స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభానికి సన్నీ, దీపిక | Graphics Photos Viral in Social Media On Potholes Karnataka | Sakshi
Sakshi News home page

సమస్యను ఇలా సంధించారు !

Published Mon, Jul 23 2018 9:56 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Graphics Photos Viral in Social Media On Potholes Karnataka - Sakshi

గుంతలు పడిన రోడ్డుపై స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేసి సన్నీ లియోన్, దీపిక పదుకోనె ఫొటోలు ఉన్న దృశ్యం, ఈ గ్రాఫిక్స్‌ వైరల్‌గా మారాయి

ఓ సమస్యపై స్పందించడానికి యువత చేసిన వినూత్న ప్రయోగం అందరిని ఆకట్టుకునేలా చేసింది.

బొమ్మనహళ్లి: ఓ సమస్యపై స్పందించడానికి యువత చేసిన వినూత్న ప్రయోగం అందరిని ఆకట్టుకునేలా చేసింది. కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని మూడిగెరె తాలుకాలో ఉన్న కళస పట్టణానికి స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభించడానికి ప్రముఖ నటీనటులు సన్నీలియోన్, దీపికా పదుకోనె వస్తున్నట్లు అక్కడి సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌లలో ఫొటోల గ్రాఫిక్స్‌ వైరల్‌గా మారాయి. అయితే అది నిజం కాదు. ఇక్కడి ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం వేసిన రోడ్లు ఇటీవల వర్షాలకు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం కోసం ఇలాంటి ప్రయోగం చేపట్టారు. గుంతలు పడిన రోడ్డును ఫొటో తీసుకుని వాటి పక్కనే స్విమ్మింగ్‌పూల్‌ ప్రారంభానికి నటులు సన్నీలియోన్, దీపికా పడుకునె వస్తున్నారని వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. అంతేకాకుండా ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ కళస పట్టణానికి వచ్చి వినూత్నంగా నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఫొటోసైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజాధనం వృథా చేస్తూ నాణ్యతలేని పనులు చేస్తున్నారని, అటు అధికారులకు, కాంట్రాక్టర్లకు యువత చురకలు అంటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement