Cracks
-
త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. -
అమెరికా భూమికి పగుళ్లు!
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది! అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు! పగుళ్లు ఎక్కడెక్కడ? ► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం. జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్ ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే... ► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి. ► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే! ► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి. ► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది. ► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భూగర్భ జలమే ముఖ్య ఆధారం మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే... ► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి. ► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం. ► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు. ఏం జరుగుతోంది? ► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది. ► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది. ► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు. ► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు. ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’ – జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే – సాక్షి, నేషనల్ డెస్క్ -
హఠాత్తుగా పెళపెళమంటూ రోడ్డు బద్ధలై ఒక్కసారిగా..
ఏమైందో ఏమో ఉన్నటుండి ఒక్కసారిగా రహదారి బద్ధలై నీళ్లు ఫౌంటైన్ మాదిరి వెదజిమ్ముతూ బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉండే వారెవరికీ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇదేమైన మరో ప్రకృతి విపత్తా? అన్నట్లుగా జరిగిందా ఆ ఘటన. సరిగ్గా అదే సమయంలో స్కూటీపై పింక్ కలర్ దుస్తులతో ఒక అమ్మాయి వెళ్తోంది. ఈ హఠాత్పరిణామనికి వెదజిమ్ముతున్న నీటి కారణంగా కిందపడిపోవడమే గాక ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకుపోయింది. అంత ఘోరంగా నీళ్లు పైకి ఎగదన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శనివారం రోడ్డు మధ్యలో చోటు చేసుకుంది. ఐతే చుట్టుపక్కల స్థానికులు ఆమెను రక్షించినట్లు సమాచారం. భూగర్భ పైప్ లైన్ పగిలిపోవడంతో నీటి ప్రవాహానికి రోడ్డు పెళపెళమంటూ.. విరిగిపోతూ నీళ్లు బయటకు ఉబికివచ్చేశాయి. దీంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి, ఆ రహదారి మొత్తం నీళ్లతో నిండిపోయి, కంకరాళ్లతో చెల్లచెదురుగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. #WATCH | Road cracked open after an underground pipeline burst in Yavatmal, Maharashtra earlier today. The incident was captured on CCTV. A woman riding on scooty was injured. pic.twitter.com/8tl86xgFhc — ANI (@ANI) March 4, 2023 (చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!) -
జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జోషిమఠ్ వంటి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ధాత్రి పట్టణంలోని నాయి బస్తీలో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా బస్తీలోని 20కి పైగా ఇళ్లతోపాటు ఓ మసీదుకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు భూమి కుంగిపోవడంపై స్పందించిన జిల్లా అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తునట్లు వెల్లడించారు. భవంతులకు పగుళ్లు ఏర్పడటంపై గల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల బృందాన్ని సదరు గ్రామాలకు పంపినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు. కాగా ధాత్రి మున్సిపల్ పరిధిలోని నాయి బస్తీ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి. అయితే భూమి కుంగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ధాత్రి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ తెలిపారు. దోడా జిల్లాలో డిసెంబర్లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చాయని.. ఇప్పటి వరకు 20 భవనాలకు బీటల వారగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. దీని కారణంగా బస్తీ ప్రాంతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. అయితే స్థానికంగా రోడ్ల నిర్మాణం, చుట్టుపక్కలా ప్రాంతాల్లో నది నీరు ప్రవహించడం వంటి అనేక కారణాలు కొండ పక్కనే ఉన్న గ్రామంలో భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా భూమి కుంగిపోవడంతో ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది జవవరి 8 మధ్య 12 రోజుల్లో సుమారు 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగింది. ఇస్రో శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌లో నివసిస్తున్న169 కుటుంబాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అలాగే ఎక్కువగా పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, భవనాలను కూల్చివేస్తున్నారు. చదవండి: విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ -
12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ రోజుకు రోజుకు కుంగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలను కూల్చివేసింది. అయితే జోషిమఠ్ నిర్వాసితులకు సాయం విషయంపై ఉత్తరాఖండ్ కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జోషిమఠ్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అద్దె సాయంగా రూ.5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 6 నెలల పాటు విద్యుత్ బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. నవంబర్ 2022 నుంచి ఇది వర్తిస్తుంది. ఇళ్లు ఖాళీ చేసి హోటళ్లు, రిసార్టుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న వారికి గదికి రూ.950 చొప్పున చెల్లించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.450 ఇవ్వనుంది. ఇస్రో ఫొటోలు.. జోషిమఠ్ గత 12 రోజుల్లోనే 5.4 సెంటిమీటర్లు కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఛాయాగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇక్కడి పరిస్థితిపై కేంద్ర హొంమంత్రి అమిష్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులకు సూచించారు. జోషిమఠ్‌లో ఇప్పటివరకు 169 కుటుంబాలకు చెందిన 589 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పగుళ్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన 42 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు తాత్కాలిక సాయంగా అందించింది. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
