Dikshita
-
సముద్రమంత ఆత్మవిశ్వాసం
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్‌పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్‌కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్‌లాండ్, పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్ని.– పూతన మాన్యరెడ్డినీళ్లు చూస్తే భయం వేసిందినాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.– కొమరవెల్లి దీక్షితఅక్కను చూసి...అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్‌లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్‌లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను. – కొమరవెల్లి లహరిభారత్తో పాటు సౌత్కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్‌లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.హైదరాబాద్ ఈస్ట్మారేడ్పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్‌లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.పేదరికం అడ్డుకాదు‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్‌లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా అవసరం. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్‌తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్ని ఎంచుకున్నాను. ఏప్రిల్‌లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్‌లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.– ప్రీతి కొంగర– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బాచుపల్లి: రోడ్డు గుంతలే నా బిడ్డను బలిగొన్నాయి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో ఈ ఉదయం జరిగిన విషాదంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఎనిమిదేళ్ల దీక్షిత మృతి చెందిందని పోలీసులు చెబుతుండగా.. రోడ్డు గుంత కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని దీక్షిత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘటనలో దీక్షిత తండ్రి కిషోర్‌కు సైతం గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించారు. అయితే.. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి స్థానిక ఆసుపత్రి వెంటనే డిశ్చార్జి అయ్యి బయటకు వచ్చాడు. ‘‘రోడ్లు నా కూతురును బలి తీసుకున్నాయి. నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడాయన. మరోవైపు బంధువులు తూర్పు గోదావరి జిల్లాలోని సొంతూరుకు దీక్షిత మృతదేహాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. బాచుపల్లిలో బైక్‌పై వెళ్తున్న సమయంలో.. గుంత కారణంగా బైక్‌పై నుంచి ఎగిరిపడి దీక్షిత కింద రోడ్డు మీద పడిపోయింది. ఆ సమయంలో వేగంగా ఓ స్కూల్‌కు చెందిన మినీ వ్యాన్ ఆమె పైనుంచి వెళ్లిందన్నది తండ్రి వాదన. అయితే.. మినీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించి డ్రైవర్‌ను డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్థానికంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది. -
పంచామృత ప్రవాహం
ఒకానొకనాడు దక్షిణ భారతదేశం అంతటా సంగీతం ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే... కేవలం రాజులమీద పాటలు చెప్పడం... ఇంకా ఎంత హీనస్థితికి దిగజారిపోయిందంటే... రాజుల ప్రియురాళ్లు, ఆ స్థానాలలో నృత్యం చేసే రాజనర్తకులైన వాళ్లమీద పాటలు కట్టి రాజులు ఇచ్చే పడుపు కూడు తిని సంతోషించే స్థాయికి సంగీతకారులు వెళ్లిపోయారు. ఇది నాదోపాసన. ఇలా భ్రష్టుపట్టకూడదన్నది దైవ చింతన కాబోలు.ఇలాభోగం స్థలాభోగం–అని ఆ తిరువాయూరు చేసుకున్న అదృష్టమేమో గానీ అక్కడ ముగ్గురు వాగ్గేయకారులు ఒకే కాలంలో ఐదేసి సంవత్సరాల వ్యవధిలో జన్మించారు. వీరిలో మొదట జన్మించినవారు శ్యామ శాస్త్రిగారు. గొప్ప శ్రీవిద్యోపాసకుడు. అమ్మవారి దగ్గరకెళ్లి ఒక్కో కీర్తన చేస్తుంటే... ఆ తల్లి బుగ్గలు ఎరుపెక్కిపోయి కొడుకుని చూసుకుని మురిసిపోయేదట. అటువంటి శ్యామ శాస్త్రిగారి దగ్గర పాదుకాంత దీక్ష పుచ్చుకున్న వారు ముత్తుస్వామి దీక్షితులు. వీరు మూడవవారు. మధ్యలో వారు త్యాగరాజు. త్యాగరాజు తల్లిదండ్రులు రామబ్రహ్మం, సీతాదేవి. వారికి మొదట ఇద్దరు కుమారులు జన్మించారు. వారిద్దరూ సమాజం నుండి ప్రశంసలందుకున్నవారు కాదు. అదే ఊరి కోవెలలో వెలిసి ఉన్న పరమేశ్వరుడిని త్యాగరాజుగా అక్కడి భక్తజనులు సేవిస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పుత్ర సంతానాన్ని కటాక్షిస్తే ‘నీ పేరు పెట్టుకుంటాం’ అని ఆ తల్లిదండ్రులు మొక్కుకునేవారు. ఆయన అనుగ్రహం కలిగి వారికి మూడవ సంతానంగా కుమారుడు కలిగితే ‘త్యాగరాజు’ అని పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తల్లికి సంగీతంలో ప్రవేశం ఉంది. ఆమె పురంధరదాసు, అన్నమయ్య కీర్తనలు పాడుతుండేవారు. చిన్నతనం నుండీ త్యాగరాజు అమ్మ వెనకే తిరుగుతూ తను కూడా తల్లి గొంతుతో గొంతు కలిపి పాడుతుండేవాడు. అది తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. అలా ఉండగా ఒకనాడు ఆయన ఒక కీర్తన రాశారు. అంటే కూర్చుని రాసింది కాదు. అమ్మ పాడుతూ ఉంటే, ఆ పాట విని ప్రేరణ పొంది, ఆ సీతారాముల పాదాలను మనసులో తలచుకోవడంవల్ల కలిగిన ఆనందం లోపల ఆగలేక.. నిండిపోయిన బిందె అంచుల వెంట నీరు కారిపోయినట్టు.. వారి నోటి వెంట అలవోకగా పంచామృత ప్రవాహమై ప్రవహించి కీర్తనయింది. అదే..‘రఘురామ...స్వామీ, నీకు జయమగుగాక..’. ఇదే ఆయన మొట్టమొదటి కీర్తన. ఆశ్చర్యపోయిన తండ్రి దానిని పండితులకు చూపితే, వారు కూడా మెచ్చుకోవడంతో ఎంత బంగారపు పళ్లెమయినా గోడ చేరుపు కావాలన్నట్లు ఒక గురువుగారి దగ్గర సుశిక్షితుడైతే బాగుంటుందనిపించి శొంఠి వేంకటరమణయ్య దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పెట్టారు. అలా ఉండగా త్యాగరాజుకు కలిగిన ఆర్తి... ఆ పరమేశ్వరుడికి వినపడింది. సాక్షాత్తూ సంగీతంలో దిట్టయిన నారద మహర్షి రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చి ఆ పిల్లవాడికి రామ మంత్రాన్ని ఉపదేశించారు. బాల త్యాగరాజు ఎంత నిష్ఠగా చేసేవాడంటే.. రోజుకు లక్షా 25వేల సార్లు రామ మంత్రాన్ని జపం చేయడంతో శరీరమంతా మంత్రపుటమైపోయింది. శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీత పాఠాలు ఎంత అభ్యసించినా కొన్ని కొన్ని సార్లు అనేకానేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతుండేవి. దీనిని తీర్చడానికా అన్నట్లు రామకృష్ణానంద స్వామివారే మరల వచ్చి స్వరార్ణవమనే గ్రంథాన్ని ఆయనకు బహూకరించారు. అలా మరే ధ్యాస లేకుండా త్యాగరాజు సంగీత సాధన సాగింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
లిఫ్టర్ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో 58 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ఎర్ర దీక్షితను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దీక్షిత తన తల్లిదండ్రులు వినోద, కేశవ రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రగతి భవన్లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా దీక్షితకు ప్రోత్సాహకంగా రూ.15 లక్షల నగదు బహుమానాన్ని సీఎం ప్రకటించారు. దీక్షితకు శిక్షణ ఇచ్చిన కోచ్ పి.మాణిక్యాలరావుకు రూ.3 లక్షల నజరానా ప్రకటించారు. -
స్వర్ణం నెగ్గిన దీక్షిత
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత లిఫ్టర్లు పది పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట పట్టణానికి చెందిన దీక్షిత స్నాచ్‌లో 73 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 94 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 167 కేజీలతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. యూత్ బాలుర 62 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా స్వర్ణం, జూనియర్ పురుషుల విభాగంలో రజతం గెలిచాడు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో సరస్వతి రౌత్ కాంస్యం నెగ్గింది. యూత్ బాలుర, జూనియర్ పురుషుల 69 కేజీల విభాగంలో దీపక్ లాథెర్ రెండు స్వర్ణాలు, సీనియర్ పురుషుల విభాగంలో కాంస్యం సాధించాడు. సీనియర్ మహిళల 63 కేజీల విభాగంలో వందన గుప్తా కాంస్యం... యూత్ బాలికల, జూనియర్ మహిళల 63 కేజీల విభాగంలో ఉమేశ్వరి దేవి కాంస్య పతకాలను సాధించింది. మరోవైపు 2019 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.