సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో ఈ ఉదయం జరిగిన విషాదంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఎనిమిదేళ్ల దీక్షిత మృతి చెందిందని పోలీసులు చెబుతుండగా.. రోడ్డు గుంత కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని దీక్షిత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఘటనలో దీక్షిత తండ్రి కిషోర్‌కు సైతం గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించారు. అయితే.. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి స్థానిక ఆసుపత్రి వెంటనే డిశ్చార్జి అయ్యి బయటకు వచ్చాడు. ‘‘రోడ్లు నా కూతురును బలి తీసుకున్నాయి. నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడాయన. మరోవైపు బంధువులు తూర్పు గోదావరి జిల్లాలోని సొంతూరుకు దీక్షిత మృతదేహాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు.
బాచుపల్లిలో బైక్‌పై వెళ్తున్న సమయంలో.. గుంత కారణంగా బైక్‌పై నుంచి ఎగిరిపడి దీక్షిత కింద రోడ్డు మీద పడిపోయింది. ఆ సమయంలో వేగంగా ఓ స్కూల్‌కు చెందిన మినీ వ్యాన్ ఆమె పైనుంచి వెళ్లిందన్నది తండ్రి వాదన. అయితే.. మినీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించి డ్రైవర్‌ను డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్థానికంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment