సాక్షి, యాదగిరిగుట్ట : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రానున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వరంగల్ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌కు తిరుగుప్రయాణంలో మార్గ మధ్యలో ఉన్న యాదాద్రికి మధ్యాహ్నం 2నుంచి 4గంటల మధ్యలో హెలికాప్టర్‌లో ఎప్పుడైనా చేరుకోనున్నట్లు అధి కారులు తెలిపారు. తొలుత బాలాలయంలో శ్రీస్వామి వారిని దర్శించుకొని ఆ తరువాత పనులను పరి శీలించనున్నారు. ప్రధానాలయానికి బెంగళూర్ లై టింగ్ టెక్నాలజీ సంస్థ వేసిన విద్యుత్ లైట్లను పరిశీ లించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకంటే ముందే ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండ కింద జరుగుతున్న అభివృద్ధి పనులను చూడనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొండపై గల అతి థిగృహంలో వైటీడీఏ అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.
యాదాద్రికి 15వ సారి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 4వ తేదీన యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. సీఎం హోదాలో 15వ సారి సోమవారం మరోమారు పనులను పరిశీలించి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం వైటీడీఏ, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోసారి విద్యుత్ దీపాల ట్రయల్ రన్
ప్రధానాలయ తూర్పు, ఉత్తర రాజగోపురాలు పసిడి కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల ను అధికారులు ఆదివారం రాత్రి మరోమారు ట్ర యల్ రన్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ లైటింగ్‌ను పరిశీలించనున్న నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపం, సాలహారాల్లో విగ్రహాలతో పాటు ప్రధానాలయంలోఆళ్వార్ పిల్లర్లకు వేసిన విద్యుత్ దీపాలను సరిచేశారు.
పనుల్లో పెరిగిన వేగం
సీఎం రాకను పురస్కరించుకొని వైటీడీఏ అధికా రు లు ఆలయ పనుల్లో వేగం పెంచారు. కొండపై శివా లయం వద్ద మెట్ల దారి నిర్మాణం, బాలాలయానికి వెళ్లే దారిలో పైప్‌లైన్ వేసి మట్టిని పూడ్చివేత, పారాఫిట్ వాల్‌పై విద్యుత్ దీపాల బిగింపు, ఉత్తరం దిక్కు రిటైర్నింగ్ వాల్ నిర్మాణం, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, పుష్కరిణి, ప్రెసిడెన్షియల్ సూట్‌లో పనులను వేగంగా చేయిస్తున్నారు. వైకుంఠద్వా రం వద్ద సర్కిల్ నిర్మాణంతో పాటు పాతగుట్ట చౌర స్తా వరకు ఇళ్లు, దుకాణాలు కూల్చివేసే పనులను ముమ్మరం చేశారు.
పోలీసు బందోబస్తు
టెంపుల్ సిటీపై ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంట్ వేసుకొని గస్తీ నిర్వహిస్తున్నారు. గుట్టపైకి వచ్చివెళ్లే వాహనా లను తనిఖీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment