటుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు పూర్తిగా దగ్ధమైంది, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
సీఎం బుగ్గపై ముద్దుపెట్టిన మహిళ
బెంగళూరు: ఓ ప్రజా కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుగ్గలపై ఓ మహిళ బహిరంగంగా ముద్దుపెట్టింది. ఆదివారం బెంగళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగింది. సీఎం సిద్ధరామయ్య కురుబా కులానికి చెందినవారు కావడంతో ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్మగ్లూరు జిల్లా తారికెర్ తాలూకా పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్‌ను ఆయన సన్మానించారు. సన్మానం ముగిసిన వెంటనే ఆమె ఆయన కుడిబుగ్గపై ముద్దుపెట్టారు. దీంతో సిద్ధరామయ్య కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు. ఈ ఘటనపై ఆయన స్పందించేలోగా ఆమె వేదిక నుంచి దిగిపోయారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ 'సిద్ధరామయ్య నా తండ్రిలాంటివారు. ఆయనను నేను తొలిసారి కలిశాను. ఆ సంతోషంలో ఆయనకు ముద్దుపెట్టాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు' అని చెప్పారు. తనది సిద్ధరామయ్య నియోజకవర్గమేనని, తనకు పెళ్లి అయిందని ఆమె తెలిపారు.