కర్ణాటకలో అమానుష ఘటనలు | Police Drags an old man and Couple attack in Karnataka | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 2:16 PM | Last Updated on Tue, Jan 16 2018 2:16 PM

Police Drags an old man and Couple attack in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటకలో చోటు చేసుకున్న రెండు అమానుష ఘటనలకు సంబంధించి వీడియో పుటేజీలను రాష్ట్ర పోలీసు శాఖ విడుదల చేసింది. 

బెంగళూర్‌లో 2017 డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు నార్త్‌ ఇండియన్స్‌ పై కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు, ఓ యువతి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ముగ్గురు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వృద్ధుడిని ఈడ్చేసిన అధికారి
ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడిని కానిస్టేబుల్‌ ఒకరు ఈడ్చేసిన ఘటన విమర్శలకు తావునిచ్చింది. మంగళవారం చిక్‌ మంగళూర్‌లోని శృంగేరీ శారదాంబ ఆలయానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవె గౌడ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. ఆ సమయంలో గుడిలోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో ఓ వృద్ధుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఓ కానిస్టేబుల్‌ అతడిని గమనించి అడ్డుకుని బయటకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శల వెల్లువెత్తగా.. ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement