స్వర్ణం నెగ్గిన దీక్షిత
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత లిఫ్టర్లు పది పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట పట్టణానికి చెందిన దీక్షిత స్నాచ్‌లో 73 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 94 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 167 కేజీలతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. యూత్ బాలుర 62 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా స్వర్ణం, జూనియర్ పురుషుల విభాగంలో రజతం గెలిచాడు.
సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో సరస్వతి రౌత్ కాంస్యం నెగ్గింది. యూత్ బాలుర, జూనియర్ పురుషుల 69 కేజీల విభాగంలో దీపక్ లాథెర్ రెండు స్వర్ణాలు, సీనియర్ పురుషుల విభాగంలో కాంస్యం సాధించాడు. సీనియర్ మహిళల 63 కేజీల విభాగంలో వందన గుప్తా కాంస్యం... యూత్ బాలికల, జూనియర్ మహిళల 63 కేజీల విభాగంలో ఉమేశ్వరి దేవి కాంస్య పతకాలను సాధించింది. మరోవైపు 2019 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.