![Supriya Sule's selfie with potholes - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/4/supriya_sule.jpg.webp?itok=3KI7fkkI)
సాక్షి, ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలే.. ట్విటర్ వేదికగా సెల్ఫీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ముంబైలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడ గుంతలు కనిపిస్తే అక్కడ ఆగి.. వాటితో ఒక సెల్ఫీ తీసుకుని ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ముంబై వాసులే కాకుండా మొత్తం మహారాష్ట్ర వాసులంతా.. ఇలా రహదారులపై ఎక్కడ గోతులు కనిపించినా.. సెల్ఫీలు తీసుకుని ట్విటర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ముందుగా ఆమె.. ముంబైలోని ప్రధాన రహదారిపై కనిపించిన గోతులతో సెల్ఫీ తీసుకుని ఆమె ట్విటర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్‌లకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మహరాష్ట్ర వాసుల కూడా ఇదే విధంగా ట్విటర్‌లో ఫొటోల మీదఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
ఈ పోస్టులపై మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వేగంగా స్పందించింది. రహదారి గుంతలను వెంటనే పూడ్చివేస్తూ.. పీడబ్ల్యూడీ వారు కూడా ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. సుప్రియా సూలేపై అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజా సమస్యలపై ఆమె తీసుకుంటున్న చొరవను అభినందించారు.
#Selfiewithpotholes at Katraj-Undri bypass & Bopdev ghat.@ChDadaPatil pic.twitter.com/IKUdOriSz5
— Supriya Sule (@supriya_sule) 1 November 2017
I want to thank every citizen and @supriya_sule tai for lending their support to #PotholeMuktMaha via Selfie with Potholes. (1/3)
— Chandrakant Patil (@ChDadaPatil) 1 November 2017
Comments
Please login to add a commentAdd a comment