జోషిమఠ్ పగుళ్లు.. ఉత్తరాఖండ్ సీఎం కీలక ప్రకటన
డెహ్రాడూన్: బ్రదినాథ్ లాంటి పుణ్యక్షేత్రానికి ద్వారంగా పేరున్న ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. జోషిమఠ్ ప్రభావిత కుటుంబాలకు ఇవాళ(గురువారం) సాయంత్రంకల్లా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. జోషిమఠ్‌లో కేవలం 25 శాతం ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. జ్యోతిమఠ్ కుంగిపోతుండడంతో.. కేవలం నాలుగోవంతు ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలకు లక్షన్నర రూపాయల సాయాన్ని ఇవాళ సాయంత్రంకల్లా అందజేస్తాం. పూర్తి నివేదికలు అందిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నాం. అలాగే.. ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్య ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం ధామి ప్రకటించారు. అంతకు ముందు జోషిమఠ్‌లో స్వయంగా పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అధైర్యపడొద్దని చెబుతూ.. సురక్షిత ప్రాంతాల తరలింపునకు అధికారులను ఆదేశించారు కూడా. ఆ మరునాడే ఆయన కీలక ప్రకటన చేయడం గమనార్హం. జోషిమఠ్‌లో గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడు కావడంతోనే.. పరమ పవిత్ర ప్రాంతం కుంగుబాటుకు లోనవుతోంది. ఇళ్లకు, రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. జనాలు కొంతవరకు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఆరువందలకు పైగా ఇళ్లు, హోటళ్లలతో 20వేల మందికిపైగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదకారకంగా ఉన్న భవనాలను పడగొట్టి.. వాళ్లకు తక్షణం తాత్కాలిక సదుపాయాల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. చైనా సరిహద్దులో కీలకంగా భావించే ఆర్మీ బేస్‌కి కూడా పగుళ్లు వస్తున్నాయి. గ్లేసియర్లు కరగడం, కన్స్ట్రక్షన్ పనులు, కొండల తవ్వకం, భూభాగం కిందుగా నీటి ప్రవాహం.. తదితర కారణాలతో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చారు. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగిన పనుల వల్లే.. 2021లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మంది బలైయ్యారనే విమర్శ ఒకటి ఉంది. -
జోషిమఠ్ తరహాలో ఆ గ్రామంలోనూ పగుళ్లు.. ఆందోళనలో ప్రజలు
దెహ్రాదూన్: పౌరాణిక, చారిత్రక పర్యాటక ప్రదేశమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి నివాస గృహాలు బీటలువారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. జోషిమఠ్ నుంచి సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రమాదకరంగా మారిన భవనాలు, హోటళ్లను కూల్చేసేందుకు సిద్ధమైంది. అయితే, జోషిమఠ్ మాత్రమే కాదు మరో గ్రామంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలుబారడం గుర్తించడం కలకలం సృష్టిస్తోంది. అది కూడా జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణప్రయాగ్లోనే. జోషిమఠ్‌కు ఈ గ్రామం 80కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో ఉంటుంది. కర్ణప్రయాగ్లోని బహుగున నగర్లో సుమారు 50 ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో బిక్కు బిక్కు మంటు కాలం వెళ్లదిస్తూన్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సింతర్గాంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ సోమవారం మాట్లాడుతూ జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య ఉందని పేర్కొన్నారు. ‘జోషిమఠ్‌లో ప్రభావితమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. జోషిమఠ్ ప్రజల భద్రతకు భరోసా ఇస్తున్నాం. జోషిమఠ్ తరహాలోని పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమీప గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి వివరాలు వెల్లడిస్తారు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే. మరోవైపు.. జోషిమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇతర భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. హోటళ్లు మలారి ఇన్, మౌంట్ వ్యూకు భారీగా పగుళ్లు ఏర్పడిన క్రమంలో మంగళవారం సాయంత్రానికి వాటిని కూల్చేయనున్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ బిల్డింగ్ రీసర్ట్ ఇన్స్టిట్యూ(సీబీఆర్ఐ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ల పర్యవేక్షణలో కూల్చివేతలు సాగుతాయని తెలిపారు. #WATCH | Chamoli, Uttarakhand: Amid the issue of land subsidence in Joshimath, cracks also seen on some houses in Bahuguna Nagar of Karnaprayag Municipality. pic.twitter.com/hwRfFcwhJy — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023 ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు.. వణికిపోతున్న ప్రజలు
సాక్షి, తిరుపతి: ఎంఆర్ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. నిన్న ఈ ప్రాంతంలోనే ఇంటి వెనుక నీటి సంపు ఒరలు పైకి లేవడం.. దీనికి తోడు రాత్రి నుంచి ఇళ్లు బీటలు తీయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని.. కాగా, తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లి లోని శ్రీకృష్ణా నగర్లో ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్ ట్యాంక్‌ని శుభ్రం చేస్తుండగా అది భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణానగర్‌లోని ఘటనను ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్స్ బృందం పరిశీలించింది. అనంతరం దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. అయితే దీని వల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు. -
సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు..
పట్నా(బిహార్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లా నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ బొసక్ తన మూడో ప్రయత్నంలో 45వ ర్యాంక్ సాధించారు. ఆయన ఢిల్లీ ఐఐటీ 2018 బ్యాచ్ విద్యార్థి. అనిల్ తండ్రి వినోద్ సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ దుస్తులు అమ్ముతుంటారు. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఫలితాల్లో అనిల్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడంతో ఆ కుటుంబం పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. తండ్రి వినోద్ కుమారుడి సక్సెస్‌పై స్పందిస్తూ.. ‘ఐఐటీకి అనిల్ ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డాం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అతని టీచర్ చాలా సాయం చేశారు. కష్టసాధ్యమైన యూపీఎస్సీకి అనిల్ బోసక్ ఎంపిక కావడం కలగా ఉంది. ఐఐటీ తర్వాత అనిల్ ఉద్యోగంలో చేరతాడని అనుకున్నాను. తను.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పాడు. మా అబ్బాయికి ఉపాధ్యాయులు కూడా ఎంతో చేయుతనందించారు. తొలుత కష్టతరమని భావించిన అనిల్ పడుతున్న కష్టం చూసి నా వంతుగా నేను కూడా.. సహాకారం అందించాను. ఇప్పుడు నా కొడుకు విజయంచూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది యూపీఎస్సీ పరీక్షలో 616 ర్యాంకు సాధించిన అనిల్ ఈసారి మరింత కష్టపడి 45వ ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడని వినోద్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి -
చార్మినార్‌కు స్కానింగ్
సాక్షి, హైదరాబాద్: చారిత్రక చార్మినార్‌కు భారీగా సూక్ష్మపగుళ్లు.. పై‘పెచ్చు’నిర్లక్ష్యం.. వెరసి కాలుష్యం బారి నుంచి ఆ కట్టడానికి రక్షణ కరువైంది. నాలుగు రోజులక్రితం మక్కా మసీదు వైపు ఉన్న మినార్ నుంచి పెద్ద పెచ్చు ఊడి పడేందుకు భారీగా ఏర్పడ్డ సూక్ష్మపగుళ్లే కారణమని నిపుణులు నిర్ధారించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు సూక్ష్మపగుళ్ల నుంచి నీళ్లు లోనికి చేరి ఆ భాగం ఒక్కసారిగా బరువెక్కి కట్టడం నుంచి ఊడిపోయిందని ప్రాథమికంగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం(ఏఎస్ఐ) నిపుణులు గుర్తించారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం మొదలవుతున్నందున, కట్టడం మిగతా ప్రాంతాల్లో పగుళ్లుంటే వాననీళ్లు లోనికి చేరి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆ పగుళ్ల తీవ్రతను గుర్తించేందుకు చార్మినార్‌ను ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీ పరికరంతో అణువణువూ స్కాన్ చేయాలని ఏఎస్ఐ నిర్ణయించింది. తొలిసారి టాప్ టూ బాటమ్ స్కాన్ చేసి చార్మినార్‌పై ఉన్న పగుళ్లను గుర్తించి వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు. థెర్మోగ్రఫీతో పగుళ్ల జాడలు... ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల వయసున్న కట్టడాలకు థెర్మోగ్రఫీ యంత్రంతో స్కాన్ చేసి ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి ధ్వంసం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. మనదేశంలో కేవలం తాజ్‌మహల్ లాంటి కొన్ని కట్టడాలకే దాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు చార్మినార్‌ను దానితో స్కాన్ చేయలేదు. వాతావరణ ప్రభావంతో పెద్ద పెచ్చులూడి కిందపడ్డ నేపథ్యంలో ఇక అలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయని, ఇది క్రమంగా కట్టడం ప్రధాన నిర్మాణానికి కూడా ప్రమాదకరంగా మారుతుందని అధికారులంటున్నారు. పెచ్చు ఊడిపడ్డ తర్వాత ఏఎస్ఐ జాయింట్ డైరక్టర్ (కన్జర్వేషన్) జాన్‌విజ్ శర్మ వచ్చి కట్టడాన్ని పరిశీలించారు. పెచ్చు ఊడిపడ్డ ప్రాంతంలో కెమెరాతో ఫొటోలు తీసి పరిశీలించారు. మినార్‌పై గోటితో గట్టిగా గిల్లితే సున్నం ఊడొస్తుందని గుర్తించారు. అదే దిగువ భాగంగా గోటితో ఎంత గట్టిగా గిల్లినా సున్నం రాలటం లేదు. దీంతో పైభాగానికి వెంటనే ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన తేల్చి మొత్తం కట్టడాన్ని ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీతో స్కాన్ చేయాలని సిఫారసు చేశారు. ఆ పరికరాన్ని ఢిల్లీ నుంచి తెప్పించి వానాకాలం వచ్చే లోపు స్కాన్ చేసి అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు. పైభాగం ప్రమాదకరం... చార్మినార్ ప్రధాన కట్టడం రాతితో నిర్మించారు. దానిపై 40 సెంటీమీటర్ల మందంతో డంగు సున్నం, కరక్కాయ, రాతిపొడి, నల్లబెల్లం, గుడ్డు సొన తదితర పదార్థాల మిశ్రమంతో పూతపూసి నగిషీలద్దారు. దీనిపై మళ్లీ ప్రత్యేక పూత ఉంటుంది. అది నీటిని పీల్చకుండా కోట్ లాగా ఉపయోగపడుతుంది. చార్మినార్ చుట్టూ కొన్ని దశాబ్దాలుగా వాహనాలు అతి చేరువగా తిరుగుతూ ఆ ప్రాంతంలో విపరీతమైన కలుషితాలను నింపేశాయి. దీంతోపాటు వాతావరణంలో పేరుకుపోయిన ధూళి కణాలు కట్టడంపై తేమతో కలిసి క్రమంగా సన్నటి పొరలాగా పేరుకున్నాయి. వాటి వల్లే కట్టడం పైభాగం లేత గోధుమరంగులోకి మారింది. ఇది కట్టడానికి రక్షణగా ఉన్న పైపూతను క్రమంగా ధ్వంసం చేస్తూ వచ్చింది. వాతావరణానికి ఎక్కువగా ప్రభావితమయ్యే చార్మినార్ పైభాగంలో ఈ నష్టం ఎక్కువగా ఉందని తాజాగా గుర్తించారు. వాహనాలు, సమీపంలో భారీ యంత్రాలతో పని తదితరాల వల్ల వచ్చిన తరంగాలు అక్కడ పగుళ్లకు కారణమయ్యాయని ప్రాథమికంగా తేల్చారు. పైపూత తొలగి సన్నటి పగుళ్లేర్పడటంతో తేమను అతి సులభంగా డంగు సున్నం పీల్చుకుంది. వాన నీటిని ఎక్కువగా పీల్చుకుని ఆ భాగం రెండింతల బరువెక్కింది. మినార్లకు భారీ నగిషీలు కనిపిస్తాయి. ఆ భాగంలో సున్నం బరువెక్కి కట్టడం నుంచి విడిపోయి తాజాగా కిందపడిందని గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రమాదం ఇంకా ఎక్కడెక్కడ పొంచి ఉందనే విషయాన్ని వెంటనే గుర్తించాల్సి ఉంది. వర్షాకాలం ముగిసేవరకు చార్మినార్ చేరువలో భారీ యంత్రాలతో పనులు చేయించకుండా చూడాలని అధికారులు నిర్ణయించి విషయాన్ని జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. -
పోలవరంలో భూమికి బీటలు
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భూమి బీటలు వారి కుంగిపోవడంతో ప్రజలు, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. 902 హిల్ వ్యూ ప్రాంతంలో త్రివేణి ఏజెన్సీకి చెందిన మెకానికల్ షెడ్ ప్రాంతంలో శనివారం ఒక్కసారిగా భూమి బీటలువారి పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడటంతో ఆందోళన చెందారు. మెకానికల్ షెడ్‌లోనూ భారీగా పగుళ్లు తీయడంతో యంత్రాలు, వాహనాలు, సామగ్రిని హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించారు. రెండవ విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులు రాకపోకలు సాగించేందుకు.. ప్రాజెక్ట్ మార్గానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మార్గం సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భూకంపం మాదిరిగా ఇక్కడ భూమి బీటలు వారి పగుళ్లు తీసి కుంగిపోవడం ఆరు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఘటనతో పోలవరం ప్రాంత వాసుల్లో భయం మరింత పెరిగింది. 2018 నవంబర్ 4వ తేదీన ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి 100 మీటర్ల పొడవునా, 6 మీటర్ల ఎత్తున పెద్దపెద్ద నెర్రలు ఏర్పడి భూమి పైకి ఉబికింది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. ప్రాజెక్ట్ ప్రాంతానికి వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. 2019 ఫిబ్రవరి 24న మరోసారి స్పిల్‌వే రెస్టారెంట్ ఎదురుగా ప్రాజెక్ట్ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం పైకి ఉబికి బీటలువారి పగుళ్లు తీసింది. రెస్టారెంట్ చుట్టూ ఉన్న సిమెంట్ కట్టడాలు పగిలిపోయాయి. రెస్టారెంట్ లోపల గచ్చు విడిపోయింది. అప్పట్లో ప్రాజెక్ట్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని రోడ్డు మార్గాన్ని సరిచేశారు. తిరిగి శనివారం మూడోసారి 902 హిల్ వ్యూ ప్రాంతంలోనూ అదేవిధంగా ఘటన చోటుచేసుకుంది. భూమిపై రెండు అడుగుల వెడల్పున గోతులు ఏర్పడ్డాయి. 20 మీటర్ల పొడవున భూమి ఈ విధంగా బీటలువారింది. భూమికి పగుళ్లు ఏర్పడటంతో మెకానికల్ షెడ్లోని వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం అంతుబట్టని కారణాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఈ విధంగా భూమి పగుళ్లు తీసి బీటలు వారడానికి కారణాలేమిటో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాల్లో కొండల్ని తవ్వగా వచ్చిన రాళ్లను, మట్టిని యార్డు ప్రాంతంలో పరిమితికి మించి డంపింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి భూమి బీటలు వారుతోందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెకానిక్ షెడ్‌కు ఒక పక్కన హిల్ వ్యూ కొండను బ్లాస్టింగ్ చేసి రాయిని డంప్ చేస్తున్నారు. మరో వైపు స్పిల్‌ఛానల్‌లో మట్టి తవ్వకం పనులు సాగుతున్నాయి. స్పిల్‌ఛానల్ తవ్వకం వల్ల ఈ ప్రాంతంలో బీటలు ఏర్పడ్డాయా లేక బ్లాస్టింగ్ల వల్లా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ భారీ ఎత్తున డంపింగ్ చేయడం వల్లే ఈ విధంగా బీటలు వారుతున్నాయా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల వల్ల పోలవరం వాసులతోపాటు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రజలు కూడా సతమతమవుతున్నారు. ఈ పగుళ్లు మరింత పెరిగితే ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింటుదేమోనని భయాందోళన చెందుతున్నారు. -
పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి కుంగిన భూమి
సాక్షి, పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టు వద్ద మరోమారు భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమి బీటలు వారుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతానికి సమీపంలో భూమి 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే స్పిల్‌వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల సైతం భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్టారెంట్ సిబ్బంది భయకంపితులై బయటకు పరుగులు తీశారు. నాలుగు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పరిసరాల్లో మూడు సార్లు భూమి కుంగినప్పటికీ.. దీనికి గల కారణాలను అధికారులు పరిశోధించలేదు. జాతీయ ప్రాజెక్టు వద్ద ఈ విధంగా జరుగుతున్నప్పటికీ.. అధికారుల నిర్లక్ష్య ధోరణి కనబరచడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలతో ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. పోలవరం కాంట్రాక్టు సంస్థలు ఏమీ లేదంటూ బాధ్యతా రహిత్యంగా ప్రకటన జారీ చేశాయి. -
పోలవరంలో పగుళ్ల కలకలం
పశ్చిమగోదావరి జిల్లా: పోలవరం ప్రాజెక్టు సమీపంలో మరోసారి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు స్పిల్‌వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో దూర ప్రాంతాలను నుంచి పోలవరాన్ని సందర్శించేందుకు వచ్చిన వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో కూడా పోలవరం స్లూయిస్‌కు అతిసమీపంలో ప్రాజెక్టు వద్ద భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్లు ఏర్పడినపుడు అక్కడే ఉన్న సందర్శకులు పరుగులు పెట్టినట్లు తెలిసింది. పగుళ్లు ఏర్పడటానికి భౌగోళిక పరిస్థితులు కారణమై ఉండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు. ప్రాజెక్టు లోపల తవ్విన మట్టిని బయటకు తీసుకువచ్చి ఒక చోట డంపింగ్ చేయడం, దానిపైనే నిర్మాణాలు చేపట్టడం, కాలక్రమేణా భూమిలో మార్పులు సంభవించడం, ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో పేలుళ్లు జరిపినపుడు వదులుగా ఉన్న భూమి పగుళ్లు ఏర్పడటానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఇలానే దాదాపు ఒకటిన్న కిలోమీటర్ల తారు రహదారి మొత్తం తవ్వేసినట్లు పగుళ్లు ఏర్పడినపుడు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. సుమారు రూ.100 కోట్లు వెచ్చించి సందర్శకుల పేరుతో టీడీపీ కార్యకర్తలను బస్సుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తెప్పించిన ప్రభుత్వం, ఇలాంటి సంఘటనలు జరిగినపుడు తీసుకోవాల్సిన చర్యలపై ఖర్చు చేస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు. -
ముక్కలు ముక్కలుగా చీలిపోయిన పోలవరం రోడ్లు
-
పోలవరం ప్రాజెక్టు రోడ్డుకు బీటలు.. అందుకే
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్(జలాశయం) రహదారి హఠాత్తుగా 20 అడుగులు ఎగదన్ని.. నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా చీలిపోవడంతో నాణ్యతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తవ్విన మట్టి నిల్వ చేసే డంపింగ్ యార్డు కోసం మడుగులను విధ్వంసం చేయడం, కమీషన్ల కోసం నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోలవరం పనుల్లో నాణ్యత లోపాలను కాగ్ ఎత్తిచూపినా, సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పిల్‌వే పనులు నాసిరకంగా ఉన్నాయని తేల్చిచెప్పినా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్య పెట్టలేదు. పోలవరం హెడ్ వర్క్ (జలాశయం) పనులను రూ. 4,054 కోట్లకు దక్కించుకున్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వాటిని చేసే సత్తా లేదని, టెండర్ల ద్వారా సమర్థవంతమైన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలంటూ 2014 డిసెంబర్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, రిటైర్డు సీఎస్ దినేష్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సత్తా లేని కాంట్రాక్టర్‌కే వంతపాడింది. జలవనరుల విధ్వంసం పాపం సర్కార్‌దే.. పోలవరం హెడ్‌వర్క్స్‌లో మట్టి తవ్వకం పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు నామినేషన్‌పై ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. తవ్విన మట్టిని తరలించడానికి రహదారి, మట్టిని నిల్వ చేయడానికి స్థలాన్ని కాంట్రాక్టరే సేకరించుకోవాలి. దీనికి విరుద్ధంగా డంపింగ్ యార్డ్‌కు(మట్టిని నిల్వ చేయడానికి) అవసరమైన భూమిని రూ.32.66 కోట్లు వెచ్చించి సర్కారే కొనుగోలు చేసి కాంట్రాక్టర్‌కు సమకూర్చింది. దీన్ని కాగ్(కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో తప్పుబట్టింది. డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన భూమిలో పెద్ద మడుగులు ఉండేవి. సమీపంలోని కొండల్లో కురిసిన వర్షపు నీరు ఈ మడుగుల ద్వారానే గోదావరిలో కలిసేది. జలవనరులను పరిరక్షించాల్సిన సర్కారే వాటిని విధ్వంసం చేయడం గమనార్హం. తవ్విన మట్టిని తరలించడానికి సర్కార్ నిధులతోనే కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. వంద టన్నులు సామర్థ్యంతో కూడిన వాహనాలు తిరిగే ఈ రహదారిని అత్యంత నాసిరకంగా నిర్మించారు. హెడ్ వర్క్స్‌లో తవ్విన మట్టిని, సమీపంలోని రహదారికి ఇరువైపులా సర్కార్ సేకరించిన భూమిలో నిల్వ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకూ హెడ్ వర్క్స్‌లో తవ్విన 8.93 కోట్ల టన్నుల మట్టిని ఇక్కడే నిల్వ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండల్లో నుంచి వర్షపు నీరు ఈ డంపింగ్ యార్డ్‌లోకే చేరింది. దీంతో డంపింగ్ యార్డ్‌లోని మట్టి రోజురోజుకు ఎగదన్నుతూ వచ్చింది. దీని ప్రభావం వల్లే నాసిరకంగా నిర్మించిన రహదారి నెర్రెలు బారి.. చీలిపోయి ధ్వంసమైంది. డంపింగ్ యార్డ్, రహదారి నిర్మాణంలో రాష్ట్ర సర్కార్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇదంతా జరిగేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాసిరకం పనులతో భారీ మూల్యం తప్పదు.. రహదారి పనుల్లో నాణ్యతా లోపాలు, డంపింగ్ యార్డ్ ఏర్పాటులో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు యథాప్రకారం అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. మట్టిలో తేమ శాతం తగ్గిందని, వాతావరణంలో మార్పుల వల్ల మట్టి ఉబికి రావడం సహజమని, దీని వల్లే రహదారి నెర్రెలు బారిందని అటు సీఎం చంద్రబాబు, ఇటు పోలవరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. అయితే డంపింగ్ యార్డ్ కోసం చిన్న నీటి వనరులను ధ్వంసం చేయడం, పనులు నాసిరకంగా ఉండటం వల్లే రహదారి ముక్కముక్కలైందని ఎన్జీఆర్ఐ(నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో నీటిని నిల్వ చేసే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులను నాసిరకంగా చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పనులను సీఎస్ఎంఆర్ఎస్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగం, ఎన్జీఆర్ఐ ద్వారా తనిఖీలు చేయించి నాణ్యతను నిర్దారించుకున్న తర్వాతే బిల్లులు చెల్లించాలని గట్టిగా సూచిస్తున్నాయి. -
పోలవరం ప్రాజెక్టు వద్ద అకస్మాత్తుగా నెర్రలుబాసిన రోడ్డు
-
పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం
సాక్షి, పోలవరం/ పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. రోడ్డంతా పెద్ద పెద్ద నెర్రెలు బాసింది. దీంతో భూకంపం వచ్చిందన్న భయంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి ఆ రోడ్డు గుండా రాకపోకలు నిలుపుదల చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంజనీరింగ్ అధికారులు అధికారులు పగులు తీసిన ప్రాంతాన్ని పరిశీలించారు. భూ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోవడం వల్లనే రోడ్డు పైకి చొచ్చుకుని వచ్చిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న పోలవరం డంపింగ్ కారణంగానే భూమి నెర్రలు తీసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రహదారిని మూసివేయడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమేమీ లేదు.. పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదమేమీ లేదని ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిశోధన మరియి హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాంతంలో ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పోలవరం ప్రాంతాన్ని సమీక్షిస్తున్న ఆర్డీజీఎస్ అధికారులు ఈ మేరకు తెలిపారు. -
భారీ వర్షాల ధాటికి ముంబై అతలాకుతలం
-
భారీ వర్షాలు : మరో వంతెనకు పగులు
ముంబై : భారీ వర్షాల ధాటికి ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రెండు బ్రిడ్జిలకు పగుళ్లు రాగా, తాజాగా ఘట్కోపూర్ రైల్వే స్టేషన్లో ఉన్న పాదచారులు వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదకర స్థాయిలో పగుళ్లు ఏర్పడటంతో దీన్ని మూసి వేశారు. 40-50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు పలుమార్లు మరమ్మత్తులు చేశారు. అయితే, భారీ వర్షాల కారణంగా వంతెన పూర్తిగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. మహారాష్ట్రలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గోవా, దక్షిణ గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
ముంబైలో బ్రిడ్జికి పగుళ్లు
సాక్షి, ముంబై : భారీ కుండపోత వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలమైంది. బుధవారం గ్రాండ్ రోడ్ స్టేషన్ వద్ద గల బ్రిడ్డికి పగుళ్లు ఏర్పడ్డాయి. గ్రాండ్ రోడ్‌ను నానాచౌక్తో ఈ వంతెన కలుపుతుంది. పగుళ్లతో అప్రమత్తమైన పోలీసులు వాహనాలను మరోవైపు మళ్లించారు. ఈ మేరకు బ్రిడ్డికి పగుళ్లు వచ్చిన ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ట్రాఫిక్‌ను నానాచౌక్ వైపు నుంచి కెన్నెడీ బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, భారీ వర్షాల కారణంగా అంధేరి స్టేషన్ వద్ద మంగళవారం పాదచారుల వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు గాయపడ్డారు. అంధేరి ఘటనతో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నగరంలోని వంతెనలన్నీ పరిశీలిస్తామని తెలిపారు. -
ప్రతిష్టాత్మక ఫ్లై ఓవర్‌కు పగుళ్లు
న్యూఢిల్లీ : ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న హీరో హోండా చౌక్ ఫ్లై ఓవర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి కనీసం ఆరు నెలలు కూడా గడవటం లేదు. పగుళ్లు ఏర్పడటంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం తర్వాత ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. బ్రిడ్జిపై వాహనాలను అనుమతించక పోవడంతో సోమవారం ఈ రూట్లో భారీ ట్రాఫిక్ జాం అయింది. దీనిపై స్పందించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఒక రోజులో సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. -
కాంక్రీట్ పగుళ్లు పూడిపోతాయి!
ఇళ్లు, భవనాలు.. ఆఖరుకు వంతెనలైనా సరే.. కాంక్రీట్ వాడినప్పుడు కొంతకాలం తరువాత పగుళ్లు ఏర్పడటం సహజం. వాటిని గమనించి సకాలంలో పూడిస్తే మంచిదే... లేదంటే నిర్మాణం మొత్తం కూలిపోయే ప్రమాదముంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యూయార్క్‌లోని బింగ్హామ్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని కనుక్కున్నారు. కాంక్రీట్‌కు ప్రత్యేక రకానికి చెందిన ఫంగస్ (శిలీంధ్రం)ను చేరిస్తే.. పగుళ్లు వాటంతట అవే పూడిపోతాయని వీరు అంటున్నారు. కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినప్పుడు గాలి, నీరు అక్కడకు చేరుకుంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కాంక్రీట్‌లో ఫంగస్ తాలూకూ గుడ్లు (స్ఫోర్స్), పోషకాలూ ఉన్నాయనుకోండి... గాలిలోని ఆక్సిజన్, నీరును ఉపయోగించుకుని ఎదుగుతాయి. పెరిగే క్రమంలో ఇవి కాల్షియం కార్బొనేట్ (నత్తగుల్లల పెంకు ఈ పదార్థంతోనే తయారవుతుంది)ను విడుదల చేస్తాయి. ఫలితంగా అక్కడి చీలిక కాస్తా పూడిపోతుంది. ఆక్సిజన్, నీరు అందదు కాబట్టి ఫంగస్ మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. అయితే తమ పరిశోధన ప్రస్తుతానికి ప్రారంభ దశలో మాత్రమే ఉందని, మరింత విస్తృత పరిశోధన తరువాత గానీ ఈ ఫంగస్ కాంక్రీట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. -
అయిదు నెలల కనిష్టానికి రుపీ
-
అయిదు నెలల కనిష్టానికి రుపీ
ముంబై: దేశీయ కరెన్సీ శుక్రవారం మరింత బలహీనపడింది. డాలర్ మారకపు విలువలో రూపాయి 32పైసలు నష్టపోయి 68 దిగువకు పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ భారీగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభంలోనే పతనాన్ని నమోదు చేసింది. రూ.68 దిగువకు చేరి 5నెలల కనిష్టాన్నితాకింది. ప్రస్తుతం 25 పైసల నష్టంతో 68.08 వద్ద ట్రేడవుతోంది. దేశీస్టాక్స్లో ఎఫ్ఐఐల నిరవధిక అమ్మకాలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 14నెలల గరిష్టానికి చేరడం దిగుమతిదారుల నుంచి డాలర్ కు భారీ డిమాండ్ లాంటి అంశాలు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతోపాటుగా విదేశీ ఫండ్ ప్రవాహాల రూపాయిపై ఒత్తిడి ఉంచింది చేసిందని డీలర్లు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ యెల్లెన్ డిసెంబర్ లో క్రింది వడ్డీ రేటు పెంపు సూచనలు అందించడంతో డాలర్ మద్దతు లభించిందని చెబుతున్నారు. ఇది దేశీయ కరెన్సీని మరింత దెబ్బతీసిందన్నారు.. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభనష్టాలమధ్య ఊగిసలాడుతండగా,పసిడి ధరలు కూడా బలహీనంగానే ఉండటం గమనార్హం. -
పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు
* నాణ్యతా లోపంతో రహదారి నిర్మాణం * రోజుల వ్యవధిలోనే దెబ్బతిన్న వైనం * అతుకులతో కప్పిపెట్టే యత్నం పుష్కర పనులు పురిట్లోనే పనికిరాకుండా పోతున్నాయి. ఘాట్లు, అప్రోచ్‌రోడ్లు, తారు రోడ్లు, అంతర్గత రహదారులు నెలరోజులు కూడా గడవకముందే అధ్వానంగా మారాయి. వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి చేపట్టిన అనేక పనుల్లో నాణ్యత నాసిరకంగా ఉంది. కొల్లూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన అనేక పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నాణ్యతకు పాతరేశారు. ఏ మాత్రం ప్రమాణాలు పట్టించుకోకుండా పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. అడుగేస్తేనే బీటీ రోడ్డు బెతెకలు కాలి వెంట లేసి వచ్చేలా ఉన్నాయంటే ఎలా చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రూ. 3.3 కోట్లు వెచ్చించి చేపట్టిన రహదారి పనులు జరగుతుండగానే తారు బెతెకలు ఊyì పోవడం, నాణ్యతా లోపాలు బహిర్గతమయిన చోట గుత్తేదారు తిరిగి అతుకులు వేసినా పలితం కనిపించడంలేదు. అతుకులు వేసిన ప్రాంతంతో తిరిగి రహదారి ఛిద్రమవుతుండటం రహదారి మన్నికకు ప్రశ్నార్థకంగా మారింది. చెక్కుచెదరకుండా లక్షణంగా ఉన్న పాత రోడ్డును పెకిలించి పుష్కర నిధులతో నిర్మిస్తున్న రోడ్డులో నాణ్యతా ప్రమాణాల లోపం కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో కలసి ఉన్న పది లంక గ్రామాల ప్రజలకు కొత్తగా నిర్మించిన రహదారి కన్నీటిని మిగుల్చుతోంది. నాణ్యతకు తిలోదకాలు... 10.08 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారి పనులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొల్లూరు మండలంలోని పెసర్లంక నుంచి జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గ గ్రామాలు, కృష్ణా జిల్లాలోని మరో రెండు గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే మార్గ నిర్మాణ పనులు నీటి పాలయ్యాయి. పుష్కరాలకు ముందు హడావిడిగా రోడ్డు పనులు జరుగుతుండగానే వేసిన రోడ్డు వేసినట్లు బీటలు వారి తారు బెతెకలు ఊడి మెటల్ బయట పడటం రహదారి నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల బాగోతం తేటతెల్లమైంది. కొల్లిపర మండలం అన్నవరపులంక, కృష్ణా జిల్లా కనిగిరిలంక వద్ద రహదారి నిర్మించి నాలుగు రోజులు గడకుండానే రోడ్డు అంచులు వెంబడి మొదలయ్యి రోడ్డు మొత్తం ఛిద్రమైపోవడం ఆరంభమైంది. చెక్కుచెదరని రోడ్డును పెకిలించారు.. గతంలో ఆరేళ్ళ కిందట నిర్మించిన రహదారి చింతర్లంక, చిలుమూరులంక, అన్నవరపులంక ప్రాంతాల్లో కిలోమీటరున్నర మినహా ఎక్కడా చెక్కుచెదరకుండా లక్షణంగా ఉంది. సవ్యంగా ఉన్న రోడ్డును నూతన రోడ్డు పేరుతో పెకిలించేసి తూతూ మంత్రంగా ముగించడంపై ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటలకు నెలవైన ఈ ప్రాంతంలో ఈ మార్గం ద్వారా కంద, అరటి, పసుపు, వంటి వాణిజ్య పంటల తరలింపుకు అధిక బరువులతో వాహనాలు తిరగాల్సి ఉంది. సుమారు ఆరువేల మంది జనాభా నివసిస్తున్న లంక గ్రామాల్లో రవాణా సౌకర్యంకు ఏకైక ప్రధాన మార్గపు పనులు తీసికట్టుగా మారాయి. రెండు లేయర్లతో బీటీ రోడ్డు వేశాం.. రహదారి పనుల్లో ఎటువంటి లోపం తలెత్తకుండా పర్యవేక్షించాం. గ్రామాలున్నంత వరకూ రహదారి పాడవకుండా రెండులేయర్లతో బీటీ రోడ్డు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఒకే లేయర్‌తో రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతంలో రహదారి పాడవడానికి అవకాశం లేదు. రహదారిని పరిశీలించి తక్షణం లోపాలను సవరిస్తాం. – మల్లికార్జునరావు, ఆర్ అండ్‌బీ డీఈ, తెనాలి