sinking
-
జోషీమఠ్‌లో మరో విపత్తు.. స్థానికుల్లో ఆందోళన
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మరువకముందే మరో విపత్తు చోటుచేసుకుంది. తాజాగా జోషిమఠ్, బద్రీనాథ్ హైవే మధ్యలో అత్యంత లోతైన గొయ్యి ఏర్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ గొయ్యి మూడు అడుగుల వెడల్పు కలిగివుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతను పూడ్చారు. అయితే చాలాచోట్ల వాటంతట అవే ఇలాంటి గుంతలు ఏర్పడటం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్‌లో పలు చోట్ల భూమి కుంగిపోయింది.ఈ నేపధ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాలవారిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలోని ప్రాజెక్టులేనని నిపుణులు తెలిపారు. తరుచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్‌ను మునిగిపోతున్న ప్రాంతంగా ప్రకటించారు. -
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ రోజుకు రోజుకు కుంగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలను కూల్చివేసింది. అయితే జోషిమఠ్ నిర్వాసితులకు సాయం విషయంపై ఉత్తరాఖండ్ కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జోషిమఠ్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అద్దె సాయంగా రూ.5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 6 నెలల పాటు విద్యుత్ బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. నవంబర్ 2022 నుంచి ఇది వర్తిస్తుంది. ఇళ్లు ఖాళీ చేసి హోటళ్లు, రిసార్టుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న వారికి గదికి రూ.950 చొప్పున చెల్లించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.450 ఇవ్వనుంది. ఇస్రో ఫొటోలు.. జోషిమఠ్ గత 12 రోజుల్లోనే 5.4 సెంటిమీటర్లు కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఛాయాగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇక్కడి పరిస్థితిపై కేంద్ర హొంమంత్రి అమిష్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులకు సూచించారు. జోషిమఠ్‌లో ఇప్పటివరకు 169 కుటుంబాలకు చెందిన 589 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పగుళ్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన 42 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు తాత్కాలిక సాయంగా అందించింది. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
జోషిమఠ్ పగుళ్లు.. ఉత్తరాఖండ్ సీఎం కీలక ప్రకటన
డెహ్రాడూన్: బ్రదినాథ్ లాంటి పుణ్యక్షేత్రానికి ద్వారంగా పేరున్న ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. జోషిమఠ్ ప్రభావిత కుటుంబాలకు ఇవాళ(గురువారం) సాయంత్రంకల్లా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. జోషిమఠ్‌లో కేవలం 25 శాతం ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. జ్యోతిమఠ్ కుంగిపోతుండడంతో.. కేవలం నాలుగోవంతు ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలకు లక్షన్నర రూపాయల సాయాన్ని ఇవాళ సాయంత్రంకల్లా అందజేస్తాం. పూర్తి నివేదికలు అందిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నాం. అలాగే.. ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్య ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం ధామి ప్రకటించారు. అంతకు ముందు జోషిమఠ్‌లో స్వయంగా పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అధైర్యపడొద్దని చెబుతూ.. సురక్షిత ప్రాంతాల తరలింపునకు అధికారులను ఆదేశించారు కూడా. ఆ మరునాడే ఆయన కీలక ప్రకటన చేయడం గమనార్హం. జోషిమఠ్‌లో గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడు కావడంతోనే.. పరమ పవిత్ర ప్రాంతం కుంగుబాటుకు లోనవుతోంది. ఇళ్లకు, రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. జనాలు కొంతవరకు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఆరువందలకు పైగా ఇళ్లు, హోటళ్లలతో 20వేల మందికిపైగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదకారకంగా ఉన్న భవనాలను పడగొట్టి.. వాళ్లకు తక్షణం తాత్కాలిక సదుపాయాల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. చైనా సరిహద్దులో కీలకంగా భావించే ఆర్మీ బేస్‌కి కూడా పగుళ్లు వస్తున్నాయి. గ్లేసియర్లు కరగడం, కన్స్ట్రక్షన్ పనులు, కొండల తవ్వకం, భూభాగం కిందుగా నీటి ప్రవాహం.. తదితర కారణాలతో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చారు. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగిన పనుల వల్లే.. 2021లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మంది బలైయ్యారనే విమర్శ ఒకటి ఉంది. -
జోషిమఠ్ తరహాలో ఆ గ్రామంలోనూ పగుళ్లు.. ఆందోళనలో ప్రజలు
దెహ్రాదూన్: పౌరాణిక, చారిత్రక పర్యాటక ప్రదేశమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి నివాస గృహాలు బీటలువారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. జోషిమఠ్ నుంచి సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రమాదకరంగా మారిన భవనాలు, హోటళ్లను కూల్చేసేందుకు సిద్ధమైంది. అయితే, జోషిమఠ్ మాత్రమే కాదు మరో గ్రామంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలుబారడం గుర్తించడం కలకలం సృష్టిస్తోంది. అది కూడా జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణప్రయాగ్లోనే. జోషిమఠ్‌కు ఈ గ్రామం 80కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో ఉంటుంది. కర్ణప్రయాగ్లోని బహుగున నగర్లో సుమారు 50 ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో బిక్కు బిక్కు మంటు కాలం వెళ్లదిస్తూన్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సింతర్గాంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ సోమవారం మాట్లాడుతూ జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య ఉందని పేర్కొన్నారు. ‘జోషిమఠ్‌లో ప్రభావితమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. జోషిమఠ్ ప్రజల భద్రతకు భరోసా ఇస్తున్నాం. జోషిమఠ్ తరహాలోని పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమీప గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి వివరాలు వెల్లడిస్తారు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే. మరోవైపు.. జోషిమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇతర భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. హోటళ్లు మలారి ఇన్, మౌంట్ వ్యూకు భారీగా పగుళ్లు ఏర్పడిన క్రమంలో మంగళవారం సాయంత్రానికి వాటిని కూల్చేయనున్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ బిల్డింగ్ రీసర్ట్ ఇన్స్టిట్యూ(సీబీఆర్ఐ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ల పర్యవేక్షణలో కూల్చివేతలు సాగుతాయని తెలిపారు. #WATCH | Chamoli, Uttarakhand: Amid the issue of land subsidence in Joshimath, cracks also seen on some houses in Bahuguna Nagar of Karnaprayag Municipality. pic.twitter.com/hwRfFcwhJy — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023 ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్
Vivek Agnihotri Comments On Shahrukh And Salman Khan: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం 'ది ఢిల్లీ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అగ్నిహోత్రి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కింగ్స్, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీస్తూ ప్రజల పరిశ్రమగా మార్చాలి. అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది' అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి. అయితే ఈ ట్వీట్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ను పరోక్షంగా విమర్శించినట్లు తెలుస్తోంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022 కాగా కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సుమారు రెండేళ్లు సినీ ఇండస్ట్రీ నష్టాలు ఎదుర్కొంది. దీంతో ఓటీటీలు పుంజుకున్నాయి. ఈ క్రమంలేనే ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈ మార్పుతో హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను తిరస్కరించారు. అదే సమయంలో ఊరమాస్ స్టైల్లో వచ్చిన దక్షిణాది చిత్రాలను మాత్రం విపరీతంగా ఆదరించారు. ఇంకా చెప్పాలంటే హిందీ చిత్రాలకంటే దక్షిణాది డబ్బింగ్ మూవీస్ ఎక్కవ కలెక్షన్లు రాబట్టాయి. ఈ పరిణామంతో బాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు రాజుకున్నాయి. ఈ క్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీపై కూడా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది. డాలరుతో మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్ కిందికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్టం. అనంతరం మరింత దిగజారి ఏకంగా 81 పైసలు(1.1 శాతం) 75.08 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక కనిష్టం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్ కనిష్టాన్ని తాకింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 100ను సైతం అధిగమించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బుధవారం రూపాయి నామమాత్రంగా 2 పైసలు నీరసించి 74.26 వద్ద నిలవగా.. మంగళవారం సైతం ఇదే ధోరణిలో 74.28 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 277 పాయింట్ల లాబంతో, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ కనిష్టం నుంచి 2000, నిఫ్టీ 600, నిఫ్టీ బ్యాంకు 2100 పాయింట్లు పుంజుకోవడం విశేషం. -
టైటానిక్ అసలు కథ ఇదే..
అత్యంత విలాసవంతమైన భారీనౌక అది. ఎంతో మందిని తమతమ గమ్యస్థానాలనకు చేర్చేందుకు బయలుదేరింది. పడవలో... విందులు, వినోదాలు, కోలాహలంతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సరైన సమాచారం.. సరైన చోటుకి పంపినప్పటికీ అది చేరాల్సిన చోటుకి అందలేదు. ఇక అంతే ఒక్కసారిగా అల్లకల్లోలం రేగింది. ఎంతోమంది ప్రాణాలను మూటగట్టుకుని వెళ్లిపోయింది. అదేనండీ.. టైటానిక్ పడవ ప్రమాదం అని మీకిప్పటికే అర్థమైపోయిందనుకుంటా. టైటానిక్ పడవ తన మొదటి ప్రయాణంలోనే విషాదం చోటుచేసుకుంది. అ సంఘటన జరిగి గతవారమే 106 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మరిన్ని విషయాలను తెలుసుకుందాం...! 1912 ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత, సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు జాడలేడు. ఆకాశం నిర్మలంగా ఉంది. మంచు కొండల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న కెప్టెన్ స్మిత్ నౌకను దక్షిణం దిశగా మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు... టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు సైతం కంట్రోల్ రూమ్‌కి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం)లో ప్రయాణిస్తోంది. నౌక ముందు పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడెరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ పెద్ద మంచు పర్వతాన్ని గుర్తించారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపు మళ్లించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగిపోయి మళ్లీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. అయినప్పటికీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం నివారించలేకపోయారు. ఈ ఘటనలో నౌక కుడిభాగం వైపు 300 అడుగుల పొడవు మేర రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్ల(అతికించడానికి వేసే నట్లవంటి నిర్మాణాలు)ను పెకిలించింది. కంపార్ట్మెంటుల్లోకీ చేరిన నీరు నౌక ముందుభాగం దెబ్బతినడంతో మెల్లిగా పడవలోకి నీరు చేరడం మొదలైంది. నాలుగు కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలిఉంది. కానీ ఐదో కంపార్ట్మెంట్లోకి కూడా నీరుచేరడం ప్రారంభమైంది. క్రమక్రమంగా పడవలోని పైన ఉండే కంపార్ట్ మెంట్లలోనూ నీరు చేరడం మొదలైంది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్, ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని ఆదేశించారు. మొదటి లైఫ్ బోటు 12 మంది ప్రయాణికులతో కిందికి దించారు. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది, ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. ఇతర నౌకలకు సమాచారం అందించినా... వైర్లెస్ ఆపరేటర్లు జాక్ ఫిలిప్స్, హరాల్డ్ బ్రైడ్ ప్రమాద విషయాన్ని సమీప నౌకలకు చేరవేసాడు. ’’మౌంట్ టెంపుల్’’, ’’ఫ్రాంక్ఫర్ట్’’, టైటానిక్ సోదర నౌక ’’ఒలంపిక్’’ నౌకలకు సమాచారం అందింది. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. 58 మైళ్ల దూరంలో ఉన్న కునార్డ్ లైన్స్‌కి చెందిన కర్పతియా నౌక ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 2224 మంది నౌకలో ఉండగా 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనికారణంగా ఆ నౌక భారీగా అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది. విలాసవంతమైన నౌక టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం ఐర్లాండు లోని బెల్ఫాస్టు్క చెందిన హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1909లో అమెరికాకు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమై మార్చి 31, 1912కి పూర్తయింది. ఇది 269 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉండేది. ప్రయాణికులు నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3,547 మందిని మోయగలదు. నౌకలోనే ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, రెండు తరగతుల ప్రయాణికులకు గ్రంధాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది. నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. – సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
భూమిలోకి కుంగిపోతున్న బీజింగ్
బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్రపడిన చైనా రాజధాని బీజింగ్‌కు మరో ప్రమాదకరమైన పర్యావరణ ముప్పు పొంచి ఉంది. ఏడాదికి నాలుగు అంగుళాల చొప్పున ఈ నగరం భూమిలోకి కుంగిపోతోంది. పర్యావరణ పరిస్థితుల పట్ల ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలాగే కొనసాగినట్లయితే మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బీజింగ్ ఓ నాటికి భూగర్భంలో కలసిపోతుంది. ఎత్తైన భవనాల నిర్మాణాలకు పోటీ పడడం, భూగర్భ జలాలను అతిగా వినియోగించడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌లోని పలు ప్రాంతాలు ఏడాదికి నాలుగు అంగుళాలు అంటే, 11 సెంటీ మీటర్లు భూమిలోకి కుంగిపోతుండగా, నగరంలోని తూర్పు ప్రాంతం మాత్రం ఏడాదికి వంద సెంటీమీటర్ల వరకు కుంగిపోతోందని, గత 80 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని నిపుణులు అంచనా వేశారు. ఎత్తైన భవనాలను నిర్మించడం, భూగర్భ జలాలను ఇష్టానుసారం వాడడంతోపాటు భూపొరల మందం, మట్టి లక్షణాల కారణంగా తూర్పు ప్రాంతంలో కుంగడం ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. 2003 నుంచి 2010 మధ్య ఉపగ్రహాల ద్వారా సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా బీజింగ్‌లోని క్యాపిటల్ నార్మల్ యూనివర్శిటీ నిపుణులు ఈ విషయాలను కనుగొన్నారు. ఉత్తర చైనా మైదాన ప్రాంతానికి చివరలోవున్న బీజింగ్ నగరం భూపొరల్లో ఎల్లోనది ఉప నదుల ద్వారా వచ్చి చేరిన మేటలు ఉన్నాయి. ఇవి మెత్తగా ఉండడమే కాకుండా భూఅంతర్భాగంలో నీటి నిల్వలు అతి వేగంగా తరగిపోవడంతో భూమి ఎక్కువగా కుంగిపోతోందని నిపుణులు అధ్యయనంలో అంచనా వేశారు. -
నాటుపడవ మునిగి ముగ్గురు మృతి
బలిమెల రిజర్వాయర్ లో నాటుపడవ మునిగి ఇద్దరు బాలికలు సహా ముగ్గురు మరణించారు.విశాఖ జిల్లా ముంచంగి పుట్టు మండలం పట్నపగులుపుట్టు చెందిన వ్యక్తులు గురువారం ఒడిశాలో జరిగిన సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న పడవ బలిమెల రిజర్వాయర్ లో మునిగి పోయింది. పడవలో ప్రయాణిస్తున్న నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మృతి చెందిన వారిని పూజారి రాజేశ్వరి(8), మండి దేశాయి(10), టంజి రొబ్బి(25)గా గుర్తించారు.