ముంబై : భారీ వర్షాల ధాటికి ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రెండు బ్రిడ్జిలకు పగుళ్లు రాగా, తాజాగా ఘట్కోపూర్ రైల్వే స్టేషన్‌లో ఉన్న పాదచారులు వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదకర స్థాయిలో పగుళ్లు ఏర్పడటంతో దీన్ని మూసి వేశారు.
40-50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు పలుమార్లు మరమ్మత్తులు చేశారు. అయితే, భారీ వర్షాల కారణంగా వంతెన పూర్తిగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. మహారాష్ట్రలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
గోవా, దక్షిణ గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment