Potholes
-
యమపురికి దారి : యమధర్మరాజు లాంగ్ జంప్ పోటీ, వీడియో వైరల్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలను చూశాం. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఓ మోస్తరు వర్షానికి కూడా రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని ఇప్పటికే సామాన్య జనం సహా, అనేకమంది అసహనం వ్యక్తం చేశారు. ఇవి రహదారులు కాదు, యమపురికి దారులు, రోడ్లపై రక్షణ అనేదే లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు మండిపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు రోడ్లపై 5,670 గుంతలు ఉన్నాయని బీబీఎంపీ ఇటీవలి సర్వేలో తేలిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.తాజాగా బెంగళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకుద్దేశించిన నిరసన ఆసక్తికరంగా మారింది. కర్నాటకలోని ఉడిపిలో చనిపోయిన వారి కోసం యమరాజు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నాడు అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. ఇది నెటిజనులను ఆకట్టుకుంటోంది. యమధర్మరాజు , చిత్రగుప్తుడు రోడ్డు గుంతలను కొలుస్తున్న వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. గుంతలు, అధ్వాన్నమైన రహదారుల కారణంగా సామాన్యుడు గాయపడినా, చచ్చిపోయినా రాజకీయనాయకులు పట్టించుకోరంటూ నెటిజనులు విమర్శలు గుప్పించారు.Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024 -
జోషీమఠ్‌లో మరో విపత్తు.. స్థానికుల్లో ఆందోళన
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మరువకముందే మరో విపత్తు చోటుచేసుకుంది. తాజాగా జోషిమఠ్, బద్రీనాథ్ హైవే మధ్యలో అత్యంత లోతైన గొయ్యి ఏర్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ గొయ్యి మూడు అడుగుల వెడల్పు కలిగివుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతను పూడ్చారు. అయితే చాలాచోట్ల వాటంతట అవే ఇలాంటి గుంతలు ఏర్పడటం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్‌లో పలు చోట్ల భూమి కుంగిపోయింది.ఈ నేపధ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాలవారిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలోని ప్రాజెక్టులేనని నిపుణులు తెలిపారు. తరుచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్‌ను మునిగిపోతున్న ప్రాంతంగా ప్రకటించారు. -
Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
నాగోలు: అక్కడ రోడ్డు గుంతలమయంగా మారింది. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవం లేదు. ఇదే రూట్లో ఓ మహిళ రెండుసార్లు యాక్సిడెంట్‌కు గురైంది. అంతే.. ఆమెకు మండింది. బురద గుంతలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ఇంకేం.. అటుగా పోయేవాళ్లు స్మార్ట్ఫోన్లతో అదంతా ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆమె వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ పరిధిలోని న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేట్ ఉద్యోగి. అమె ఇద్దరు పిల్లలు బండ్లగూడ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రతి రోజూ ఆమె వారిని బైక్‌పై పాఠశాలకు తీసుకెళ్తుంది. నాగోలు బండ్లగూడ రేడియల్ రోడ్డు కొంతకాలంగా గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిహారిక కూడా గతంలో ఇదే రోడ్డుపై అదుపుతప్పి కింద పడింది. దీంతో రేడియల్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు సంబంధిత అధికారులకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విజ్ఞప్తి చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా గురువారం ఆమె స్యూటీపై నాగోలు వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడింది. స్వల్ప గాయాలు కావడంతో పిల్లలను ఇంటి వద్ద వదిలి ఘటనా స్థలానికి తిరిగి వచ్చి ఆమె రోడ్ల దుస్థితిపై ఏడాదిగా మేయర్, అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ బురదలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అమె నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపింది. నాగోలు కార్పొరేటర్ భర్త చింతల సురేందర్ యాదవ్, నాగోలు పోలీసులు అక్కడికి వచ్చి రోడ్ల మరమ్మతుకు నిధులు మంజారుయ్యాయని ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ముందుస్తుగా గుంతలను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో నిహారిక నిరసన విరమించింది. కోడ్ ముగియగానే పనులు చేపడతాం నాగోలు–ఆనంద్‌నగర్ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 4 కోట్లు నిధులు మంజురయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు చేపడతాం. :::డాక్టర్ తిప్పర్తి యాదయ్య, హయత్‌నగర్ సర్కిల్ డీసీ -
బాచుపల్లి: రోడ్డు గుంతలే నా బిడ్డను బలిగొన్నాయి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో ఈ ఉదయం జరిగిన విషాదంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఎనిమిదేళ్ల దీక్షిత మృతి చెందిందని పోలీసులు చెబుతుండగా.. రోడ్డు గుంత కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని దీక్షిత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘటనలో దీక్షిత తండ్రి కిషోర్‌కు సైతం గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించారు. అయితే.. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి స్థానిక ఆసుపత్రి వెంటనే డిశ్చార్జి అయ్యి బయటకు వచ్చాడు. ‘‘రోడ్లు నా కూతురును బలి తీసుకున్నాయి. నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడాయన. మరోవైపు బంధువులు తూర్పు గోదావరి జిల్లాలోని సొంతూరుకు దీక్షిత మృతదేహాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. బాచుపల్లిలో బైక్‌పై వెళ్తున్న సమయంలో.. గుంత కారణంగా బైక్‌పై నుంచి ఎగిరిపడి దీక్షిత కింద రోడ్డు మీద పడిపోయింది. ఆ సమయంలో వేగంగా ఓ స్కూల్‌కు చెందిన మినీ వ్యాన్ ఆమె పైనుంచి వెళ్లిందన్నది తండ్రి వాదన. అయితే.. మినీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించి డ్రైవర్‌ను డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్థానికంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది. -
రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
ముంబై: మహారాష్ట్ర పాల్ఘర్లో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై గుంతను తప్పించబోయిన ఓ కారు ముందున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఫంక్షన్‌కు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు వాగన్ఆర్. పాల్గర్లోని చరోతి సమీపంలో ఉన్న బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతులను నరోత్తమ్ ఛనా రాథోడ్(65), కేతన్ నరోత్మ రాథోడ్(35), ఏడాది బాలుడు ఆర్వి దీపేశ్ రాథోడ్‌గా గుర్తించారు. వీరంతా భిలాడ్‌లో ఓ శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గాయపడ్డ నలుగురిని వేదాంత ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వృద్ధ మహిళలే టార్గెట్.. హత్యలతో హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్ -
‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు అవసరమైన ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ క్యాప్ జెమినితో కలిసి తెలంగాణ ఇన్నోవేషన్ మిషన్(టీ ఎయిమ్) ‘మొబిలిటీ ఏఐ గ్రాండ్ చాలెంజ్’ను ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యక్ష, ఫైల్ వీడియోల ఆధారంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన మార్గాల్లో రోడ్లపైనున్న గుంతలను గుర్తించి తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించేలా పరిష్కారాన్ని ఈ చాలెంజ్‌లో ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఈ ఆవిష్కరణ ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపడతారు. చాలెంజ్ పట్ల ఆసక్తి ఉన్న ఆవిష్కర్తల నుంచి దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపికైన ఆవిష్కర్తలు నాలుగు వారాల్లోగా తమ ఆవిష్కరణలకు ఎలా కార్యరూపం ఇస్తారు, ఏ తరహా సాంకేతికను వినియోగిస్తారు, దాని ఫలితాలు ఎలా ఉంటాయనే అంశాలపై ఇచ్చే ప్రజెంటేషన్ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఎంపికైన విజేతకు జీహెచ్ఎంసీలో తమ పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు వీలుగా రూ.20 లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఈ చాలెంజ్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టీహాన్, ఐ హబ్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ భాగస్వాములుగా ఉంటాయి. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు మొబిలిటీ గ్రాండ్ చాలెంజ్ వంటి వేదికల ద్వారా ప్రభుత్వాలతో ఆవిష్కర్తల భాగస్వామ్యం మరింత పెరగాల్సి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వ్యాఖ్యానించారు. ఈ గ్రాండ్ చాలెంజ్ పట్ల ఆసక్తి ఉన్న ఆవిష్కర్తలు సెప్టెంబర్ 16లోగా https: //taim&gc.in/mobility వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులో మొబిలిటీ ఏఐ గ్రాండ్ చాలెంజ్ విజేతలను ప్రకటిస్తారు. చదవండి: టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి -
ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!
సాక్షి,ముంబై: చమక్కులు, ఫన్నీ వీడియోలు మాత్రమే కాదు ఇన్నోవేటివ్ ఐడియాలను, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా తన ఫోలోవర్స్‌తో పంచు కోవడంలో బిలియనీర్, బడా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎపుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ఒక అద్భుతమైన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. మన దేశంలోని రోడ్లు, గుంతలకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. అయితే దీనికి నెటిజన్ల లైక్స్‌తోపాటు, విమర్శలు, కౌంటర్లు ఎక్కువగానే ఉన్నాయి. I’d say this is an innovation that’s essential for India. Some building/construction material company needs to either emulate this or collaborate with this firm and get it out here pronto! pic.twitter.com/LkrAwIOP1x — anand mahindra (@anandmahindra) August 3, 2022 రోడ్డుపై ఉన్న గుంతలను ఆధునిక టెక్నాలజీ సాయంతో ‘పాచెస్’ ద్వారా పూడ్చివేస్తున్న ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇది ఇండియాకు అవసరమైన ఒక ఆవిష్కరణ కొన్ని బిల్డింగ్/కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు దీన్ని ఫాలో కావాలి. ఈ సంస్థతో సంప్రదించి వెంటనే చర్యలు ఇక్కడ కూడా చేపట్టాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ లైక్స్‌తో వైరల్ అవుతోంది. ( నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) అయితే కొంతమంది యూజర్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. ఇక్కడ సమస్య ఆవిష్కారం, టెక్నాలజీ కాదు సార్... దేశ ప్రధాని ప్రారంభించిన 5 రోజులకే ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతింది.. ముందు అలాంటి వాటిని పరిష్కరించాలి అని ఒకరు కామెంట్ చేశారు. ముందు కాంట్రాక్టర్లు ఫ్రొఫెషనల్‌గా రోడ్లు వేయడంలో కనీస అర్హతలు సంపాదించాలి. అలాగే రోడ్లు, నిర్మాణం, కాంట్రాక్టుల వ్యవహారంలో రాజకీయనాయకుల జోక్యం, అవినీతిపై మరొకరు తన ఆగ్రహాన్ని ప్రకటించారు. భారతదేశంలో రోడ్లను మించి, చాలాచోట్ల ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో గుంతలు ఉన్నాయి. అయినా మనం ఆశా జీవులం అంటూ ఇంకొకరు స్పందించారు. అంతేకాదు మన ఇండియాలో దీన్ని తీసుకొస్తే.. ఇక కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయడం మానేసి రోడ్లను ప్యాచ్‌లతో నింపేస్తారని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం. 😱 https://t.co/5SvJO0NhQz — anand mahindra (@anandmahindra) August 3, 2022 -
భర్తను పికప్ చేసుకోవడానికి వెళ్తూ.. గుంతను తప్పించబోయి..
చెన్నై: భర్తను పికప్ చేసుకోవడానికి బండి మీద వెళ్తూ.. దారిలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందింది ఓ మహిళ. తమిళనాడులోని కంచీపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరమేశ్వరి(37) తన భర్త అరుముగమ్‌ను తీసుకురావడానికి బండి మీద వెళ్తోంది. ఆ సమయంలో రోడ్డు మీద ఓ ట్రాక్టర్ అడ్డు ఉండడం, పైగా ఎదురుగా ఓ గుంత ఉండడంతో ఆమె తప్పించబోయింది. ఈ క్రమంలో పక్కన వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాని కిందపడి అక్కడికక్కడే ఆమె కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న శివకంచి పోలీసులు.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
రోడ్డుపై గుంత.. వైద్యురాలి మృతి
థానే : ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం ఓ వైద్యురాలి పాలిట శాపంగా మారింది. రోడ్డుపై ఉన్న గుంతలను అలాగే వదిలేయడం ఆమె మరణానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. కుడుస్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల నేహా షేక్ అనే వైద్యురాలికి.. వచ్చే నెలలో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి షాపింగ్‌కు కోసం ఆమె తన సోదరుడితో కలిసి స్కూటిపై భీవండికి షాపింగ్‌కు వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నేహా వెనకాల కూర్చోగా, ఆమె సోదరుడు స్కూటి డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్డుపై ఉన్న గుంత కారణంగా వారి బైక్ స్కిడ్ అయింది. దీంతో వెనకాల ఉన్న నేహా కిందపడిపోయారు. అదే సమయంలో పక్కన వస్తున్న ట్రక్ నేహాపై నుంచి వెళ్లడంతో.. ఆమె అక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రమజీవి యువ సంఘటన్ ఎన్జీవో సభ్యులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రోడ్లపై గుంతలు పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయని ఎన్జీవో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారని.. కానీ అసలు కేసు నమోదు చేయాల్సింది పీడబ్ల్యూడీ అధికారులపైన అని అన్నారు. అలాగే ఆ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో కొద్ది రోజుల్లో కూతురి పెళ్లి చేసి మురిసిపోదామనుకున్న నేహా కుటుంబంలో.. ఆమె మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
గతుకుల రోడ్లను చూసి కళ్లు తేలేసింది..
మీకు కార్లంటే విపరీతమైన అభిమానమా.. ఖరీదైన, హై ఎండ్ ఫీచర్లతో కూడిన కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకొండి అంటూ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో నవ్వులు పూయించడమే కాక.. మన రోడ్ల స్థితిగతులను కళ్లకు కడుతుంది. కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్లన్ని గుంతలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి చిన్న సైజు తటకాలను తలపిస్తున్నాయి. సామాన్యులు వినియోగించే ఆటో, లారీలు, టూవీలర్స్‌కు ఈ రోడ్ల మీద ప్రయాణం కొట్టిన పిండితో సమానం. కాబట్టి ఎలాంటి గుంతలనైనా లెక్క చేయక ముందుకు సాగిపోతుంటాయి. అదే ఈ గతుకుల రోడ్ల మీద ఓ లగ్జరీ కారు ప్రయాణం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. పాపం గంటకు వందల కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే.. రూ కోటి ఖరీదైన హై ఎండ్ చెవర్లెట్ కారు.. ఈ గతుకుల రోడ్లను చూసి కళ్లు తేలేసింది. గుంతలు లేని చోటు చూసుకుంటూ తాబేలు కంటే నెమ్మదిగా ముందుకు కదల సాగింది. దాని వెనకే వచ్చే ఆటోలు, కార్లు చల్తా హై అన్నట్లు దూసుకుపోతుంటే.. పాపం ఈ ఖరీదైన కారు మాత్రం ఎండ కన్నెరగని సుకుమారిలా.. నిదానంగా ప్రయాణించింది. Never get richer than the Government. pic.twitter.com/rpqoUKvjGl — Godman Chikna (@Madan_Chikna) September 4, 2019 గాడ్‌మ్యాన్ చింకా అనే ట్విటర్ యూజర్ ‘ఎప్పడు ప్రభుత్వం కంటే ధనవంతుల కాకుడదు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ఈ రోడ్లను చూశాక ట్రాక్టర్ కొనడం ఉత్తమం అనిపిస్తుంది’.. ‘దీని బదులు ఆటో కొని ఉంటే.. ఈ పాటికి ఓ రౌండ్ వేసి వచ్చేవాడవి కదా’.. ‘అందుకే మన దేశంలో తయారయ్యే కార్లనే కొనాలి. వాటికి ఇక్కడ రోడ్ల గురించి బాగా తెలుసు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ఆ రూటూ.. ఈ రూటూ.. కుదిపేట్టు!
మేడిపల్లి కమాన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వరకు 14.1 కి.మీ మార్గంలో 48 గుంతలు...ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి సీతాఫల్మండి, లిబర్టీ, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వరకు 18 కి.మీ మార్గంలో 60కి పైగా గుంతలు... నగరంలోని రహదారుల దుస్థితిని చెప్పేందుకు ఈ రెండు ఉదాహరణలు చాలవూ? వర్షం వచ్చిందంటే గ్రేటర్లో ప్రయాణం నరకంగా మారుతోంది. అడుగుకో గుంత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలకు రహదారులు ఛిద్రమై ఏ దారైనా కుదిపేస్తోంది. ఫలితంగావాహనదారుల ఒళ్లు హూనమవుతోంది.అంతేకాకుండా గంటలో చేరుకోవాల్సిన గమ్యానికి రెండు గంటలు పడుతోంది. అసలే మరమ్మతులకు నోచుకోని రోడ్లు... ఇక ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఆయా మార్గాల్లో ప్రయాణ పరిస్థితిపై ‘సాక్షి’ సోమవారం విజిట్ నిర్వహించగా... రహదారుల దుస్థితి కళ్లకు కట్టింది. – సాక్షి, నెట్వర్క్ బస్సు నడపాలంటేనే భయమేస్తోంది.. నగరంలో రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో బస్సు నడపడం ఇబ్బందిగా మారుతోంది.గోతులలో నుంచి వెళుతుండడంతో బస్సు కుదుపులకు గురవుతోంది. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గోతుల కారణంగా తరచూ గేర్లు మార్చుతుండడంతో మైలేజీ కూడా పడిపోతోంది.– షౌకత్ అలీ, ఆర్టీసీ బస్సు డ్రైవర్ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం. మళ్లీ వర్షం రాకపోతే నేటికి గుంతల పూడ్చివేత పూర్తవుతుంది. దెబ్బతిన్న స్ట్రెచ్ల పునరుద్ధరణ పనులు బుధవారం ప్రారంభిస్తాం. మెట్రో రైలు కారిడార్ మార్గంలో రూ.5 కోట్లతో హెచ్ఎంఆర్ రహదారుల పునరుద్ధరణ చేపడుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, హెచ్ఆర్డీసీఎల్ విభాగాల అధికారులతో కలిసి సోమవారం గాంధీ ఆస్పత్రి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు మరమ్మతు పనులను పరిశీలించాను. – మేయర్ బొంతు రామ్మోహన్ మన్సూరాబాద్: పనామా చౌరస్తా నుంచి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ వరకు సుమారు 12 కి.మీ దూరం. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు గుంతలమయంగా మారింది. గుంతలు ఇలా.. ♦ చింతలకుంట చెక్‌పోస్టు వద్ద.. ♦ ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు సమీపంలో.. ♦ మలక్‌పేట్ ఎస్ఎస్ గార్డెన్స్ వద్ద.. ♦ ఇమ్లీబన్ బస్‌స్టాండ్ సమీపంలో.. ♦ చాదర్‌ఘాట్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద.. నరక యాతన.. రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గోతులు ఉండటంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. వర్షాకాలం ముందస్తు చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారు. గోతులను పూడ్చటంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. – బి.కుమార్‌యాదవ్,టాటా ఏసీఈ గూడ్స్ ఆటో డ్రైవర్మేడిపల్లి – సికింద్రాబాద్ ఉప్పల్: మేడిపల్లి కమాన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు దాదాపు 48 చోట్ల గుంతలు ఉన్నాయి. ప్రధానంగా ఉప్పల్ రహదారిలోని వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదకర గుంతలు కనిపించాయి. మేడిపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు 14.1 కి.మీ. దూరం వెళ్లడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ ప్రస్తుతం గుంతల కారణంగా 1.10 గంటల సమయం పడుతోంది. గుంతలు ఇలా.. ♦ ఉప్పల్ డిపో ఎదురుగా ♦ ఫిర్జాదీగూడ కమాన్ మూలమలుపు వద్ద ♦ ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి ఎదుట ♦ ఉప్పల్ కమాన్ బస్టాండ్ వద్ద ♦ ఉప్పల్ ప్రధాన రహదారిపై ♦ ఉప్పల్ విద్యుత్ జంక్షన్ వద్ద ♦ మెట్టుగూడ పెట్రోల్ బంక్ వద్ద ♦ రైల్ నిలయం ♦ సికింద్రాబాద్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద లోతుకుంట – క్లాక్‌టవర్ అల్వాల్: లోతుకుంట లాల్‌బజార్ మధ్యలో రాజీవ్ రహదారి మిలిటరీ రోడ్డు కొన్ని చోట్ల ఛిద్రమైంది. రోడ్డుపై కంకరతేలి గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు ఇలా.. ♦ లాల్‌బజార్ చౌరస్తా వద్ద రహదారి ఛిద్రం.. ♦ తిరుమలగిరి సిగ్నల్ వద్ద ట్రాఫిక్‌జాం ♦ కార్ఖానా మలుపువద్ద మ్యాన్‌హోల్ కవర్ పాడైంది ♦ జూబ్లీ బస్టాండ్ చౌరస్తా వద్ద కొట్టుకుపోయిన తారు కొంపల్లి – ప్యారడైజ్ కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి కొంపల్లి నుంచి ప్యారడైజ్ వరకు, బేగంపేట నుంచి బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా మీదుగా జీడిమెట్ల బస్ డిపో వరకు పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు ఇలా.. ♦ కొంపల్లి బిగ్ బజారు ఎదురుగా రోడ్డు పక్కన ♦ బేగంపేట ఓల్డ్ ఎయిర్ పోర్టు సమీపంలోని బాలంరాయ్ చౌరస్తా వద్ద.. ♦ బాలానగర్ నుంచి ఫిరోజ్‌గూడకు వెళ్లేదారిలోని హోండా షోరూమ్, ముత్తూత్ ఫైనాన్స్, బాలానగర్ పోలీస్స్టేషన్ల సమీపంలో.. ♦ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా.. చాంద్రాయణగుట్ట – సీబీఎస్ చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట–సీబీఎస్ రూట్లో రహదారి గోతులమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, ఖిల్వత్, చౌమహల్లా ప్యాలెస్, మూసాబౌలి, సిటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు, అఫ్జల్‌గంజ్‌ల మీదుగా సీబీఎస్ వరకు పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు ఇలా.. ♦ ఫ్లై ఓవర్ సిగ్నల్ వద్ద ఏకంగా ఎనిమిది గుంతలు ♦ ఫ్లై ఓవర్ దిగువన సులబ్ కాంప్లెక్స్ సమీపంలో.. ♦ లాల్‌దర్వాజా మోడ్ వద్ద.. ♦ సిటీ కాలేజీ వద్ద భారీ ఉన్న గుంత ఏర్పడింది క్లాక్‌టవర్ – పంజగుట్ట రాంగోపాల్‌పేట్: సీటీవో చౌరస్తా, సికింద్రాబాద్ ఫైర్‌స్టేషన్ దాటగానే మెట్రో ఫుట్ఓవర్ కింద మ్యాన్‌హోల్ గుంత ప్రమాదకరంగా ఉంది. ప్రకాశ్‌నగర్ ప్లైఓవర్ పక్కన, మయూరీ మార్గ్, గ్రీన్‌ల్యాండ్ చౌరస్తాలో రోడ్డంతా కంకర తేలింది. సోమాజిగూడ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద గుంత ప్రమాదకరంగా ఉంది. సర్కిల్ దాటిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ వద్ద మరో గుంత ఉంది. పంజగుట్ట నుంచి ఎర్రగడ్డ వై జంక్షన్ వరకు 8 గుంతలు ఉన్నాయి. గుంతలు ఇలా.. ♦ పంజగుట్ట చౌరాస్తా, బిగ్‌బజార్ వద్ద 2 గుంతలు ♦ రాయలసీమ రుచులు, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్, భరత్‌నగర్ ఫ్లై ఓవర్‌పై రెండు చోట్ల.. ♦ ఎర్రగడ్డ వై జంక్షన్ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు 7 గుంతలు. ♦ ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్‌రోడ్ మీదుగా రసూల్‌పుర ఎన్టీఆర్ చౌరస్తా వరకు 9 గుంతలు ♦ పంజగుట్ట నుంచి క్లాక్‌టవర్ వరకు 6 గుంతలు ♦ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఫ్లై ఓవర్ రోడ్డు కంకర తేలి ఉంది చందానగర్ – హైటెక్‌సిటీ మాదాపూర్/భాగ్యనగర్ కాలనీ: చందానగర్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డుకిరువైపులా సుమారు 70 గుంతలు ఉన్నాయి. వర్షం నీరు ఉండటంతో గుంత ఎంతలోతు ఉందో తెలియక వాహనదారులు ఒక్కసారిగా వాహనాలను స్లో చేస్తున్నారు. దీంతో వెనక నుంచి వచ్చే వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. అలాగే నిజాంపేట రోడ్డు చౌరస్తా నుంచి నిజాంపేట గ్రామం వరకు రోడ్డుపై ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల గ్యాస్ పైపులైను పనుల కోసం నిజాంపేట రోడ్డులో కొంతమేర రోడ్డును తవ్వారు. దీంతో పనులు పూర్తయినా ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గుంతలు ఇలా.. ♦ కొండాపూర్ నుంచి శిల్పారామం వరకు గుంతమయం ♦ కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్ సమీపంలో 15 గుంతలు ♦ కృతుంగ, రేనాల్ట్ షో రూమ్ ప్రధాన రహదారిపై సుమారు 13 గుంతలు ♦ శిల్పా ఎన్క్లేవ్ – కొండాపూర్ చౌరస్తా వరకు 8.. ♦ కిమ్స్ అస్పత్రి నుంచి ఖానామెట్‌కు వెళ్లే రోడ్డుపై 4.. ♦ మాదాపూర్‌లోని సీఐఐ చౌరస్తా రోడ్డుపై దాదాపు 20.. ♦ అక్కడక్కడ చిన్నపాటి గుంతలు 10 వరకు ఉన్నాయి ♦ కొలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది గుంతలతో ఎన్ని తిప్పలో.. ఎన్ని ఫ్లైఓవర్లు వేసినప్పటికీ కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోతున్నాం. కొద్దిపాటి వర్షం పడిందంటే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. దీనికితోడు రోడ్లు గుంతలమయంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులు చేసినా అవి వెంటనే పాడైపోతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్తతో నాణ్యమైన రోడ్లను వేస్తూ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి. – కామేశ్వరరావు, ఐటీ ఉద్యోగి ఓయూ – క్లాక్‌టవర్ లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి సీతాఫల్మండి, చిలకలగూడ, గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కు, లిబర్టీ, ట్యాంక్ బండ్, రాణిగంజ్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు సుమారు 18 కి.మీ దూరం. వాహనాల రద్దీతో ప్రయాణ సమయం గంట 1– 45 గంటల సమయం పట్టింది. రానూపోనూ 36 కి.మీ పరిధిలో సుమారు 60కి పైగా గుంతలు ఉన్నాయి. చిలకలగూడ చౌరస్తాలో, ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మధ్యలో గుంతలతో ప్రయాణం ఆలస్యంగా సాగుతోంది. గుంతలు ఇలా.. ♦ చిలకలగూడ చౌరస్తా, ముషీరాబాద్‌నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వరకు ♦ సీతాఫల్మండి ప్లైఓవర్ ప్రవేశం వద్ద.. ♦ చిలకలగూడ రైల్వే కార్టర్స్ సమీపంలో.. ♦ చిలకలగూడ చౌరస్తాలో.. ♦ ముషీరాబాద్‌కు వెళ్లే మార్గంలో ఫెంతికోస్తల్ చర్చి వద్ద.. ♦ ముషీరాబాద్ చౌరస్తాలోని ఆర్టీసీ బస్సు స్టాప్ వద్ద.. ♦ ముషీరాబాద్‌లోని స్పెన్సర్స్ సమీపంలో. ♦ ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు మెట్రో స్టేషన్ సమీపంలో, బస్సుస్టాప్ వద్ద.. ♦ ట్యాంక్‌బండ్‌పై ఛిద్రమైన రోడ్డు.. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం
సాక్షి, సిటీబ్యూరో: వర్షపు నీటిని నేలగర్భంలోకి ఇంకించే ఇంకుడు గుంతలను నిర్లక్ష్యంచేస్తూ.. వాటి నిర్వహణ మరచిన సంస్థలకు జలమండలి తాజాగా నోటీసులు జారీచేస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పటికే ఇంకుడు గుంతలు ఉన్నచోట వాటిని బాగుచేసి...నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు నగరవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కాలనీసంక్షేమ సంఘాలు, పార్కులు, వాణిజ్య, నివాస భవనాల్లో ఇంకుడు గుంతల సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, వర్క్ఇన్స్పెక్టర్లు విధిగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నెల 18న అన్ని వర్గాల వారు ఇంకుడు గుంతల సామర్థ్యం పెంపొందించే దిశగా వాటికి తక్షణం నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని, వాటిపై ఉన్న సిల్ట్ ఇతర ఘన వ్యర్థాలను తొలగించాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఇంకుడు గుంతలు లేని వారు సైతం తక్షణం వాటిని ఏర్పాటుచేసుకోవాలని..లేనిపక్షంలో సదరు భవనాలకు నీటిసరఫరాను తగ్గిస్తామని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. భూగర్భ జలవిల... గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటుమహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈనేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. నీతి ఆయోగ్ హెచ్చరికలు.... బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది. గ్రేటర్లో భూగర్భ జలవిల ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్ పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు, కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి... సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. వర్షపునీటిలో 60 శాతం వృథా వరుణుడు కరుణించినా..వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జి పిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రేటర్లో 60 శాతం మేర వర్షపునీరు వృథాగా పోతుండడంతోనే ఈపరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథా అవడం సిటీజనుల పాలిట శాపంగా మారుతోంది. ఇంకుడు గుంతలతో ఎన్నో ఉపయోగాలు సాధారణ వర్షపాతం (20 మిల్లీ మీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని ఇంకుడు గుంత ద్వారా నేలగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడురోజుల అవసరాలకు సరిపోతాయి. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జల బ్యాంక్ ఏర్పాటుచేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు..మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం..జీవం అందజేసిన వారవుతారు. – ఎం.దానకిశోర్, బల్దియా కమిషనర్, జలమండలి ఎండీ -
డర్టీ రోడ్స్!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు రోడ్ల కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గుంతలతోకూడిన అధ్వానపు రోడ్లతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వారంలో కురిసిన ఒకటి రెండు చిరుజల్లులకే అనేక ప్రాంతాల్లో నీటినిల్వలు పేరుకుపోయి ప్రయాణం నరకప్రాయంగా మారింది. అక్కడ.. ఇక్కడ అన్న తేడా లేకుండా నగరంలోని అన్ని సర్కిళ్లలోనూ ఇదే దుస్థితి. రోడ్ల సమస్యలపై ప్రజలు ఎంతగా మొత్తుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేవు. వర్షాలొచ్చి రోడ్లు నీటమునిగి చెరువులుగా మారినప్పుడు హడావుడి ప్రకటనలు చేసే జీహెచ్ఎంసీ యంత్రాంగం..ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రోడ్లు పూర్తిగా దెబ్బతినకముందే తగిన మరమ్మతులు, రీకార్పెటింగ్ చేసేందుకు పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట ప్రభుత్వం గత జనవరి 31వ తేదీన రూ.721.86 కోట్లు మంజూరు చేస్తూ జీవో (నెంబర్ 88) జారీ చేసింది. టెండర్లు తదితరమైనవి పూర్తయి ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. ఆర్నెళ్లలో అంటే సెప్టెంబర్ నెలాఖరుకు పనులు పూర్తి కావాల్సి ఉండగా పూర్తికాలేదు. వాస్తవానికి జూలై– సెప్టెంబర్ల మధ్య వర్షాల వల్ల ఇబ్బందులుంటాయి. కానీ ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు కూడారాలేదు. పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. అయినప్పటికీ, ఇప్పటి వరకు దాదాపు 60 శాతం పనులే జరిగాయి. పనులు జరిగిన ప్రాంతాల్లోనూ అప్పుడే దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన ఒకటీ అరా చిరుజల్లులకే అనేక ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దాని వల్ల తాము తీవ్ర సమస్యలు పడుతున్నామంటూ పలువురు ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మరమ్మతుల కోసం రోడ్లు తవ్వి.. పూర్తిచేయకుండా వదిలేశారు. ’మై జీహెచ్ఎంసీ’ యాప్‌తోపాటు వెబ్సైట్, కాల్‌సెంటర్, డయల్ 100లతో పాటు ట్విట్టర్ ద్వారానూ ఫిర్యాదులు చేశారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రోడ్లు దెబ్బతిన్నాయని దాదాపు మూడువేల ఫిర్యాదులందాయంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఫిర్యాదులిలా.. వేటి ద్వారా ఎన్ని మై జీహెచ్ఎంసీ 2014 కాల్‌సెంటర్ 480 వెబ్సైట్ 160 ట్విట్టర్ 105 వీటితోపాటు సంబంధిత అధికారులకు స్వీయదరఖాస్తుల ద్వారానూ ప్రజావాణి తది తర వేదికల ద్వారానూ ఫిర్యాదులందజేశారు. మందకొడిగా.. పీపీఎం పనుల్లో భాగంగా దాదాపు 120 పనులకు కాంట్రాక్టులు పిలిచారు. వీటిల్లో బీటీ, సీసీ రోడ్లున్నాయి. మొత్తం పనుల్లో దాదాపు రూ. 32 కోట్ల విలువైన పది బీటీ రోడ్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా వాటిల్లో కొన్ని పురోగతిలో ఉన్నాయి. కొన్ని అసలు ప్రారంభమే కాలేదు. ఇప్పటి వరకు దాదాపు రూ. 200 కోట్ల మేర పనులు జరగ్గా, నిధులు అందక కొన్ని పనుల వేగం మందగించగా, కొన్ని పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ పనులకవసరమయ్యే నిధులు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది. అయితే అక్కడి నుంచి నిధులు రాకపోవడంతో జీహెచ్ఎంసీ చేతులెత్తేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ. 65 కోట్లు మాత్రమే అందాయి. పనుల పురోగతి ఇలా..బీటీ రోడ్లు.. మొత్తం పనులు :52 అంచనా వ్యయం : రూ. 254 కోట్లు పూర్తయిన పనులు : 10– వీటి విలువ రూ.33 కోట్లు పురోగతిలోని పనులు: 40– వీటి విలువ రూ.200 కోట్లు సీసీ రోడ్లు.. మొత్తం పనులు :56 అంచనా వ్యయం : రూ. 227 కోట్లు పురోగతిలోని పనులు: 50– వీటి విలువ రూ.195 కోట్లు. -
వెన్నుపూస కదిలిపోతోంది!
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు..కాలనీలను ముంచెత్తుతున్న వరదలు నగర రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. గుంతల రోడ్లలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. అరకిలోమీటరు ప్రయాణిస్తే చాలు 60 గుంతలపై గెంతాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా వాహనాలే కాదు ప్రయాణికుల ఒళ్లు హూనమవుతోంది. వెన్నుపూస కదిలిపోతోంది. నొప్పిని భరించలేక ఆస్పత్రులకు చేరుతున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. నిమ్స్ సహా ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోకి తొంగి చూసినా బ్యాక్‌పెయిన్, ఒంటి నొప్పి బాధితులే దర్శనమిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైల్ వర్క్స్...విద్యుత్ కేబుళ్లు..సివరేజ్ పైప్‌లైన్స్ కోసం తవ్విన గుంతలు ఇప్పటికే ప్రయాణికులను ఓ కుదుపు కుదుపుతుండగా, ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రహదారులనే కాదు నగరవాసుల ఒళ్లును కూడా గుల్ల చేస్తున్నాయి. వీవీఐపీలు తిరిగే బంజారాహిల్స్, బేగంపేట్, ఎన్టీఆర్మార్గ్, రాజ్‌భవన్‌రోడ్డు, అసెంబ్లీ, పంజగుట్టా, లక్టీకపూల్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి రహదారులపై కూడా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఎల్బీనగర్ నుంచి మొజంజాహీమార్కెట్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ చౌరస్తా రహదారులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. అడుగుకోగుంత కన్పిస్తుంది. తెలుగుతల్లి, పంజాగుట్టా, బేగంపేట్, ప్యారడైజ్, మెహిదీపట్నం ప్లైఓవర్లపై కూడా భారీ గుంతలు ఏర్పాడ్డాయి. మంగళ, బుధవారాల్లో వర్షం కురియకపోయినా గుంతల్లోని నీరు అలాగే నిల్వఉండటంతో తెలియక వేగంగా దూసుకొచ్చి ఒక్కసారిగా కుదుపునకు లోనవుతున్నారు. బైక్‌లు స్క్రిడై ప్రమాదాలు జరుగుతున్నాయి. దెబ్బలు తగిలి ఆస్పత్రుల్లో చేరుతుండగా, మరికొందరు స్పైన్, నెక్, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. గతంలో 70 ఉంటే..ప్రస్తుతం 150 కేసులు వాహనం నడిపే వారే కాదు..వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా వెన్ను, భుజం, తొడ, మెడ జాయింట్స్ పెయిన్స్ తప్పడం లేదు. బైక్ నడిపే వారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారు నడిపేవారు నడుము, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నిమ్స్ సహా అపోలో, యశోద, కేర్, కిమ్స్, సన్ షైన్ తదితర ఆస్పత్రుల్లోని ఆర్థోపెడిక్ విభాగాలకు చేరుతున్న బాధితుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగం సగటు ఓపీ 70 ఉండగా, ఇటీవల ఈ ఓపీ రోగుల సంఖ్య 150కి పెరిగింది. బాధితుల్లో 60 శాతం మండి ఒంటినొప్పులతో బాధపడుతుంటే, 15 శాతం మంది వెన్నుపూసలో డిస్కుల అరుగుదల వల్ల వచ్చే బ్యాక్పెయిన్తో బాధపడుతున్నారు. పది శాతం మంది నెక్పెయిన్తో బాధపతుంటే, ఐదు శాతం మంది బోన్ఫ్రాక్చర్తో బాధపడుతున్నట్లు సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణురాలు డాక్టర్ చిరంజీవి తెలిపారు. జాగ్రత్తలు తీసుకోవాలి : డాక్టర్ రామ్ కమల్, ఆర్థోపెడిషియన్, శ్రీకర ఆస్పత్రి గతంతో పోలిస్తే ఇటీవల ఆర్థోపెడిక్ సంబంధిత కేసులు పెరిగాయి. గుంతలు తేలిన రోడ్లపై గంటల తరబడి ప్రయాణించడం వల్ల వాహనాల కుదుపులకు ఒళ్లుగుల్ల అవుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కొంతమంది వృద్ధులు బోన్ఫ్రాక్చర్తో బాధపడుతున్నారు. వర్షాకాలనికి ముందు మా ఆస్పత్రికి రోజుకు సగటున 70మంది వస్తే..ప్రస్తుతం ఈ సంఖ్య 150కి చేరుకుంది. నిజానికి బైక్ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్ వంచకుండా నిటారుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కారులో సిట్టింగ్ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి. వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు అనించి కూర్చోవాలి. గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు వేగం తగ్గించాలి. లాంగ్ జర్నీ చేసేప్పుడు ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. -
ఇదేం పని?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు ట్విట్టర్ వేదికగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ఇదివరకే ఆదేశించారు. అయితే వీటిని వెనువెంటనే పరిష్కరించకపోతే మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తుందని భావించి చాలామంది జీహెచ్ఎంసీ అధికారులు.. సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ, అయినట్టు పేర్కొంటున్నారు. అలాంటి వ్యవహారం ఒకటి తాజాగా కేటీఆర్ దృష్టికి రావడంతో ‘ఇదేం పని..?’ అంటూ సంబంధిత అధికారిపై మండిపడ్డారు. ఉప్పర్‌పల్లి నలందనగర్ స్ట్రీట్ నెం.8లో రోడ్డుపై గుంతలు (పాట్‌హోల్స్) ఉన్నాయి. వీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాయి కౌశిక్ అనే పౌరుడు జీహెచ్ఎంసీ ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందిస్తూ సంబంధిత ఏఈ (వార్డు 61–రాజేంద్రనగర్) సమస్యను పరిష్కరించామని.. పనులు జరుగుతున్న ఫొటోలతో అతనికి రిప్లై ఇచ్చారు. మీ ఫిర్యాదుతో పాటు మరికొన్ని కూడా పూడ్చినట్లు కూడా అందులో పేర్కొన్నారు. రోడ్డుపై పాట్‌హోల్స్ పూడ్చేందుకు చేసిన సదరు పని మొత్తం పూర్తికాకముందే సమస్య పరిష్కారమైనట్లు పేర్కొనడాన్ని మంత్రి తప్పుబట్టారు. రోడ్డుపై తారును పూర్తిగా చదును చేయకపోవడాన్ని గుర్తించి, తారు కాంపాక్ట్ కాకుండానే నిలుస్తుందని ఎలా అనుకుంటున్నారు అంటూ తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సీఈలకు రీట్వీట్ చేశారు. అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ , ట్విట్టర్లో ఏఈ పోస్ట్ చేసిన చిత్రాలు.. -
ప్రయాణం.. నరకప్రాయం
గోపాలపురం : దేవరపల్లి–తల్లాడ రహదారి గోతులమయంగా మారింది. భారీ గోతులతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. హైదరాబాద్‌కు దగ్గర మార్గం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే ఈ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత తూట్లు పడింది. మోకాలు లోతులో గోతులు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒళ్లు హూనం అవుతోందని వాపోతున్నారు. మరోవైపు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని యజమానులు వాపోతున్నారు. ముఖ్యంగా గోపాలపురం నుంచి కొయ్యలగూడెం మధ్య రహదారి బాగా పాడైంది. గోపాలపురం వైఎస్సార్ జంక్షన్ వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కరిచర్లగూడెం సమీపంలోని ఓంకార్ ఫెర్టిలైజర్ వద్ద కూడా భారీగోతులు పడ్డాయి. గతంలో ఈ రోడ్డు రాష్ట్రీయ రహదారిగా ఉండేది. ఇటీవల జాతీయ రహదారిగా మార్చారు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు ఈ రోడ్డు నిర్వహణను పట్టించుకోవడం లేదు. అటు జాతీయ రహదారి అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. లారీలు గోతుల్లో పడి రిపేర్లు చేయడానికి రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. సంబంధిత అధికారులు, నిత్యం ప్రయాణించే ప్రజాప్రతి«నిధులకు రోడ్డుపై ఉన్న గోతులు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి సన్నీ, దీపిక
బొమ్మనహళ్లి: ఓ సమస్యపై స్పందించడానికి యువత చేసిన వినూత్న ప్రయోగం అందరిని ఆకట్టుకునేలా చేసింది. కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని మూడిగెరె తాలుకాలో ఉన్న కళస పట్టణానికి స్విమ్మింగ్ పూల్ ప్రారంభించడానికి ప్రముఖ నటీనటులు సన్నీలియోన్, దీపికా పదుకోనె వస్తున్నట్లు అక్కడి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లలో ఫొటోల గ్రాఫిక్స్ వైరల్‌గా మారాయి. అయితే అది నిజం కాదు. ఇక్కడి ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం వేసిన రోడ్లు ఇటీవల వర్షాలకు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం కోసం ఇలాంటి ప్రయోగం చేపట్టారు. గుంతలు పడిన రోడ్డును ఫొటో తీసుకుని వాటి పక్కనే స్విమ్మింగ్‌పూల్ ప్రారంభానికి నటులు సన్నీలియోన్, దీపికా పడుకునె వస్తున్నారని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతేకాకుండా ప్రముఖ తమిళ నటుడు విజయ్ కళస పట్టణానికి వచ్చి వినూత్నంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ వద్ద సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఫొటోసైతం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజాధనం వృథా చేస్తూ నాణ్యతలేని పనులు చేస్తున్నారని, అటు అధికారులకు, కాంట్రాక్టర్లకు యువత చురకలు అంటించారు. -
బస్సు కింద నలిగి మహిళ దుర్మరణం
-
ప్రాణం తీసిన రోడ్డు గుంత.. వైరల్
సీసీ టీవీ ఫుటేజీల్లో భయానక యాక్సిడెంట్ రికార్డయ్యింది. రోడ్డు గుంతలో బైక్ అదుపుతప్పి పడిపోగా, బస్సు కింద నలిగి ఓ మహిళ దుర్మరణం పాలైంది. ముంబైలో జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న ఓ షాపు సీసీ ఫుటేజీల్లో రికార్డుకాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాక్షి, ముంబై: థానే జిల్లా కళ్యాణ్‌లో ఓ స్కూల్లో పని చేస్తున్న మనీషా బోయిర్(40) తన బంధువు బైక్‌పై శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తోంది. శివాజీ చౌక్‌కు చేరుకోగానే బైక్ గుంతలో పడి అదుపుతప్పి ఆమె కింద పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రైవేట్ బస్సు పక్కనుంచి వెళ్తుండగా, వెనక టైర్ కింద ఆమె పడిపోవటం.. కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. సురక్షితంగా బయటపడ్డ ఆ వ్యక్తి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా.. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్షకాలంలో వేగంగా వెళ్లటం మంచిది కాదని వాహనదారులకు అధికారులు జాగ్రత్తలు సూచిస్తుండగా. మరోవైపు ఆదివారం స్థానికులే రోడ్డుపై గుంతలను పూడ్చటం విశేషం. -
సెల్ఫీతో నిరసన
సాక్షి, ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలే.. ట్విటర్ వేదికగా సెల్ఫీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ముంబైలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడ గుంతలు కనిపిస్తే అక్కడ ఆగి.. వాటితో ఒక సెల్ఫీ తీసుకుని ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. ముంబై వాసులే కాకుండా మొత్తం మహారాష్ట్ర వాసులంతా.. ఇలా రహదారులపై ఎక్కడ గోతులు కనిపించినా.. సెల్ఫీలు తీసుకుని ట్విటర్, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ముందుగా ఆమె.. ముంబైలోని ప్రధాన రహదారిపై కనిపించిన గోతులతో సెల్ఫీ తీసుకుని ఆమె ట్విటర్, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్‌లకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మహరాష్ట్ర వాసుల కూడా ఇదే విధంగా ట్విటర్లో ఫొటోల మీదఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులపై మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వేగంగా స్పందించింది. రహదారి గుంతలను వెంటనే పూడ్చివేస్తూ.. పీడబ్ల్యూడీ వారు కూడా ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. సుప్రియా సూలేపై అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజా సమస్యలపై ఆమె తీసుకుంటున్న చొరవను అభినందించారు. #Selfiewithpotholes at Katraj-Undri bypass & Bopdev ghat.@ChDadaPatil pic.twitter.com/IKUdOriSz5 — Supriya Sule (@supriya_sule) 1 November 2017 I want to thank every citizen and @supriya_sule tai for lending their support to #PotholeMuktMaha via Selfie with Potholes. (1/3) — Chandrakant Patil (@ChDadaPatil) 1 November 2017 -
ఊరూరా రాకాసి నోళ్లు!
వందల సంఖ్యలో బోరుబావుల గుంతలు - బోరు విఫలమైతే పూడ్చని యజమానులు, బోర్‌వెల్స్ నిర్వాహకులు - ఆడుకుంటూ గుంతల్లో పడి బలవుతున్న చిన్నారులు - అమలుకాని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం సాక్షి, హైదరాబాద్: ఊరూరా రాకాసి బోర్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను బలిగొంటూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ బోరుబావుల్లో చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నా.. ప్రభుత్వాలు, అధికారుల్లో అదే బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. బోరు యజమానులు, బోర్‌వెల్స్ నిర్వాహకుల నిర్లిప్తత చిన్నారులకు పెను గండంగా మారింది. బోర్ల తవ్వకం, గుంతల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం వంటివి ఏ మాత్రం అమలుకావడం లేదు. వేల సంఖ్యలో బోర్లు.. తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఏటా వేల సంఖ్యలో విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు జరుగుతున్నాయి. అందులో పెద్ద సంఖ్యలో బోర్లు నీళ్లు పడక విఫలమవుతు న్నాయి. ఇలా విఫలమైనవాటిని వెంటనే పూడ్చివేయకుండా.. భూయజమానులు, బోర్ వెల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదో బండరాళ్లు పెట్టడం, ఇసుక బస్తాలు కప్పి వదిలేయడం చేస్తున్నారు. కొద్దిరోజులకే ఇసుక బస్తాలు చిరిగిపోవడం, ఎవరైనా బండరాళ్లు పక్కకు జరపడంతో.. బోరు గుంతలు రాకాసి నోళ్లు తెరుచుకుంటున్నాయి. ఆడుకుంటూ వచ్చిన చిన్నారులు వాటిలో జారిపడు తున్నారు. గంటలు, రోజుల తరబడి మృత్యు వేదనను అనుభవిస్తున్నారు. ఎంతో శ్రమించి బోరుబావులకి సమాంతరంగా తవ్వకాలు జరిపినా చిన్నారులు ప్రాణాలతో బయటపడడం లేదు. బోరు గుంతలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు. విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు జరపకుండా వాల్టా చట్టంలో పేర్కొన్న నిబంధనలూ కాగితాలకే పరిమితమయ్యాయి. బతికి బయటపడడం కష్టమే! ► 2012 డిసెంబర్ 8న కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం పల్లెకుంటలో అజిత్ (5) అనే బాలుడు ఇంటిపక్కన ఉన్న పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. రెండు గంటల పాటు తవ్వకాలు జరిపినా.. బాలుడి మృతదేహమే లభించింది. ► 2014 అక్టోబర్ 10న రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలో గిరిజ (5) అనే బాలిక బోరుబావిలో పడి 45 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. మూడు రోజుల పాటు శ్రమించి సమాంతరంగా బావి తవ్వారు. బాలిక అప్పటికే మృతి చెందడంతో సగం మృతదేహాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు. ► 2015 మార్చి 8న నల్లగొండ జిల్లా పులిచెర్లలో బాలగోని నర్సింహగౌడ్ కుమారుడు శివ (3) తన తాతకు చెందిన పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. మూడు గంటల పాటు శ్రమించి గుంత తవ్వినా కాపాడలేకపోయారు. ► 2015 నవంబర్ 28న మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో రాకేశ్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడ్డాడు. 24 గంటల పాటు శ్రమించి గుంతను తవ్వినా.. అప్పటికే మృతి చెందాడు. ► 2016 డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా కావలి మండలం నందెమ్మపురంలో మౌనిక(2) తమ ఇంటి ముందు తవ్విన బోరుబావి లోనే పడిపోయింది. ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృత్యుంజయులు కొందరే! ► మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో నందిని అలియాస్ అంజలి (6) అనే బాలిక బోరుబావిలో పడినా ప్రాణాలతో బయటపడింది. నీరు పడలేదని బోరుబావిని పూడ్చేసినా దాదాపు 10 అడుగుల మేరకు వదిలేశారు. లోతు తక్కువగా ఉండడంతో బాలిక సురక్షితంగా బయట పడింది. రెండు గంటల పాటు తవ్వకాలు జరిపి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. ► మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం బింగదొడ్డి గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే ఏడాదిన్నర బాలుడు 2011 డిసెంబర్ 7న బోరుబావిలో పడిపోయాడు. బోరుబావికి సమాంతరంగా బావి తవ్వి 20 అడుగుల లోతు నుంచి తిరుమలేశ్ను సురక్షితంగా తీశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలివీ.. ► బోరు వేయడానికి 15 రోజుల ముందు భూ యజమాని సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలి. ► బోరు చుట్టూ కంచె లేదా తగిన రీతిలో రక్షణ ఏర్పాట్లు చేయాలి. ► బోరు రంధ్రం చుట్టూ అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు, భూమిలో 0.3 మీటర్ల లోతు, భూఉపరితలంపై 0.3 మీటర్ల ఎత్తు ఉండేలా సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మించాలి. ► బోరుపై భాగంలో ఇనుప ప్లేటు లేదా బలమైన మూత బిగించాలి. ► మరమ్మతుల కోసం బోరు మూత తీసినా వెంటనే బిగించాలి. ► నీళ్లు పడని బోర్లను మట్టి, ఇసుక, రాళ్లతో భూ ఉపరితలం వరకు పూర్తిగా పూడ్చివేయాలి ► బోరు నిరుపయోగంగా ఉన్నా, నీరు పడకున్నా, నిరుపయోగమని అనుకున్నా సంబంధిత అధికారులకు తెలియజేసి, ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ► ప్రభుత్వ, ప్రైవేటు బోరువెల్స్ యంత్రాల నిర్వహకులు విధిగా జిల్లా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. ► బోరు యజమాని, బోరు తవ్విన సంస్థ వివరాలు తెలుపుతూ బోరు బావి వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి. ► గ్రామాల వారీగా బోర్ల స్థితికి సంబంధించిన సమాచారం సేకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు సంబంధిత శాఖలు ఈ బాధ్యత నిర్వర్తించాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య ఇంజనీరింగ్ లేదా పురపాలక, భూగర్భ జల శాఖలు ఈ బాధ్యత తీసుకోవాలి. -
మీ రోడ్డు మీద గొయ్యి పడిందా?
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. ద్విచక్ర వాహనాలు గానీ, కార్లు, బస్సులు గానీ వేటిలో వెళ్లినా నడుం పడిపోతోంది. సర్కస్ ఫీట్లు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఎన్నిసార్లు రిపేర్లు చేసినా, ఒక్క వర్షానికే మళ్లీ గజం లోతు గుంతలు పడుతున్నాయి. మీరు ప్రతిరోజూ వెళ్లే రోడ్డులో కూడా ఇలాగే గుంతలు పడ్డాయా? అయితే.. వెంటనే మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. దాంతో గుంత దగ్గరే ఓ సెల్ఫీ తీసుకుని 'సాక్షి'కి పంపండి. నాణ్యత బాగున్న ఫొటోలను సాక్షి వెబ్సైట్లో ప్రచురించి, ఆ ప్రాంత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పంపాల్సింది ఇలా... మీ స్మార్ట్‌ఫోన్‌లో సాక్షి న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో పైన ఉండే 'సాక్షి' లోగో మీద ట్యాప్ చేస్తే మెనూలో మీకు 'ప్రత్యక్ష సాక్షి' అనే ఐకాన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లి, అక్కడే ఉన్న కెమెరా సింబల్ నుంచి ఫొటో తీసుకుని, మీ వివరాలతో పంపితే సరిపోతుంది. డిస్క్రిప్షన్లో #selfiewithpothole అని పెట్టడం మర్చిపోకండి. -
గుంతలు.. గతుకులే
సాక్షి, హైదరాబాద్: నీటమునిగిన బస్తీలు.. బురదమయంగా కాలనీలు.. గతుకులు పడి రాళ్లు తేలిన రహదారులు.. దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు.. బుధవారం నాటి కుంభవృష్టి నుంచి నగరం ఇంకా తేరుకోలేదని చెప్పడానికి సాక్ష్యాలివన్నీ. గురువారం సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో బుధవారం నాటి పరిస్థితే కనిపించింది. దీంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, మ్యాన్‌హోళ్లు దెబ్బతిన్నాయి. బీటీ రహదారులు బాగా దెబ్బతినగా.. ఇటీవలే వేసిన తారు రోడ్లు సైతం వర్షం దెబ్బకు నామరూపాలు లేకుండాపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రహదారులు కాస్తా.. వర్షానికి దారుణంగా దెబ్బతినడంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. నగరంలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల నష్టం దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇళ్లలోకి నీరుచేరి బియ్యం, ఆహార పదార్థాలు తడిసిపోయి పనికిరాకుండా పోయాయి. కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరం.. * మూసీ పరీవాహక ప్రాంతంలోని సంజయ్‌నగర్‌లో ఆరు ఇళ్లు నేలమట్టం కావడంతో అందరూ రోడ్డునపడ్డారు. * నల్లకుంట సత్యానగర్ బస్తీలో ఇళ్లలోకి నీరుచేరి నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. రెండు రోజులుగా తాగు నీరందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. * లోతట్టు ప్రాంతమైన బతుకమ్మ కుంట, గోల్నాక, ప్రేమనగర్‌తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాల్లోకి నీరు చేరింది. * కంటోన్మెంట్ ఐదో వార్డు ఏఓసీ గేటు మహేంద్రహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని ప్రధాన రోడ్డు, జూబ్లీ బస్టాండ్ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. * బండ్లగూడ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ని కల్వర్ట్ వద్ద వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. పల్లె చెరువు నుంచి వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే దీనికి కారణం. వరద తాకిడికి రోడ్డు గోతులమయమైంది. * కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్లు గుంతలమయమయ్యాయి. మోకాలు లోతు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. * గండిపేట కట్ట రెండు రోజులుగా చీకట్లో మగ్గుతోంది. దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ బుధవారం వర్షానికి కాలిపోవటంతో చెరువు కట్ట, లేక్ పోలీస్‌స్టేషన్ అంధకారంలో మునిగాయి. తగ్గని హుస్సేన్ సాగర్ ఉధృతి హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం తగ్గకపోవడంతో తూము ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతూనే ఉన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. గురువారం 513.42 మీటర్ల మేర నీరు ఉంది. దీంతో 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ లేక్స్ డివిజన్ ఎస్ఈ శేఖర్‌రెడ్డి తెలిపారు. -
కప్పకు ముద్దెట్టిన రాణి ఏం చెప్పిందో తెలుసా!
బెంగళూరు: నగరంలోని మైసూరుకు వెళ్లే బిజీ రోడ్డు మీద రాకుమారి కప్పను ముద్దు పెట్టుకుంది. ఓ రాకుమారి ఏంటి? కప్పను ముద్దు పెట్టుకోవడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?. బెంగళూరులో రోజురోజుకూ దీనంగా తయారవుతున్న రోడ్ల పరిస్థితిపై ఆర్టిస్ట్ బాదల్ నజుందస్వామి చేపట్టిన నిరసనే కప్పను ముద్దుపెట్టుకోవడం. నగరంలోని రోడ్డపై నిలిచిన నీటిలో ఉన్న కప్ప రాజును రాకుమారి ముద్దు పెట్టుకుంటున్నట్లు చిత్రమైన నిరసనను తెలిపారు. నగర రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయని రాత్రి సమయంలోనే కాకుండా పగటిపూట కూడా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని రాకుమారిగా నటించిన సోనా గౌడా తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారుల పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వాటి సంగతేంటని ప్రశ్నించారు. దాదాపు పదేళ్ల నుంచి ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నానని, రోజూ ఏదో ఒక యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతూనే ఉంటుందని ప్రయాణీకుడు ఒకరు తెలిపారు. గతంలో నగరంలో మ్యాన్ హోల్ సమస్యపై బాదల్ వేసిన రోడ్డుపై వేసిన ఆర్ట్ వల్ల సమస్య సమసిపోయింది. -
ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు!
కేసముద్రం: ఎండ తీవ్రతకు రైలు పట్టాలు మెత్తబడి ఆరుచోట్ల గుంతలు పడిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపం లో గురువారం చోటుచేసుకుంది. కేసముద్రం స్టేషన్ నుంచి డౌన్‌లైన్‌లో ఎండతీవ్రతకు ట్రాక్‌పై రెండు పట్టాలకు 1.90 సెంటీమీటర్ల దూరం చొప్పున ఆరుచోట్ల మెత్తబడి పట్టాకు ఉన్న ఇనుపపట్టీలు కరిగి లేచిపోయూరుు. మరికొన్ని చోట్ల మెత్తబడి గుంతలా మారి పట్టా వెడల్పు అరుుంది. 25 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గూడ్సు రైలు చక్రాలు ఆ పట్టాపై ఏర్పడిన లోతుభాగంలో(గుంతలుగా) ఇరుక్కుపోయి అక్కడే తిరుగుతూ ఉండిపోయాయి. డ్రైవర్ గమనించి స్థానిక రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత వచ్చిన రైళ్లను సిబ్బంది నెమ్మదిగా పట్టాలను దాటించారు.