ముంబైలో బ్రిడ్జికి పగుళ్లు | Huge Cracks Develop On Grand Road Station Bridge In Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో బ్రిడ్జికి పగుళ్లు

Published Wed, Jul 4 2018 5:10 PM | Last Updated on Wed, Jul 4 2018 8:05 PM

Huge Cracks Develop On Grand Road Station Bridge In Mumbai - Sakshi

బ్రిడ్జిపై పగుళ్లు

సాక్షి, ముంబై : భారీ కుండపోత వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలమైంది. బుధవారం గ్రాండ్‌ రోడ్‌ స్టేషన్‌ వద్ద గల బ్రిడ్డికి పగుళ్లు ఏర్పడ్డాయి. గ్రాండ్‌ రోడ్‌ను నానాచౌక్‌తో ఈ వంతెన కలుపుతుంది. పగుళ్లతో అప్రమత్తమైన పోలీసులు వాహనాలను మరోవైపు మళ్లించారు. ఈ మేరకు బ్రిడ్డికి పగుళ్లు వచ్చిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ట్రాఫిక్‌ను నానాచౌక్‌ వైపు నుంచి కెన్నెడీ బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, భారీ వర్షాల కారణంగా అంధేరి స్టేషన్‌ వద్ద మంగళవారం పాదచారుల వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు గాయపడ్డారు. అంధేరి ఘటనతో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నగరంలోని వంతెనలన్నీ పరిశీలిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement