
Weightlifter Ajay Singh Wins Gold Medal: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్ 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అతను ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించాడు.
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు లభించాయి. జెరెమీ లాల్‌రినుంగా (67 కేజీలు), అచింత షెయులి (73 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు దక్కించుకొని బర్మింగ్‌హమ్ గేమ్స్‌కు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment