Tamil Nadu: Woman Dies Hit By Truck While Avoid Pothole - Sakshi
Sakshi News home page

భర్తను పికప్‌ చేసుకోవడానికి వెళ్తూ.. రోడ్డు గుంతను తప్పించబోయి..

Published Tue, Jun 28 2022 8:32 AM | Last Updated on Tue, Jun 28 2022 9:33 AM

Tamil Nadu: Woman Dies Hit By Truck While Avoid Pothole - Sakshi

చెన్నై: భర్తను పికప్‌ చేసుకోవడానికి బండి మీద వెళ్తూ.. దారిలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందింది ఓ మహిళ. తమిళనాడులోని కంచీపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

పరమేశ్వరి(37) తన భర్త అరుముగమ్‌ను తీసుకురావడానికి బండి మీద వెళ్తోంది. ఆ సమయంలో రోడ్డు మీద ఓ ట్రాక్టర్‌ అడ్డు ఉండడం, పైగా ఎదురుగా ఓ గుంత ఉండడంతో ఆమె తప్పించబోయింది. ఈ క్రమంలో పక్కన వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాని కిందపడి అక్కడికక్కడే ఆమె కన్నుమూసింది.

కేసు నమోదు చేసుకున్న శివకంచి పోలీసులు.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement