సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపాన్‌గా మారనుంది తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా అల్పపీడనం జూన్ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్ మహారాష్ట్రను దాటే క్రమంలో ముంబై నగరంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్రా పేర్కొన్నారు. సోమవారం ఉదయం అల్పపీడనం ఉధృతంగా మారినట్లు తెలిపారు. (నీతి ఆయోగ్‌లో కోవిడ్-19 కలకలం)
ఇక ముంబైకి 700 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 105 నుంచి 110 కిలో మీటర్ల వేగంగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ ప్రాంతాల్లో ఓ మోస్తర్ వర్షం కురిసింది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లే మత్సకారులను మూడు, నాలుగు రోజులు వెళ్లవద్దని కోరారు. రానున్న రెండు రోజుల్లో త్రీవ తుపాన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment