ప్రాణం తీసిన రోడ్డు గుంత.. వైరల్‌ | Pothole Death Mumbai Woman on Bike Crushed Under Bus | Sakshi
Sakshi News home page

Jul 9 2018 11:01 AM | Updated on Oct 8 2018 5:45 PM

Pothole Death Mumbai Woman on Bike Crushed Under Bus  - Sakshi

సీసీ టీవీ ఫుటేజీల్లో భయానక యాక్సిడెంట్‌ రికార్డయ్యింది. రోడ్డు గుంతలో బైక్‌ అదుపుతప్పి పడిపోగా, బస్సు కింద నలిగి ఓ మహిళ దుర్మరణం పాలైంది. ముంబైలో జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న ఓ షాపు సీసీ ఫుటేజీల్లో రికార్డుకాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

సాక్షి, ముంబై: థానే జిల్లా కళ్యాణ్‌లో ఓ స్కూల్లో పని చేస్తున్న మనీషా బోయిర్‌(40) తన బంధువు బైక్‌పై శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తోంది. శివాజీ చౌక్‌కు చేరుకోగానే బైక్‌ గుంతలో పడి అదుపుతప్పి ఆమె కింద పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రైవేట్‌ బస్సు పక్కనుంచి వెళ్తుండగా, వెనక టైర్‌ కింద ఆమె పడిపోవటం.. కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. సురక్షితంగా బయటపడ్డ ఆ వ్యక్తి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

ఘటన తర్వాత డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోగా.. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్షకాలంలో వేగంగా వెళ్లటం మంచిది కాదని వాహనదారులకు అధికారులు జాగ్రత్తలు సూచిస్తుండగా. మరోవైపు ఆదివారం స్థానికులే రోడ్డుపై గుంతలను పూడ్చటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement