ఏమైందో ఏమో ఉన్నటుండి ఒక్కసారిగా రహదారి బద్ధలై నీళ్లు ఫౌంటైన్ మాదిరి వెదజిమ్ముతూ బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉండే వారెవరికీ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇదేమైన మరో ప్రకృతి విపత్తా? అన్నట్లుగా జరిగిందా ఆ ఘటన. సరిగ్గా అదే సమయంలో స్కూటీపై పింక్ కలర్ దుస్తులతో ఒక అమ్మాయి వెళ్తోంది. ఈ హఠాత్పరిణామనికి వెదజిమ్ముతున్న నీటి కారణంగా కిందపడిపోవడమే గాక ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకుపోయింది.
అంత ఘోరంగా నీళ్లు పైకి ఎగదన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శనివారం రోడ్డు మధ్యలో చోటు చేసుకుంది. ఐతే చుట్టుపక్కల స్థానికులు ఆమెను రక్షించినట్లు సమాచారం. భూగర్భ పైప్ లైన్ పగిలిపోవడంతో నీటి ప్రవాహానికి రోడ్డు పెళపెళమంటూ.. విరిగిపోతూ నీళ్లు బయటకు ఉబికివచ్చేశాయి. దీంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి, ఆ రహదారి మొత్తం నీళ్లతో నిండిపోయి, కంకరాళ్లతో చెల్లచెదురుగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
#WATCH | Road cracked open after an underground pipeline burst in Yavatmal, Maharashtra earlier today. The incident was captured on CCTV. A woman riding on scooty was injured. pic.twitter.com/8tl86xgFhc
— ANI (@ANI) March 4, 2023
(చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!)
Comments
Please login to add a commentAdd a comment