ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మరువకముందే మరో విపత్తు చోటుచేసుకుంది. తాజాగా జోషిమఠ్, బద్రీనాథ్ హైవే మధ్యలో అత్యంత లోతైన గొయ్యి ఏర్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.
ఈ గొయ్యి మూడు అడుగుల వెడల్పు కలిగివుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతను పూడ్చారు. అయితే చాలాచోట్ల వాటంతట అవే ఇలాంటి గుంతలు ఏర్పడటం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్‌లో పలు చోట్ల భూమి కుంగిపోయింది.
ఈ నేపధ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాలవారిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలోని ప్రాజెక్టులేనని నిపుణులు తెలిపారు. తరుచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్‌ను మునిగిపోతున్న ప్రాంతంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment