న్యూఢిల్లీ : ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న హీరో హోండా చౌక్ ఫ్లై ఓవర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి కనీసం ఆరు నెలలు కూడా గడవటం లేదు. పగుళ్లు ఏర్పడటంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం తర్వాత ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. బ్రిడ్జిపై వాహనాలను అనుమతించక పోవడంతో సోమవారం ఈ రూట్లో భారీ ట్రాఫిక్ జాం అయింది. దీనిపై స్పందించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఒక రోజులో సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment