దెహ్రాదూన్: పౌరాణిక, చారిత్రక పర్యాటక ప్రదేశమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి నివాస గృహాలు బీటలువారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. జోషిమఠ్ నుంచి సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రమాదకరంగా మారిన భవనాలు, హోటళ్లను కూల్చేసేందుకు సిద్ధమైంది. అయితే, జోషిమఠ్ మాత్రమే కాదు మరో గ్రామంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలుబారడం గుర్తించడం కలకలం సృష్టిస్తోంది. అది కూడా జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణప్రయాగ్‌లోనే.
జోషిమఠ్‌కు ఈ గ్రామం 80కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో ఉంటుంది. కర్ణప్రయాగ్‌లోని బహుగున నగర్‌లో సుమారు 50 ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో బిక్కు బిక్కు మంటు కాలం వెళ్లదిస్తూన్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
సింతర్గాంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ సోమవారం మాట్లాడుతూ జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య ఉందని పేర్కొన్నారు. ‘జోషిమఠ్‌లో ప్రభావితమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. జోషిమఠ్ ప్రజల భద్రతకు భరోసా ఇస్తున్నాం. జోషిమఠ్ తరహాలోని పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమీప గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి వివరాలు వెల్లడిస్తారు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే.
మరోవైపు.. జోషిమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇతర భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. హోటళ్లు మలారి ఇన్, మౌంట్ వ్యూకు భారీగా పగుళ్లు ఏర్పడిన క్రమంలో మంగళవారం సాయంత్రానికి వాటిని కూల్చేయనున్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ బిల్డింగ్ రీసర్ట్ ఇన్‌స్టిట్యూ(సీబీఆర్‌ఐ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్)ల పర్యవేక్షణలో కూల్చివేతలు సాగుతాయని తెలిపారు.
#WATCH | Chamoli, Uttarakhand: Amid the issue of land subsidence in Joshimath, cracks also seen on some houses in Bahuguna Nagar of Karnaprayag Municipality. pic.twitter.com/hwRfFcwhJy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023
ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?!
Comments
Please login to add a commentAdd a comment