బెంగుళూరు: కర్ణాటక ఆర్టీసీ బస్సులో మంగళవారం వేకువజామున ఒక‍్కసారిగా మంటలు చెలరేగి ఒక మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
చిక్‌మగళూరు నుంచి బెంగుళూరుకు వెళ్తున్న బస్సులో ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు బస్సులో నుంచి బయటపడే సమయంలో ఓ మహిళకు మంటలంటుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు పూర్తిగా దగ్ధమైంది, సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.
ఆర్టీసీ బస్సులో మంటలు.. మహిళ మృతి
Published Tue, Feb 21 2017 8:41 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement