Commonwealth Weightlifting Championship
-
Ajay Singh: అజయ్ సింగ్‌కు స్వర్ణ పతకం!
Weightlifter Ajay Singh Wins Gold Medal: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్ 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అతను ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించాడు. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు లభించాయి. జెరెమీ లాల్రినుంగా (67 కేజీలు), అచింత షెయులి (73 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు దక్కించుకొని బర్మింగ్హమ్ గేమ్స్‌కు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
స్వర్ణం నెగ్గిన దీక్షిత
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత లిఫ్టర్లు పది పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట పట్టణానికి చెందిన దీక్షిత స్నాచ్‌లో 73 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 94 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 167 కేజీలతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. యూత్ బాలుర 62 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా స్వర్ణం, జూనియర్ పురుషుల విభాగంలో రజతం గెలిచాడు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో సరస్వతి రౌత్ కాంస్యం నెగ్గింది. యూత్ బాలుర, జూనియర్ పురుషుల 69 కేజీల విభాగంలో దీపక్ లాథెర్ రెండు స్వర్ణాలు, సీనియర్ పురుషుల విభాగంలో కాంస్యం సాధించాడు. సీనియర్ మహిళల 63 కేజీల విభాగంలో వందన గుప్తా కాంస్యం... యూత్ బాలికల, జూనియర్ మహిళల 63 కేజీల విభాగంలో ఉమేశ్వరి దేవి కాంస్య పతకాలను సాధించింది. మరోవైపు 2019 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
సంతోషికి రజతం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి సత్తా చాటింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రజత పతకాన్ని సాధించింది. మంగళవారం జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్‌గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన సంజిత చాను ఓవరాల్‌గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలవడంతో పాటు స్నాచ్ విభాగంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె ఫైనల్లో ఓవరాల్‌గా 189 కేజీల బరువునెత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తాజాగా స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న రికార్డు (84 కేజీలు)ను తిరగ రాసింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు. -
శివమ్ సైనికి స్వర్ణం
పెనాంగ్ (మలేసియా): కామన్వెల్త్ వెరుుట్లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత లిఫ్టర్ శివమ్ సైనీ రెండు పతకాలు సాధించాడు. జూనియర్ విభాగంలో సైని స్నాచ్‌లో 132 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 168 కిలోలు బరువు ఎత్తి స్వర్ణం సాధించాడు. ఇక సీనియర్ 94 కేజీల విభాగంలో శివమ్ సైనీ రజతం గెలిచాడు. స్నాచ్‌లో 132, క్లీన్ అండ్ జర్క్‌లో 168లతో మొత్తం 300 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. -
భారత లిఫ్టర్లకు 5 స్వర్ణాలు
పుణే: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. పోటీల రెండో రోజు మంగళవారం భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ 325 కేజీలు బరువెత్తి పసిడి పతకాన్ని సాధించాడు. గతేడాది గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సతీశ్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. యూత్ పురుషుల 69 కేజీల విభాగంలో లాలూ టకూ (282 కేజీలు), యూత్ మహిళల 58 కేజీల విభాగంలో నుంగ్షిటాన్ (157 కేజీలు), జూనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో కోజుమ్ తాబా (296 కేజీలు) కూడా భారత్‌కు పసిడి పతకాలు అందిచారు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో మినాతి (194 కేజీలు) కాంస్యం, 77 కేజీల జూనియర్ విభాగంలో అజయ్ సింగ్ (290 కేజీలు) రజత పతకం గెల్చుకున్నారు.