ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో ప్రారంభించారు. ఎనిమిదిలైన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే తొలి ఎలివేటేడ్ హైవే. ఈ రహదారి ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య నేషన్‌నల్ హైవే 48పై ట్రాఫిక్‌ను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 4,100 కోట్లతో నిర్మించారు.
ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం రూ. 10,000 కోట్లతో నిర్మిస్తుండగా.. హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి . ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి ఆర్‌ఓబీ(10.2 కి.మీ), బసాయి ఆర్‌ఓబీ నుంచి ఖేర్కి దౌలా (క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్) (8.7 కి.మీ) వరకు. ఇక దేశవ్యాప్తంగా 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు, ఇవి ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైనవి.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of 114 road projects worth about Rs One Lakh Crore, in Gurugram, Haryana. pic.twitter.com/9ulZD98ncD
— ANI (@ANI) March 11, 2024
#WATCH : Drone Footage of Dwarka Expressway in Gurugram. #DwarkaExpressway #Gurugram #Delhi pic.twitter.com/9QTbcBdJoN
— shivanshu tiwari (@shivanshu7253) March 11, 2024
Comments
Please login to add a commentAdd a comment